బంగ్లాదేశ్ తో మూడో వన్డేలో భారత బ్యాటర్లు చెలరేగి ఆడుతున్నారు. మొదటి రెండు మ్యాచుల్లో విఫలమైన భారత బ్యాటర్లు.. ఈ మ్యాచులో మాత్రం బంగ్లా బౌలర్లను చీల్చి చెండాడుతున్నారు. మాజీ సారధి విరాట్ కోహ్లీ(113 నాటౌట్) సెంచరీ చేయగా, యువ క్రికెటర్ ఇషాన్ కిషన్ డబులు సెంచరీ సాధించాడు. 85 బంతుల్లో సెంచరీ మార్కును చేరుకున్న ఇషాన్.. 126 బంతుల్లోనే ద్విశతకాన్ని నమోదు చేశాడు. అతని ఇన్నింగ్స్లో 23 ఫోర్లు, 9 సిక్సర్లు ఉండటం విశేషం. ఫోర్లు, సిక్సుల ద్వారానే 146 పరుగులు వచ్చాయి. ఇదిలావుంచితే.. ఇషాన్ చేసిన ద్విశతకం.. మునుపటి డబుల్ సెంచరీల రికార్డులను కొల్లగొట్టింది.
బంగ్లాపై డబుల్ సెంచరీ చేసిన ఇషాన్.. భారత్ తరపున ద్విశతకం చేసిన నాల్గో క్రికెటర్గా రికార్డు సాధించాడు. వన్డేల్లో ఇప్పటి వరకు రోహిత్ శర్మ మూడు సార్లు డబుల్ సెంచరీ చేయగా, వీరేంద్ర సెహ్వాగ్, సచిన్ టెండుల్కర్ ఒక్కోసారి డబుల్ సెంచరీ బాదారు. అలాగే.. వరల్డ్ వైడ్గా డబుల్ సెంచరీ చేసిన 9వ క్రికెటర్గా చరిత్రకెక్కాడు. మొత్తంగా 131 బంతులు ఎదుర్కొన్న ఇషాన్.. 24 ఫోర్లు, 10 సిక్సర్లు సాయంతో 210 పరుగులు చేశాడు. అతని స్ట్రైక్ రేట్ 160.31గా ఉంది. మునపటి డబుల్ సెంచరీలు చేసిన ఆటగాళ్ల స్ట్రైక్ రేట్ తో పోలిస్తే.. ఇషాన్ దే హైయెస్ట్. శ్రీలంకపై రోహిత్ శర్మ(264) చేసిన పరుగులు చేసినా.. అతని స్ట్రైక్ రేట్ మాత్రం 152.60గా ఉంది. ఆ తరువాతి స్థానాల్లో వీరేంద్ర సెహ్వాగ్(219)146.97గా, క్రిస్ గేల్(215)146.25గా ఉన్నారు. దీంతో ఇషాన్ స్ట్రైక్ రేట్ ఒక రికార్డు అని చెప్పుకోవాలి.
ఇక మ్యాచ్ విషయానికొస్తే.. తొలుత టాస్ గెలిచిన బంగ్లా సారధి లిటన్ దాస్ భారత్ ను బ్యాటింగ్ కు ఆహ్వానించడమే చేసిన అతి పెద్ద తప్పు. తొలి రెండు మ్యాచులో ఓడామన్న కసి భారత ఆటగాళ్లలో కళ్ళకు కట్టినట్లు కనిపించింది. శిఖర్ ధావన్ (3) పరుగులకే వెనుదిరిగినా, ఇషాన్-విరాట్ జోడి బంగ్లా బౌలర్లను చీల్చి చెండాడారు. రెండో వికెట్ కు వీరిద్దరూ కలిసి 290 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. ఇక ఇన్నింగ్స్ ముగిసేసరికి భారత జట్టు నిర్ణీత ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 409 పరుగులు చేసింది. బంగ్లా బౌలర్లలో తస్కిన్ అహ్మద్, షకిబుల్ హసన్, ఇబాదత్ హుస్సేన్ తలా రెండు వికెట్లు పడగొట్టగా, మెహిది హసన్ మిరాజ్ ఒక వికెట్ పడగొట్టాడు.
Highest ODI score by an Indian:
Rohit Sharma – 264
Virender Sehwag – 219
Rohit Sharma – 209
Rohit Sharma – 208*
Sachin Tendulkar – 200*
Ishan Kishan – 186* BATTING pic.twitter.com/jFCLshnohq— 12th Khiladi (@12th_khiladi) December 10, 2022