భారత క్రికెట్ అభిమానుల్లో ఇప్పుడు ఎవరి నోట విన్నా సూర్యకుమార్ యాదవ్ పేరే వినిపిస్తోంది. ఆదివారం ఇంగ్లాండ్ తో జరిగిన మూడో టీ20లో టీమిండియా ఓటమిపాలైనా సూర్య (117) సంచలన ఇన్నింగ్స్ భారత అభిమానులను మైమరపించింది. మొదట బ్యాటింగ్ చేసిన ఇంగ్లాండ్ 214 పరుగులు చేయగా.. అనంతరం టీమిండియా 20 ఓవర్లలో తొమ్మిది వికెట్ల నష్టానికి 198 పరుగులు చేసింది. టీమిండియా లక్ష్యానికి ఇంత దగ్గరగా వచ్చిందంటే దానికి కర్త, కర్మ, క్రియ అన్నీ సూర్యకుమార్ యాదవే. ఈ క్రమంలోనే పదేళ్ల కిందట రోహిత్ శర్మ అతడి గురించి చేసిన ఓ ట్వీట్ ఇప్పుడు వైరల్ గా మారింది.
2011 డిసెంబర్ 10న హిట్ మ్యాన్ బీసీసీఐ అవార్డ్స్ ఫంక్షన్ లో పాల్గొన్న సందర్భంగా కొంత మంది యువ క్రికెటర్లను కలిసినట్లు చెప్పాడు. అందులో సూర్యకుమార్ యాదవ్ అనే ముంబయి బ్యాట్స్ మెన్ ఆటను భవిష్యత్ లో తప్పకుండా చూసి తీరాల్సిందేనని అన్నాడు. ఈ నేపథ్యంలో పదేళ్ల కిందట రోహిత్ శర్మ అతడి గురించి చేసిన ట్వీట్ ఇప్పుడు వైరల్ గా మారింది. కాగా, ఈ మ్యాచ్ లో సూర్య బ్యాటింగ్ స్టయిల్ కు పలువురు ఇంగ్లాండ్ ప్లేయర్లు సైతం పిదా అయ్యారు.
Rohit Sharma knew it! 👀🇮🇳#SuryakumarYadav #ENGvIND #TeamIndia #India #CricketTwitter pic.twitter.com/d70AFMOFhW
— Sportskeeda (@Sportskeeda) July 10, 2022
ఇది కూడా చదవండి: సూర్యకుమార్ యాదవ్ ఆడినలాంటి షాట్స్ ఇప్పటివరకు చూడలేదు: ఇంగ్లాండ్ బౌలర్
ఇక.. మూడో టీ20 అనంతరం సూర్య ఇన్నింగ్స్ గురించి మాట్లాడిన రోహిత్ శర్మ.. ‘ఈ మ్యాచులో మేం ఓడినా.. ఆడిన విధానానికి గర్వంగా ఉంది. సూర్య ఇన్నింగ్స్ మ్యాచ్ కే హైలెట్. నేను ఎన్నో ఏళ్ల నుంచి అతని ఆటను చూస్తున్నా. అతనికి టీ20 ఫార్మాట్ అంటే ఎంతో ఇష్టం. అతని దగ్గర ఎన్నో రకాల షాట్స్ ఉన్నాయి. రోజురోజుకీ అతని ఆటతీరు మరింత మెరుగవుతోంది అని చెప్పుకొచ్చాడు. సూర్యకుమార్ యాదవ్ భవిష్యత్ ముందే ఊహించిన రోహిత్ శర్మపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
Let’s re-live SKY’s heroics from last night
India’s Mr.360#ENGvIND #SuryakumarYadav #TeamIndia pic.twitter.com/Zhab0kgu6W
— OneCricket (@OneCricketApp) July 11, 2022
ఇది కూడా చదవండి: Mithali Raj: రిటైర్మెంట్ తర్వాత గ్లామర్ డోస్ పెంచిన మిథాలీ రాజ్.. ఫోటోలు వైరల్!