ధనాధన్ క్రికెట్ హంగామా ఐపీఎల్ 15వ సీజన్ మరికొన్ని రోజుల్లో ప్రారంభం కానుంది. దీంతో అన్ని జట్లు ప్రాక్టీస్‌లో మునిగితేలుతున్నాయి. ఈ క్రమంలో ఢిల్లీ క్యాపిటల్స్ యువ ఆటగాడు, భారత అండర్-19 కెప్టెన్ యష్ ధుల్ నెట్స్‌లో తీవ్రంగా శ్రమిస్తున్నాడు. నెట్ సెషన్లో అద్భుతమైన షాట్లు ఆడుతూ యష్ ధుల్ అలరించాడు. అయితే ప్రాక్టీస్‌లో భాగంగా ఒక బంతిని ‘అప్పర్ కట్’ షాట్ ఆడి అందరనీ ఆశ్చర్యపరిచాడు. ఇందుకు సంబంధించిన వీడియోను ఢిల్లీ క్యాపిటల్స్ ట్విట్టర్లో షేర్ […]
ఐదోసారి భారత్‌కు అండర్ 19 వరల్డ్ అందించిన కెప్టెన్ యశ్ ధుల్ దేశవాళీ టోర్నీలో కూడా దుమ్మురేపుతున్నాడు. ప్రతిష్టాత్మక రంజీ ట్రోఫీ 2022లో యశ్ ధుల్ అరంగేట్రం చేశాడు. ఆడిన తొలి ఫస్ట్‌క్లాస్ మ్యాచ్‌లోనే రికార్డుల మోతమోగిస్తున్నాడు. ఢిల్లీ టీమ్ తరఫున దేశవాళీ క్రికెట్లోకి ఎంట్రీ ఇచ్చిన ఈ యువ క్రికెటర్.. తమిళనాడుతో జరిగిన తన ఫస్ట్ మ్యాచ్‌లోనే రెండు ఇన్నింగ్స్‌ల్లో సెంచరీలు బాదాడు. తద్వారా అరుదైన ఘనతను సొంతం చేసుకున్నాడు. ఎన్నో ఏళ్ల రంజీ ట్రోఫీ […]
బెంగుళూరు వేదికగా జరుగుతున్న ఐపీఎల్ వేలం ఊహించని విధంగా కొనసాగుతోంది. అంచనాలను తలకిందులు చూస్తూ ఫ్రాంచైజ్‌లు కొంతమంది క్రికెటర్లకు షాక్ ఇస్తున్నారు. కచ్చితంగా భారీ ధర పలుకుతారనుకున్న ఆటగాళ్లు తక్కువ ధరకే పరిమితం అవుతున్నారు. ఈ క్రమంలో ఇటివల భారత్‌కు ఐదో అండర్ 19 వరల్డ్ కప్ అందించిన కెప్టెన్ యశ్‌ధుల్ కోసం అన్ని ఫ్రాంచైజ్‌లు పోటీ పడతాయి అని అందరు భావించారు. కానీ అందుకు భిన్నంగా యశ్ కేవలం రూ.50 లక్షలు మాత్రమే పలికాడు. యశ్‌ను […]
వెస్టిండీస్ వేదికగా జరుగుతున్న అండర్ 19 వరల్డ్ కప్‌లో టీమిండియా ఫైనల్‌కు చేరింది. బుధవారం ఆస్ట్రేలియాతో జరిగిన సెమీస్‌లో ఘన విజయం సాధించింది యష్ ధుల్ సేన. శనివారం ఇంగ్లండ్‌తో ఫైనల్లో తలపడనుంది. కాగా ఆసీస్‌తో జరిగిన సెమీస్‌లో టీమిండియా కెప్టెన్ యష్ ధుల్ సెంచరీతో చెలరేగి భారత్ భారీ స్కోర్ చేసేందుకు తోడ్పడ్డాడు. అతనికి గుంటూరు కుర్రాడు షేక్ రషీద్ కూడా తోడైయ్యాడు. ఇద్దరు కలిసి భారీ భాగస్వామ్యం నెలకొల్పి.. ఆసీస్ ముందు 291 పరుగుల […]