భారత మహిళా క్రికెటర్, స్టార్ ఓపెనర్ స్మృతి మంధాన వేలంలో కోట్లు కొల్లగొట్టింది. తొలిసారి నిర్వహిస్తున్న మహిళా ప్రీమియర్ లీగ్ టోర్నీలో వేలంలో పాల్గొన్న తొలి క్రీడాకారిణిగా అరుదైన ఘనత సొంతం చేసుకోవడమే కాకుండా.. కోట్ల ధర పలికిన క్రికెటర్ గా అరుదైన రికార్డు నెలకొల్పింది.
ముంబైలోని జియో కన్వెన్షన్ కేంద్రంగా మహిళా ప్రీమియర్ లీగ్ (డబ్ల్యూపీఎల్) వేలం అట్టహాసంగా ఆరంభమైంది. ఈ వేలంలో భారత స్టార్ ఓపెనర్ స్మృతి మంధాన అరుదైన ఘనత సొంతం చేసుకుంది. తొలిసారి జరుగుతున్న ఈ టోర్నీలో వేలంలోకి వచ్చిన మొదటి క్రీడాకారిణిగా అరుదైన ఘనతను దక్కించుకుంది. ఎదుర్కొన్న తొలి బంతి నుంచే బౌలర్లపై ఎదురుదాడికి దిగే ఈ ఓపెనర్ కోసం బెంగళూరు, ముంబై ప్రాంఛైజీలు గట్టి పోటీనిచ్చాయి. చివరికి ఆమె బెంగళూరు గూటికి చేరింది.
రూ. 50 లక్షల కనీస ధరతో వేలంలోకి వచ్చిన మంధానను దక్కించుకోవడానికి బెంగళూరు, ముంబై ప్రాంచైజీల ప్రతినిధులు నువ్వా.. నేనా అన్నట్లు పోటీ పడ్డారు. దీంతో క్షణాల్లోనే ఆమె ధర రూ. 3 కోట్లు దాటేసింది. ఆపై రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు రూ.3.4 కోట్లు ఇవ్వడానికి సిద్దమవ్వడం, ముంబై ముందుకు సాగకపోవడంతో ఆమె ఆర్‌సీబీ సొంతమైంది. ఇక భారత మహిళా జట్టు సారధి హర్మన్ ప్రీత్ కౌర్‌ను రూ.1.8 కోట్ల ధరకు మంబై ఇండియన్స్ కొనుగోలు చేసింది. డబ్ల్యూపీఎల్ కోసం దాదాపు 1500 మంది మహిళా ప్లేయర్లు రిజిస్టర్ చేయించుకోగా వారిలో 409 మంది షార్ట్ లిస్టు చేయబడ్డారు. వీరిలో 246 మంది స్వదేశీ ప్లేయర్లు కాగా, 163 మంది విదేశీ ప్లేయర్లు ఉన్నారు. దాదాపు 90 మంది ప్లేయర్లు వేలంలో అమ్ముడుపోనున్నారు.
Join us in welcoming the first Royal Challenger, Smriti Mandhana! 😍
Welcome to RCB 🔥#PlayBold #WeAreChallengers #WPL2023 #WPLAuction pic.twitter.com/7q9j1fb8xj
— Royal Challengers Bangalore (@RCBTweets) February 13, 2023
What a video – celebration from Smriti Mandhana and team India was wholesome. pic.twitter.com/IXBs99houA
— Mufaddal Vohra (@mufaddal_vohra) February 13, 2023