న్యూజిలాండ్ వేదికగా జరుగుతున్న మహిళల వన్డే ప్రపంచకప్ క్రికెట్ టోర్నీలో టీమిండియా పోరాటం ముగిసింది. ఆదివారం సౌతాఫ్రికాతో ఆఖరి బంతి వరకు ఉత్కంఠగా సాగిన ఈ మ్యాచ్‌లో భారత్ 3 వికెట్ల తేడాతో ఓటమిపాలైంది. సెమీస్ కు అర్హత సాధించాలంటే తప్పక గెలువాల్సిన మ్యాచ్‌లో అనవసర తప్పిదాలతో మిథాలీసేన భారీ మూల్యం చెల్లించుకుంది. అయితే.. టీమిండియా మహిళలు ఓడిన వేల.. వెస్టిండీస్ మహిళలు సంబరాలు చేసుకున్న విధానం ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. మన […]
వన్డే వరల్డ్ కప్ కోపం భారత మహిళల జట్టు మరో అడుగు ముందుకేసింది. మంగళవారం బంగ్లాదేశ్‌తో జరిగిన లీగ్ మ్యాచ్‌లో ఏకంగా 110 పరుగుల భారీ తేడాతో ఘన విజయం సాధించి సెమీస్ ఆశలను సజీవంగా ఉంచుకుంది. కచ్చితంగా గెలవాల్సిన మ్యాచ్‌లో టీమిండియా సత్తా చాటింది. తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ 6 వికెట్ల నష్టానికి 229 పరుగులు చేసింది. అనంతరం బంగ్లాదేశ్ 40.3 ఓవర్లలో కేవలం 119 పరుగులకే ఆలౌట్ అయింది. దీంతో టీమిండియా పాయింట్ల […]
న్యూజిలాండ్ వేదికగా జరుగుతున్న ఐసీసీ ఉమెన్స్ వరల్డ్ కప్ రేసులో నిలవాలంటే కచ్చితంగా గెలవాల్సిన మ్యాచ్‌లో టీమిండియా చేతులెత్తేసింది. సూపర్ బ్యాటింగ్‌తో రాణించినా పేలవ బౌలింగ్‌తో ఓటమిని మూటగట్టుకుంది. ముఖ్యంగా వెటరన్ పేసర్ జులాన్ గోస్వామి తప్పిదం టీమిండియా విజయవకాశాలను దెబ్బతీసింది. ఆద్యాంతం ఉత్కంఠగా సాగిన ఈ మ్యాచ్ చివరి ఓవర్‌లో 8 పరుగులను గోస్వామి డిఫెండ్ చేయలేకపోయింది. దాంతో ఆస్ట్రేలియా 6 వికెట్ల తేడాతో గెలుపొంది సెమీస్ బెర్త్‌ను ఖాయం చేసుకుంది. ఈ మ్యాచ్‌లో టాస్ […]
న్యూజిలాండ్ వేదికగా జరుగుతున్న మహిళల వన్డే ప్రపంచకప్ లో డిఫెండింగ్ ఛాంపియన్ ఇంగ్లండ్‌కు వరుసగా రెండో ఓటమి ఎదురైంది. వెస్టిండీస్ జట్టు అద్భుత ప్రదర్శన ముందు ఇంగ్లాండ్ తలవంచక తప్పలేదు. బుధవారం డునెడిన్ లోని యూనివర్సిటీ ఓవల్ వేదికగా జరిగిన ఏడో గ్రూప్ మ్యాచులో విండీస్ మహిళల జట్టు.. ఇంగ్లాండ్ పై ఏడు పరుగుల తేడాతో విజయం సాధించింది. ఆద్యంతం ఆసక్తికరంగా సాగిన ఈ మ్యాచులో విజయం రెండు జట్ల మధ్య దోబూచులాడినా.. విజయం మాత్రం విండీస్ […]
