వన్డే వరల్డ్ కప్ కోపం భారత మహిళల జట్టు మరో అడుగు ముందుకేసింది. మంగళవారం బంగ్లాదేశ్‌తో జరిగిన లీగ్ మ్యాచ్‌లో ఏకంగా 110 పరుగుల భారీ తేడాతో ఘన విజయం సాధించి సెమీస్ ఆశలను సజీవంగా ఉంచుకుంది. కచ్చితంగా గెలవాల్సిన మ్యాచ్‌లో టీమిండియా సత్తా చాటింది. తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ 6 వికెట్ల నష్టానికి 229 పరుగులు చేసింది. అనంతరం బంగ్లాదేశ్ 40.3 ఓవర్లలో కేవలం 119 పరుగులకే ఆలౌట్ అయింది. దీంతో టీమిండియా పాయింట్ల పట్టికలోనూ ఒక స్థానం మెరుగుపరుచుకుని మూడో స్థానంలో నిలిచింది.
టాస్ గెలిచి ముందుగా బ్యాటింగ్ చేసిన మిథాలీ సేన నిర్ణీత 50 ఓవర్లలో 7 వికెట్లకు 229 పరుగులు చేసింది. యస్తికా భాటియా(80 బంతుల్లో 2 ఫోర్లతో 50) హాఫ్ సెంచరీతో రాణించగా.. పూజా వస్త్రాకర్(33 బంతుల్లో 2 ఫోర్లతో 30 నాటౌట్), షెఫాలీ వర్మ(42 బంతుల్లో 6 ఫోర్లు, సిక్స్‌తో 42) పర్వాలేదనిపించారు. స్నేహ్ రాణా(23 బంతుల్లో 2 ఫోర్లతో 27) విలువైన పరుగులు చేసింది. గత మ్యాచ్‌లో హాఫ్ సెంచరీతో చెలరేగిన కెప్టెన్ మిథాలీ రాజ్(0), హర్మన్ ప్రీత్ కౌర్(14) దారుణంగా విఫలమయ్యారు. బంగ్లాదేశ్ బౌలర్లలో రితు మోని మూడు వికెట్లు తీయగా.. నహిదా అక్తర్ రెండు, జహనరా అలామ్ ఓ వికెట్ పడగొట్టింది. అనంతరం లక్ష్య చేధనకు దిగిన బంగ్లాదేశ్.. భారత బౌలర్ల ధాటికి 40.3 ఓవర్లలో 119 పరుగులకే కుప్పకూలి ఘోర పరాజయాన్ని చవిచూసింది. ఆ జట్టులో సల్మా ఖాటున్(32), లతా మోండల్(24) టాప్ స్కోరర్లుగా నిలిచారు. ఆరుగురు బ్యాటర్లు సింగిల్ డిజిట్‌కే పరిమితమవ్వగా.. ఇందులో ఇద్దరు డకౌట్‌గా వెనుదిరిగాడు.
భారత బౌలర్లలో స్నేహ్ రాణా(4/30) నాలుగు వికెట్లతో బంగ్లా పతనాన్ని శాసించగా.. జులాన్ గోస్వామి(2/19), పూజావస్త్రాకర్(2/19) రెండేసి వికెట్లు పడగొట్టారు. పూనమ్ యాదవ్, రాజేశ్వరి గైక్వాడ్ తలో వికెట్ తీసారు. హాఫ్ సెంచరీతో జట్టు విజయంలో కీలక పాత్ర పోషించిన యస్తికా భాటియాకు మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ దక్కింది. మార్చి 27న సౌతాఫ్రికాతో జరిగే చివరి లీగ్ మ్యాచ్‌లో భారత్ విజయం సాధిస్తే ఎలాంటి సమీకరణాలు లేకుండా నేరుగా సెమీఫైనల్ చేరుతుంది. ఎందుకంటే భారత్ ప్రస్తుతం మెరుగైన రన్‌రేట్‌తో మూడో స్థానంలో ఉంది. మరి భారత్ గ్రాండ్ విక్టరీపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
ఇదీ చదవండి: సచిన్ తర్వాత ఎవరికీ సాధ్యం కానీ రికార్డును సాధించిన మిథాలీ
India beat Bangladesh by 110 runs and move up to third place in the #CWC22 points table.#INDvBANhttps://t.co/LHJoQEwo31 pic.twitter.com/rJV5Isgfvq
— Cricbuzz (@cricbuzz) March 22, 2022
1⃣0⃣-2️⃣-3⃣0⃣-4⃣ 🔥@SnehRana15‘s brilliant four-fer helps 🇮🇳 clinch a 1⃣1⃣0⃣ run victory against 🇧🇩!
Way to go, girls! 🤩#OneFamily #INDvBAN #CWC22 @ICC pic.twitter.com/fYE0MiM58T
— Mumbai Indians (@mipaltan) March 22, 2022
మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం SumanTV App డౌన్లోడ్ చేసుకోండి.