న్యూజిలాండ్ వేదికగా జరుగుతున్న మహిళల వన్డే ప్రపంచకప్ లో డిఫెండింగ్ ఛాంపియన్ ఇంగ్లండ్‌కు వరుసగా రెండో ఓటమి ఎదురైంది. వెస్టిండీస్ జట్టు అద్భుత ప్రదర్శన ముందు ఇంగ్లాండ్ తలవంచక తప్పలేదు. బుధవారం డునెడిన్ లోని యూనివర్సిటీ ఓవల్ వేదికగా జరిగిన ఏడో గ్రూప్ మ్యాచులో విండీస్ మహిళల జట్టు.. ఇంగ్లాండ్ పై ఏడు పరుగుల తేడాతో విజయం సాధించింది. ఆద్యంతం ఆసక్తికరంగా సాగిన ఈ మ్యాచులో విజయం రెండు జట్ల మధ్య దోబూచులాడినా.. విజయం మాత్రం విండీస్ నే వరించింది. టోర్నీలో విండీస్ కు ఇది వరుసగా రెండో విజయం కాగా.. ఇంగ్లాండ్ కు మాత్రం వరుసగా రెండో పరాజయం.
టాస్ గెలిచిన బ్యాటింగ్ ఎంచుకున్న వెస్టిండీస్ ఉమెన్స్ జట్టు నిర్ణీత 50 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 225 పరుగులు చేసింది. వెస్టిండీస్ బ్యాటర్లలో డియాండ్రా డాటిన్(31), హేలే మాథ్యూస్(45), కాంప్‌బెల్(66) పరుగులతో రాణించారు. అనంతరం 226 పరుగుల స్వల్ప లక్ష్యంతో బరిలోకి దిగిన ఇంగ్లాండ్ జట్టు నిర్ణీత 50 ఓవర్లలో 218 పరుగులకు ఆలౌట్ అయ్యింది. దీంతో వెస్టిండీస్ జట్టు 12 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఇంగ్లాండ్ బ్యాటర్లలో టామీ బీమౌంట్ ఒక్కరే 46 పరుగులతో ఫర్వాలేదనిపించింది. మిగతా బ్యాటర్లంతా తక్కువ స్కోర్లకే పరిమితమయ్యారు. ఆఖరి వరకు ఉత్కంఠగా సాగిన ఈ మ్యాచ్‌లో విజయం వెస్టిండీస్‌ను వరించింది.
Congratulations West Indies women on an incredible win 👏🏼 Not for nothing they say catches win matches. This catch from Deandra Dottin will take some beating! #WIvENG #CWC22 pic.twitter.com/6rkKJ7xI98
— Wasim Jaffer (@WasimJaffer14) March 9, 2022
ఈ మ్యాచ్‌లో ఇంగ్లాండ్ ఓటమి కంటే వెస్టిండీస్ ప్లేయర్ డాటిన్ పట్టిన క్యాచ్ పైనే ఎక్కువగా చర్చ జరుగుతోంది. ఇంగ్లాండ్ ఇన్నింగ్స్ 9వ ఓవర్లో ఓపెనర్ లారెన్ విన్‌ఫీల్డ్ కొట్టిన ఓ బంతిని పాయింట్ మీద ఫీల్డింగ్ చేస్తన్నా డాటిన్ అద్భుతంగా క్యాచ్ అందుకుంది. గాలిలోకి పక్షిలాగా ఎగురుతూ.. ఒంటిచేత్తో అద్భుతమైన క్యాచ్ పట్టడంతో, నెటిజన్లు అంతా ఫిదా అవుతున్నారు. క్యాచ్ పట్టే టైంలో డాటిన్ పూర్తిగా గాలిలోనే ఉంది. ప్రస్తుతం ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
Diving Deandra Dottin takes a screamer in West Indies’ 7 run win over England at the World Cup.@abcsport #CWC22 #ENGvWI
vision: Fox Sports pic.twitter.com/GFL4yctvtZ— Duncan Huntsdale (@duncs_h) March 9, 2022