భారత్, పాకిస్తాన్ మ్యాచ్ అంటే ఆ ఆసక్తే వేరు. అది మెన్స్ అయినా.. ఉమెన్స్ అయినా దాయాధి జట్లు తలపడే ఆ మ్యాచులకు ఫుల్ క్రేజ్ ఉంటుంది. మహిళల ప్రంపచకప్‌లో భాగంగా పాకిస్తాన్‌తో జరిగిన తొలి మ్యాచ్‌లో భారత్ 107 పరుగుల తేడాతో విజయం సాధించిన విషయం తెలిసిందే. అయితే.. ఈ మ్యాచ్‌లో భారత వికెట్ కీపర్ రిచా ఘోష్ మెరుపు వేగంతో అద్భుతమైన స్టంపింగ్ చేసి అభిమానులను ఆశ్చర్యపరిచింది. ప్రస్తుతం ఆ వీడియో వైరల్ గా […]
న్యూజిలాండ్ గడ్డపై జరుగుతున్న మహిళల వన్డే ప్రపంచకప్‌లో భారత్ జట్టు బోణి అదిరిపోయింది. ఈ మెగాటోర్నీలో భాగంగా నేడు మౌంట్ మాంగనూయ్ వేదికగా ఆదివారం(మార్చి 6) పాకిస్థాన్‌తో తలపడిన భారత్ జట్టు.. 107 పరుగుల తేడాతో అలవోక విజయాన్ని అందుకుంది. ఉమెన్స్ క్రికెట్‌లో భారత్, పాకిస్థాన్ జట్లు ఇప్పటి వరకూ 11 వన్డేల్లో తలపడగా.. అన్నిమ్యాచ్‌ల్లోనూ భారత్ అమ్మాయిలే గెలిచారు. ఇక వన్డే ప్రపంచకప్‌లో ఇప్పటివరకు మూడు సార్లు తలపడగా.. మూడు సార్లూ పాక్‌ని చిత్తు చేశారు. […]
న్యూజిలాండ్ వేదికగా ఐసీసీ వుమెన్స్ వన్డే ప్రపంచకప్ ప్రారంభమైన సంగతి తెలిసిందే. అందులో భాగంగా భాగంగా శనివారం (మార్చి 5) జరిగిన మ్యాచులో డిపెండింగ్ ఛాంపియన్స్ ఇంగ్లాండ్ ఉమెన్స్ పై.. ఆస్ట్రేలియన్ ఉమెన్స్ 12 పరుగులతో విజయం సాధించింది. ఈ మ్యాచులో ఆస్ట్రేలియా ప్లేయర్ జొనాస్సెన్ స్టన్నింగ్ క్యాచ్‌తో మెరిసింది. బుల్లెట్ కంటే వేగంగా వచ్చిన బంతిని ఒంటి చేత్తో అందుకొని ఔరా అనిపించింది. ఇంగ్లాండ్ బ్యాటింగ్ చేస్తుండగా.. మ్యాచ్ ఆఖరి ఓవర్‌ను జోనాస్సెన్ వేసింది. ఓవర్ […]
ఉత్కంఠకు మారుపేరుగా నిలిచే క్రికెట్ ఎంతటి కిక్ ఇస్తుందో మరోసారి రుజువైంది. ఉమెన్స్ వరల్డ్‌కప్ ఫస్ట్ మ్యాచే అభిమానులకు సూపర్ థ్రిల్ ఇచ్చింది. చివరి ఓవర్‌లో న్యూజిలాండ్ విజయానికి 6 పరుగులు కావాల్సి ఉండగా విండీస్ మహిళా బౌలర్ డియాండ్రా డాటిన్ మ్యాజిక్ చేసింది. 2 వికెట్లతో పాటు ఓ రనౌట్‌తో మూడు వికెట్లు పడగొట్టింది. ఆ ఓవర్‌లో కేవలం 2 పరుగులే ఇచ్చి జట్టుకు ఊహించని గెలుపును అందించింది. దీంతో విజయం ఖాయమనుకున్న ప్రపంచకప్‌నకు అతిథ్యం […]