బంగ్లాదేశ్ తో జరుగుతున్న తొలి టెస్టులో భారత బ్యాటర్లు పరుగుల వరద పారించారు. యువ ఆటగాడు శుభ్ మన్ గిల్(110) సెంచరీతో కదం తొక్కగా, సీనియర్ వెటరన్ బ్యాటర్ చటేశ్వర్ పుజారా(102) సైతం శతకంతో మెరిశాడు. తొలి ఇన్నింగ్స్ లో 254 పరుగుల ఆధిక్యం సాధించిన భారత్, సెకండ్ ఇన్నింగ్స్ లో 258 పరుగుల వద్ద ఇన్నింగ్స్ డిక్లేర్ చేసింది. దీంతో బంగ్లా ముంగిట 513 పరుగుల లక్ష్యాన్ని నిర్ధేశించింది భారత్.
దాదాపు 1443 రోజుల తరువాత పుజారా సెంచరీ మార్కును అందుకున్నాడు. చివరిసారిగా 2019 జనవరిలో సిడ్నీ వేదికగా ఆస్ట్రేలియాపై సెంచరీ చేశాడు. చివరగా బర్మింగ్‌హామ్ వేదికగా ఇంగ్లాండ్‌తో జరిగిన రీషెడ్యూల్ టెస్టులో ఆడిన పుజారా, అనంతరం ఫామ్ కోల్పయి.. జట్టులో స్థానం కోల్పోయాడు. ఆ తరువాత బీసీసీఐ పర్మిషన్ తీసుకొని ఇంగ్లాండ్ కౌంటీల్లో ఎంట్రీ ఇచ్చాడు. సస్సెక్స్ ప్రతినిత్యం వహించిన పుజారా వరుస సెంచరీలు బాది తిరిగి జట్టులోకి ఎంట్రీ ఇచ్చాడు. అలా వచ్చీరాగానే సెంచరీ ఆకలిని తీర్చుకున్నాడు. మొత్తంగా 130 బంతులు ఎదుర్కొన్న పుజారా.. 13 ఫోర్ల సాయంతో 102 పరుగులు చేశాడు.
A century which eased pressure from Cheteshwar Pujara – it was a long 47 months drought. A wholesome moment for everyone! pic.twitter.com/0lwkEX4mJu
— Mufaddal Vohra (@mufaddal_vohra) December 16, 2022
పూజారా కెరీర్‌లో ఇదే ఫాస్ట్ సెంచరీ. జిడ్డు బ్యాటింగ్‌తో బౌలర్లను విసిగించడం పూజారా స్పెషాలిటీ. అలాంటి పూజారా రివర్స్ స్వీప్స్, ఫ్రంట్ ఫుట్‌కి వచ్చి బౌండరీలు బాదడం ఆడి అభిమానులకు షాక్ ఇచ్చాడు. మొదటి సింగిల్ తీయడానికి 30+ బంతులు ఆడే పూజారా.. ధనాధన్ బ్యాటింగ్‌తో అభిమానులను ఆశ్చర్యపరిచాడు. పూజారా సెంచరీ తర్వాత ఇన్నింగ్స్ డిక్లేర్ చేసింది టీమిండియా. తొలి ఇన్నింగ్స్‌లో 254 పరుగుల ఆధిక్యం అందుకున్న భారత్, రెండో ఇన్నింగ్స్‌లో 258 పరుగుల వద్ద ఇన్నింగ్స్ డిక్లేర్ చేసింది. తొలి ఇన్నింగ్స్ ఆధిక్యంతో కలిపి బంగ్లాదేశ్ ముందు 513 పరుగుల భారీ లక్ష్యాన్ని నిర్ధేశించింది.
💯Century after 1400+ days in Test
⚡His fastest century in Test cricketCheteshwar Pujara breaks the century jinx with an aggressive approach😛
📸: Sony Liv pic.twitter.com/08lMcSJC19
— CricTracker (@Cricketracker) December 16, 2022