ఐపీఎల్ 2022 సీజన్‌లో ముంబై ఇండియన్స్ ప్రదర్శన గురుంచి సంగతి తెలిసిందే. సీజన్‌లో 14 మ్యాచ్‌లాడిన ముంబై ఇండియన్స్ 4 విజయాలు.. 10 ఓటములతో పాయింట్ల పట్టికలో ఆఖరి స్థానంలో నిలిచింది. ఐపీఎల్ చరిత్రలో ఐదుసార్లు చాంపియన్‌గా నిలిచిన ఒక జట్టు ఇలాంటి ప్రదర్శన చేయడం క్రికెట్ ఫ్యాన్స్ కూడా జీర్ణించుకోలేకపోయారు. అయితే ముంబై ఇండియన్స్ జట్టుగా విఫలమైనా.. ఒకరిద్దరు మాత్రం చెప్పుకోదగ్గ ప్రదర్శన చేశారు. అందులో సూర్యకుమార్ యాదవ్ ఒకరైతే.. మరొకరు తెలుగుతేజం తిలక్ వర్మ.
ఐపీఎల్ మెగా వేలంలో ముంబై ఇండియన్స్ రూ. 1.70 కోట్లకు తిలక్ వర్మను కొనుగోలు చేసింది. ఆ డబ్బుకు న్యాయం చేయడమే కాదు.. జట్టు కష్టాల్లో ఉన్న ప్రతిసారి ఆదుకున్నాడు. రోహిత్ శర్మ, కీరన్ పోలార్డ్, ఇషాన్ కిషన్..లాంటి దిగ్గజ క్రికెటర్లు పరుగులు చేయడానికి నానా తంటాలు పడుతుంటే.. తిలక్ వర్మ మాత్రం నిలకడగా ఆడటమే కాదు.. బౌలర్లను ధాటిగా ఎదుర్కునేవాడు. ఈ సీజన్ లో 14 మ్యాచ్‌లాడిన తిలక్ వర్మ 397 పరుగులు సాధించాడు. ఇందులో రెండు అర్థసెంచరీలు ఉన్నాయి. అయితే ఐపీఎల్ లో డబ్బు రావడంతో తాను మారిపోలేదని.. అవన్నీ తన తండ్రికే ఇచ్చానని చెప్తున్నాడు.
.@sachin_rt is all praise for the young Tilak Varma.#IPL2022 pic.twitter.com/d4SnrnQmiU
— 100MB (@100MasterBlastr) May 27, 2022
ఇది కూడా చదవండి: Kapil Dev: సచిన్ తనయుడిపై ‘కపిల్ దేవ్’ సంచలన కామెంట్స్!
”అండర్-16 క్రికెట్ ఆడుతున్న సమయంలో ఎన్నో కష్టాలు పడ్డాను. ఉదయం 6 గంటలకే గ్రౌండ్ కు వెళ్లేవాడిని. ఎప్పుడో సాయంత్రమైతే తప్ప ఇంటికి రాకపోయేవాడిని. కొన్నిసార్లు.. క్రికెట్ కిట్ తో బస్ ఎక్కితే బస్ లోకి రానిచ్చేవారు కాదు. వెంటనే దిగమనేవారు. ఆ రోజులను నేనెప్పటికీ మరిచిపోను. ఎన్ని కష్టాలు ఎదురైనా.. నా దృష్టంతా క్రికెట్ మీదే ఉండేది. క్యాంప్ కు వెళ్లకుండా ఒక్కరోజు కూడా ఉండలేదు. అన్నం, రెస్ట్ వంటివైనా మిస్ చేసుకునేవాడిని గానీ ప్రాక్టీస్ అయితే మిస్ కాలేదు”.
Tilak Varma pic.twitter.com/6nsWK6fvvk
— RVCJ Media (@RVCJ_FB) June 11, 2022
“క్రికెట్ ను కెరీర్ గా ఎంచుకున్నాక దాదాపు ఇంటినే మర్చిపోయాను. పెళ్లిళ్లు, ఫంక్షన్లు, ఫ్యామిలీ గ్యాదరింగ్స్ అన్నీ త్యాగం చేసుకున్నాను. నాకు చాలా ఇష్టమైన సోదరి పెళ్లికి కూడా హాజరుకాలేకపోయాను. ఏ వ్యక్తి అయినా డబ్బుకు దాసోహం అవ్వడం సహజం. అందుకే డబ్బు ఉంచుకోవడం ద్వారా వచ్చే అనర్థాలు ఎలా ఉంటాయో నాకు తెలుసు. అందుకే.. ఐపీఎల్ లో వచ్చిన డబ్బంతా మా నాన్నకే ఇచ్చా. నాన్నకు డబ్బు ఇస్తూ.. ‘ప్లీజ్ నన్ను వాటికి కాస్త దూరంగా ఉంచండి’ అని చెప్పాను అంటున్నాడు.
From struggling to get one bat to now practising with several in his kit bag, Tilak has come a long way 🏏
📹 His parents and coaches recount his inspiring journey 💙
Watch the full episode 👉 https://t.co/wOqcY6V6jr#OneFamily #DilKholKe #MumbaiIndians @TilakV9 MI TV pic.twitter.com/TmIcCN950S
— Mumbai Indians (@mipaltan) June 3, 2022
ఇది కూడా చదవండి: Rohit Sharma-Ritika Sajdeh: భార్యతో కలిసి మాల్దీవుల్లో రోహిత్ శర్మ..! ఫొటోస్ వైరల్!
ఒక ఎలక్ట్రిషియన్ కొడుకుగా ఎదిగిన తిలక్ వర్మ చిన్నప్పటి నుంచి దుబారా ఖర్చులు చేయడం అలవాటు చేసుకోలేదు. అందుకే తాను సంపాదించిన ప్రతీ రూపాయిని తండ్రికే ఇవ్వడం అలవాటు. ఈ విషయం తెలుసుకున్న అభిమానులు..”తిలక్ వర్మ లాంటి వాళ్లు ఇంకా ఉన్నారా.. కష్టం అంటే ఏంటో తెలిసిన కుర్రాడు తిలక్ వర్మ” అని పొగడ్తలతో ముంచెత్తుతున్నారు. ఈ విషయంపై మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
Never Give Up – Tilak Varma 👏#IPL2022 #IPL pic.twitter.com/xRxH5i2U3T
— Cricket Addictor (@AbdullahNeaz) April 3, 2022