ఐదోసారి భారత్‌కు అండర్ 19 వరల్డ్ అందించిన కెప్టెన్ యశ్ ధుల్ దేశవాళీ టోర్నీలో కూడా దుమ్మురేపుతున్నాడు. ప్రతిష్టాత్మక రంజీ ట్రోఫీ 2022లో యశ్ ధుల్ అరంగేట్రం చేశాడు. ఆడిన తొలి ఫస్ట్‌క్లాస్ మ్యాచ్‌లోనే రికార్డుల మోతమోగిస్తున్నాడు. ఢిల్లీ టీమ్ తరఫున దేశవాళీ క్రికెట్‌లోకి ఎంట్రీ ఇచ్చిన ఈ యువ క్రికెటర్.. తమిళనాడుతో జరిగిన తన ఫస్ట్ మ్యాచ్‌లోనే రెండు ఇన్నింగ్స్‌ల్లో సెంచరీలు బాదాడు. తద్వారా అరుదైన ఘనతను సొంతం చేసుకున్నాడు. ఎన్నో ఏళ్ల రంజీ ట్రోఫీ చరిత్రలో అరంగేట్ర మ్యాచ్‌లోనే రెండు ఇన్నింగ్స్‌ల్లో సెంచరీలు బాదిన మూడో ఆటగాడిగా చరిత్ర సృష్టించాడు.
టీమిండియా దిగ్గజ ఆటగాళ్లు సచిన్ టెండూల్కర్, విరాట్ కోహ్లీ లాంటి వారు కూడా తన తొలి ఫస్ట్‌క్లాస్ మ్యాచ్‌లో రెండు ఇన్సింగ్స్‌లో సెంచరీ చేయలేదు. యశ్ ధుల్‌కు ముందు గుజరాత్ దిగ్గజ బ్యాట్స్‌మన్ నారీ కాంట్రాక్టర్ ఈ ఫీట్‌ను తొలిసారి ధించగా.. మహారాష్ట్ర ప్లేయర్ విరాగ్ అవతే రెండో ఆటగాడిగా ఉన్నాడు. తొలి ఇన్నింగ్స్‌లో 150 బంతుల్లో 18 ఫోర్లతో 113 పరుగులు చేసిన యశ్.. రెండో ఇన్నింగ్స్‌లో 202 బంతుల్లో 14 ఫోర్లు, సిక్స్‌తో 113 పరుగులతో అజేయంగా నిలిచాడు. కాగా ఐపీఎల్2022 సీజన్ మెగా వేలంలో ఢిల్లీ క్యాపిటల్స్ రూ. 50 లక్షలకు యశ్ ధుల్‌ను కొనుగోలు చేసిన విషయం తెలిసిందే.
What a moment for Yash Dhull. Becomes only the 3rd Indian to score a century in both the innings on First Class debut. pic.twitter.com/gML4hsqCUt
— Mufaddal Vohra (@mufaddal_vohra) February 20, 2022