న్యూజిలాండ్ వేదికగా జరుగుతున్న మహిళల వన్డే ప్రపంచకప్ క్రికెట్ టోర్నీలో టీమిండియా పోరాటం ముగిసింది. ఆదివారం సౌతాఫ్రికాతో ఆఖరి బంతి వరకు ఉత్కంఠగా సాగిన ఈ మ్యాచ్‌లో భారత్ 3 వికెట్ల తేడాతో ఓటమిపాలైంది. సెమీస్ కు అర్హత సాధించాలంటే తప్పక గెలువాల్సిన మ్యాచ్‌లో అనవసర తప్పిదాలతో మిథాలీసేన భారీ మూల్యం చెల్లించుకుంది. అయితే.. టీమిండియా మహిళలు ఓడిన వేల.. వెస్టిండీస్ మహిళలు సంబరాలు చేసుకున్న విధానం ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. మన ఓటమిని అంతలా సెలబ్రేట్ చేసుకోవాల్సిన అవసరం వెస్టిండీస్ కు ఏముంది అంటే.. వారి సెమీస్ అవకాశాలు మన మ్యాచ్ ఫలితంపైనే ఆధారపడింది కాబట్టి.
ఆడిన 7 మ్యాచుల్లోనూ విజయం సాధించిన ఆస్ట్రేలియా మహిళల జట్టు అలవోకగా సెమీస్ బెర్త్ ఖరారుచేసుకుంది. ఇక మిగిలింది మూడు స్థానాలు. 6 మ్యాచుల్లో 4 విజయాలు, ఒక మ్యాచ్ డ్రా గా చేసుకొని 9 పాయింట్లతో సౌతాఫ్రికా జట్టు సెమీస్ కు అర్హత సాధించింది. మొదటి రెండు మ్యాచుల్లోనూ ఓటిమి పాలైన ఇంగ్లాండ్ మహిళల జట్టు.. తరువాత 4 విజయాలు(8 పాయింట్లు)తో ఎసెమీస్ బెర్త్ ఖరారుచేసుకుంది. ఇక మిగిలింది ఒకే ఒక స్థానం.. ఈ స్థానానికి పోటీలో రెండు జట్లు. ఒకటి వెస్టిండీస్.. మరొకటి టీమిండియా. అప్పటికే.. వెస్టిండీస్ మహిళల జట్టు.. 7 మ్యాచుల్లో 3 గెలిచి, ఒక మ్యాచ్ డ్రా తో సరిపెట్టుకొని 7 పాయింట్లతో 4 ప్లేస్ లో ఉంది. భారత జట్టు 6 మ్యాచుల్లో 3 గెలిచి 6 పాయింట్లతో ఇదో స్థానంలో ఉంది.భారత జట్టు.. మిగిలిన ఒక మ్యాచులో విజయం సాధిస్తే నేరుగా సెమీస్ కు చేరొచ్చు. అలా గెలిస్తే.. వెస్టిండీస్ మహిళల జట్టు టోర్నీ నుంచి తప్పుకునేది. అలాంటి గెలవాల్సిన మ్యాచులో భారత జట్టు అనవసర తప్పిదాలతో మ్యాచ్ ఓడిపోయి వెస్టిండీస్ జట్టును సెమీస్ కి చేర్చింది. సౌతాఫ్రికా, టీమిండియా మధ్య జరిగిన చివరి లీగ్ మ్యాచులో విజయం సాధించిన ప్రోటీన్ ఆటగాళ్ల సంబరాలు అంతంత మాత్రమే.కానీ.. అదే సమయంలో సెమీస్ కు అర్హత సాధించిన వెస్టిండీస్ జట్టు మాత్రం రచ్చ రచ్చ చేసింది. తమ హోటల్ రూమ్ లో ఇండియా- సౌత్ ఆఫ్రికా మ్యాచ్ ని వారు ఆసాంతం ఫాలో అయ్యారు.
To the semi-finals WI go!!!!! #CWC22 #TeamWestIndies pic.twitter.com/OHRr7vPpcT
— Windies Cricket (@windiescricket) March 27, 2022
ఇది కూడా చదవండి: ఆస్ట్రేలియా స్టార్ ఆల్ రౌండర్ మాక్స్ వెల్ పెళ్లి ఫోటోలు వైరల్..!
థ్రిల్లర్‌ను తలపించిన చివరి ఓవర్..
చివరి ఆరు బంతుల్లో 7 పరుగులు అవసరం కాగా కెప్టెన్ మిథాలీ.. చివరి ఓవర్‌ను దీప్తి శర్మకు ఇచ్చింది. తొలి బంతికి సింగిల్ ఇచ్చిన దీప్తి.. రెండో బంతికి సింగిల్ ఇవ్వడంతో పాటు బ్యాటర్ త్రిషా శెట్టిని రనౌట్ చేసింది. దీంతో మ్యాచ్‌పై సర్వత్రా ఉత్కంఠ నెలకొన్నది. ఆ తర్వాత మరో రెండు బంతులకు రెండు సింగిల్స్ ఇవ్వడంతో చివరి రెండు బంతులకు దక్షిణాఫ్రికా మూడు పరుగులు అవసరమయ్యాయి. ఇక ఐదో బంతికి క్రీజులో కుదురుకున్న బ్యాటర్ డూప్రీజ్ భారీ షాట్ ఆడగా.. లాంగాన్‌లో హర్మన్ ప్రీత్ కౌర్ క్యాచ్ అందుకున్నది. దీంతో భారత ఆటగాళ్లు సంబరంలో మునిగిపోయారు.
ఇక విజయం లాంఛనమేనని భావించారు. అయితే, అదే సమయంలో అంపైర్ నో బాల్‌గా ప్రకటించడంతో భారత శిబిరంలో ఆనందం ఆవిరైంది. ఇక చివరి రెండు బంతులకు రెండు పరుగులు అవసరం కాగా.. ప్రోటిస్ బ్యాటర్లు ఐదు పరుగులు చేసి విజయాన్ని అందుకున్నారు. టీంమిడియా ఓటమితో వెస్టిండిస్ సెమీఫైనల్స్‌కు వెళ్లింది. దీంతో.. వెస్టిండీస్ ఉమెన్స్ ఒకరిని ఒకరు కౌగిలించుకుంటూ తెగ ఆనందపడిపోయారు. మరి.. మన ఓటమిని వెస్టిండీస్ జట్టు అంతగా సెలెబ్రేట్ చేసుకోవడంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
ఇది కూడా చదవండి: IPL 2022: కోహ్లీ కోసం ఈ బుడతడు ఏమి చేశాడో చూడండి!
మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం SumanTV App డౌన్లోడ్ చేసుకోండి.