బెంగుళూరు వేదికగా జరుగుతున్న ఐపీఎల్ వేలం ఊహించని విధంగా కొనసాగుతోంది. అంచనాలను తలకిందులు చూస్తూ ఫ్రాంచైజ్‌లు కొంతమంది క్రికెటర్లకు షాక్ ఇస్తున్నారు. కచ్చితంగా భారీ ధర పలుకుతారనుకున్న ఆటగాళ్లు తక్కువ ధరకే పరిమితం అవుతున్నారు.
ఈ క్రమంలో ఇటివల భారత్‌కు ఐదో అండర్ 19 వరల్డ్ కప్ అందించిన కెప్టెన్ యశ్‌ధుల్ కోసం అన్ని ఫ్రాంచైజ్‌లు పోటీ పడతాయి అని అందరు భావించారు. కానీ అందుకు భిన్నంగా యశ్ కేవలం రూ.50 లక్షలు మాత్రమే పలికాడు. యశ్‌ను ఢిల్లీ క్యాపిటల్స్ దక్కించుకుంది. తొలుత అతన్ని దక్కించుకోవడానికి ఎవరూ ఆసక్తి చూపలేదు. మరి యశ్‌కు దక్కిన ధరపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.