క్రికెట్ లో జాత్యంకార వ్యాఖ్యలు కొత్తేమి కాదు. దిగ్గజ క్రికెటర్లు సైతం ఇలాంటి వాటి బారిన పడ్డారు. అయితే.. అది విదేశాలకు వెళ్ళినప్పుడు మాత్రమే జరిగేవి. అదే సొంత దేశంలో.. సొంత జట్టు ఆటగాళ్లు చేస్తే. అదీ ‘స్వచ్ఛమైన జట్టు’ అని పేరుండే న్యూజిలాండ్ క్రికెట్ జట్టులో. అవును నిజం.. ఈ విషయాలన్నీ న్యూజిలాండ్ మాజీ క్రికెటర్ రాస్ టేలర్ పూసగుచ్చినట్టు చెప్పుకొచ్చాడు. అంతర్జాతీయ క్రికెట్ కు రిటైర్మెంట్ ప్రకటించిన టేలర్ తన ఆత్మకథ ను విడుదల చేశారు. ఇందులో అలాంటి చీకటి విషయాలు ఎన్నో బయటపెట్టాడు. అవేంటో చూద్దాం..
న్యూజిలాండ్ జట్టు అంటే అందరూ అది ‘స్వచ్ఛమైన జట్టు’ అని భావిస్తారు. ఇతర జట్ల మాదిరిగా వివాదాలు, విభేదాలు, తగాదాలు, తలవంపులు తెచ్చిపెట్టిన ఘటనలు ఆ జట్టుకు చాలా తక్కువ. అసలు లేవని చెప్పుకున్నా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. ‘ప్రొఫెషనల్ క్రికెట్ ఆడతారు.. ప్రొఫెషనల్స్ గా వ్యవహరిస్తారు’ అని కివీస్ క్రికెటర్లకు మంచి పేరుంది. అయితే పైకి కనిపించేది మాత్రమే అంటున్నాడు.. రాస్ టేలర్. “మేడిపండును విప్పి చూస్తే లోపల ఉన్న పురుగులున్నట్లు.. న్యూజిలాండ్ క్రికెట్ లో వివక్ష సర్వ సాధారణమని సంచలన వ్యాఖ్యలు చేశాడు. అందుకు తానే బాధితుడినని చెప్పుకొచ్చాడు.
Ross Taylor reveals racial insensitivity in the New Zealand setup, that was likely considered “banter” by those involved https://t.co/GBYf4Z4HHm pic.twitter.com/Ksg4ZhP6va
— ESPNcricinfo (@ESPNcricinfo) August 11, 2022
‘బ్లాక్ అండ్ వైట్‘ పేరుతో రాసిన ఈ పుస్తకంలో ‘న్యూజిలాండ్‌లో క్రికెట్ చాలా అందమైన క్రీడ‘ అంటూ పేర్కొన్నారు. ‘నేను గోధుమ రంగులో ఉండేవాడిని, దీంతో సవాళ్లను ఎదుర్కోవలసి వచ్చింది. న్యూజిలాండ్ క్రికెట్‌లో పసిఫిక్ ద్వీపం నుండి వచ్చే వాళ్లు అరుదు. కాబట్టి నన్ను మావోరీ లేదా భారతీయ వారసత్వానికి చెందిన వాడినని భావించేవారు. లాకప్ రూమ్‌కు వెళ్లినప్పుడు అనుచితంగా మాట్లాడుతూ.. ఎగతాళి చేసేవారు. ఎదురు తిరిగితే.. ఆ సమస్య పెద్దదవుతుందని నాకు తెలుసు. అందుకే మిన్నకుండిపోయాను’ అని తన ఆత్మకథలో రాసుకొచ్చారు.
Ross Taylor opens up on the captaincy conflict that rocked New Zealand cricket in his autobiography:
READ MORE: https://t.co/1cKHZYcwAa#Cricket #CricketTwitter pic.twitter.com/xbSvJRD4HZ
— CricXtasy (@CricXtasy) August 11, 2022
“న్యూజిలాండ్ జట్టులో నా 16 ఏండ్ల క్రికెట్ కెరీర్ సక్రమంగా సాగిందని మాత్రమే బయట ప్రపంచానికి తెలుసు. కానీ అది నాణేనికి ఒక వైపు మాత్రమే. రెండో వైపు మరోలా ఉంది. డ్రెస్సింగ్ రూంలో జరిగే వివక్ష బయట ప్రపంచానికి తెలియదు. తెలియనివ్వరు. నా సొంత జట్టుకు చెందిన ఆటగాళ్లే.. నా మొహం గురించి కామెంట్స్ చేసేవాళ్లు. నీలో ఆసియా మూలాలున్నాయని, పొరపాటను నేను న్యూజిలాండ్ తరఫున ఆడుతున్నానని మాట్లాడేవాళ్లు..అయినా నేను మిన్నకుండిపోయేవాడిని అని రాసుకొచ్చారు. ఇంకా తన కెరీర్‌లో ఎదురైన అనేక విషయాలను రాస్ టైలర్ ఈ పుస్తకంలో పంచుకున్నారు. ఈ విషయంపై జట్టు ఆటగాళ్లు, మేనేజ్మెంట్ ఎలా స్పందిస్తారో చూడాలి.
Ross Taylor is about to play his final international game of cricket for New Zealand.
We will miss you Rosco #SparkSport #NZvNED pic.twitter.com/Y6kmXVHvSH
— Spark Sport (@sparknzsport) April 4, 2022
2006లో న్యూజిలాండ్ తరఫున అంతర్జాతీయ క్రికెట్ లో అరంగేట్రం చేసిన రాస్ టేలర్.. అనతి కాలంలోనే జట్టుకు నమ్మదగిన ప్లేయర్ గా మారిపోయాడు. బౌలర్ ఎవరైనా సరే బుల్లెట్ లాంటి షాట్లతో బౌండరీలకు పంపడం రాస్ టేలర్ ప్రత్యేకత. 38 ఏళ్ళ రాస్ టేలర్ తన కెరీర్ లో 112 టెస్టు మ్యాచ్ లు, 236 వన్డేలు, 102 టి20లు ఆడాడు. టెస్టుల్లో 19 సెంచరీలు, 35 అర్ధ సెంచరీలతో 7,683 పరుగులు చేశాడు. ఇక వన్డేల్లో 21 సెంచరీలు 51 అర్ధ సెంచరీలతో 8,607 పరుగులు సాధించాడు. టి20ల్లోనూ అదరగొట్టిన టేలర్ 7 అర్థ సెంచరీలతో 1,909 పరుగులు చేశాడు. అంతర్జాతీయ క్రికెట్ లోని మూడు ఫార్మాట్లలోనూ 100 మ్యాచ్ లు ఆడిన తొలి ప్లేయర్ రాస్ టేలర్. రాస్ టేలర్ కు జరిగిన ఈ అవమానాలపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
ఇదీ చదవండి: Yuvraj – Sachin: సంప్రదాయ దుస్తుల్లో సచిన్ టెండుల్కర్.. ఆట పట్టించిన యువీ!
ఇదీ చదవండి: Dronavalli Harika: 9 నెలల గర్భంతో కాంస్య పతకం.. శభాష్ అంటూ క్రీడాలోకం ప్రశంసలు!