న్యూజిలాండ్ వేదికగా ఐసీసీ వుమెన్స్ వన్డే ప్రపంచకప్ ప్రారంభమైన సంగతి తెలిసిందే. అందులో భాగంగా భాగంగా శనివారం (మార్చి 5) జరిగిన మ్యాచులో డిపెండింగ్ ఛాంపియన్స్ ఇంగ్లాండ్ ఉమెన్స్ పై.. ఆస్ట్రేలియన్ ఉమెన్స్ 12 పరుగులతో విజయం సాధించింది. ఈ మ్యాచులో ఆస్ట్రేలియా ప్లేయర్ జొనాస్సెన్ స్టన్నింగ్ క్యాచ్‌తో మెరిసింది. బుల్లెట్ కంటే వేగంగా వచ్చిన బంతిని ఒంటి చేత్తో అందుకొని ఔరా అనిపించింది. ఇంగ్లాండ్ బ్యాటింగ్ చేస్తుండగా.. మ్యాచ్ ఆఖరి ఓవర్‌ను జోనాస్సెన్ వేసింది. ఓవర్ రెండో బంతిని ఇంగ్లాండ్ బ్యాటర్ కాథరిన్ బ్రంట్ స్ట్రెయిట్ డ్రైవ్ ఆడే ప్రయత్నం చేసింది. అందుకు తగ్గట్టగానే బ్యాట్‌తో పర్‌ఫెక్ట్ స్ట్రైట్ షాట్ ఆడింది. కానీ,.. బౌలర్ జొనాస్సెన్ బంతికి అడ్డుగోడలా నిలిచింది.
తన చేతికి చిక్కితే బంతి ఎక్కడికి వెళ్లదు అన్నట్లుగా.. వేగంగా వెళుతున్న బంతిని ఎడమ చేత్తో రెప్పపాటులో అందుకుంది. అంతే పట్టిన ఆమెకు.. చూస్తున్న మనకు.. క్రీజులో ఉన్న బ్యాటర్‌కు.. ఫీల్డర్లు అందరు ఒక్కసారిగా ఆశ్చర్యపోయారు. అసలు క్యాచ్ పట్టానా అన్న రీతిలో జొనాస్సెస్ ఇచ్చిన కొంటె లుక్స్.. చిరునవ్వు మ్యాచుకే హైలెట్‌గా నిలిచాయి. జొనాస్సెన్ క్యాచ్ పట్టిన దానికంటే ఆమె ఇచ్చిన లుక్స్‌కు అభిమానులు ఫిదా అయ్యారు. ఐసీసీ తన ఇన్‌స్టాగ్రామ్‌లో వీడియోనూ షేర్ చేసింది.
ఇక మ్యాచ్ విషయానికి వస్తే.. డిపెండింగ్ ఛాంపియన్స్ ఇంగ్లాండ్ పై ఆస్ట్రేలియా 12 పరుగుల తేడాతో విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా జట్టు రేచల్ హేన్స్ (131 బంతుల్లో 130; 14 ఫోర్లు, సిక్స్) శతక్కొట్టడంతో నిర్ణీత 50 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 310 పరుగుల భారీ స్కోర్ చేసింది. 311 పరుగుల భారీ లక్ష్య ఛేదనలో నథాలీ స్కీవర్ (85 బంతుల్లో 109 నాటౌట్; 13 ఫోర్లు) అజేయమైన శతకంతో మెరిసినప్పటికీ ఇంగ్లాండ్ ను గెలిపించలేకపోయింది. ఆసీస్ బౌలర్లు అలానా కింగ్ 3 వికెట్లు, తహిలా మెక్‌గ్రాత్ 2 వికెట్లు, జెస్ జొనాస్సెన్ 2 వికెట్లు పడగొట్టడంతో.. ఇంగ్లాండ్ ఉమెన్స్ నిర్ణీత 50 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 298 పరుగులు చేసింది.