“సెప్టెంబర్ 2 గాంధీ జయంతి.. ఈ రోజున టీమిండియా ఆటగాళ్లు ఇంత హింస సృష్టిస్తారా? అదీ సౌతాఫ్రికాపై..” అంటూ టీమిండియా మాజీ క్రికెటర్ వసీం జాఫర్ ఫన్నీగా చేసిన ట్వీట్ నెట్టింట వైరల్ గా మారిన సంగతి తెలిసిందే. ఈ మ్యాచ్ లో టీమిండియా బ్యాటర్లు విధ్వంసం అంతా.. ఇంతా కాదు. అదే విధంగా దక్షిణాఫ్రికా జట్టు సైతం మెరుపులు మెరిపించింది. కానీ విజయం మాత్రం సాధించలేకపోయింది. అయితే క్రీడా ప్రపంచంలో టీమిండియాకు ఉన్న క్రేజ్ తో […]
ఇంగ్లండ్-న్యూజిలాండ్ మధ్య 2019 వన్డే వరల్డ్ కప్ ఫైనల్ గుర్తుండే ఉంటుంది. తొలి ప్రపంచ కప్ కోసం రెండు జట్లు హోరాహోరీగా తలపడ్డాయి. చివరి వరకు నరాలు తెగే ఉత్కంఠగా సాగిన మ్యాచ్‌లో అదృష్టం ఇంగ్లండ్‌ను వరించింది. మ్యాచ్ సూపర్ ఓవర్లోనూ టై అయినా.. ఎక్కువ బౌండరీలు కొట్టిన ఇంగ్లండ్ జట్టును విజేతగా ప్రకటించాడు. దీంతో ఇంగ్లండ్ తొలిసారి విశ్వవిజేతగా నిలిచింది. మరో వైపు తొలి వరల్డ్ కప్ సాధించాలన్న న్యూజిలాండ్ ఆశలు అడియాశలయ్యాయి. ఫైనల్ మ్యాచ్‌లో […]
రాస్ టేలర్ తన ఆత్మకథలో ఆసక్తికర విషయాలు వెల్లడిస్తున్నాడు. 2022 ఏప్రిల్‌లో తన 16 ఏళ్ల క్రికెట్ కెరీర్‌కు ముగింపు పలికిన తర్వాత టేలర్ తన ఆత్మకథగా ‘రాస్ టేలర్ బ్లాక్ & వైట్’ అనే పుస్తకం రాసుకున్నాడు. తన జీవితంలో, కెరీర్లో జరిగిన ముఖ్యమైన ఘట్టాలను, ఆసక్తికరమైన ఎన్నో విషయంలో ఆ పుస్తకంలో వెల్లడించాడు. ఇప్పటికే న్యూజిలాండ్ డ్రెస్సింగ్ రూమ్ జాత్యహంకారం, ఐపీఎల్లో రాజస్థాన్ రాయల్స్ ఓనర్ తనపై టేలర్‌పై చేసుకున్న విషయాలు సంచలనంగా మారాయి. […]
న్యూజిలాండ్ మాజీ క్రికెటర్ రాస్ టేలర్ అంతర్జాతీయ క్రికెట్ కు రిటైర్మెంట్ ప్రకటించిన విషయం అందరకి తెలిసిందే. ఈ క్రమంలో తన 16 ఏళ్ల సుదీర్ఘ క్రికెట్ కెరీర్ లో ఏమేం జరిగాయో అందరకి తెలిసేలా.. ‘బ్లాక్ అండ్ వైట్’ పేరుతో తన ఆత్మకథను రాసుకొచ్చాడు టేలర్. అందులో తనకు జరిగిన అవమానాలన్నిటిని పూసగుచ్చినట్లు వివరించాడు. నిన్నటి దాకా జాత్యాంకార వ్యాఖ్యలు, తోటి ఆటగాళ్ల అవహేలళనలు బయటపెట్టిన టేలర్.. ఇప్పుడు మరో సంచలన విషయాన్ని వెలుగులోకి తెచ్చాడు. […]
క్రికెట్లో డకౌట్(పరుగులు చేయకుండా అవుట్ అవ్వడం) బ్యాటర్‌ను ఎంతో మనోవేదనకు గురిచేస్తుంది. కొత్తగా జట్టులోకి వచ్చిన యువ ఆటగాళ్లతో పాటు, వరల్డ్ కప్ లాంటి మెగా టోర్నీల్లో డకౌట్ అయితే స్టార్లు సైతం తీవ్ర నిరాశ చెందుతారు. ఇందుకు న్యూజిలాండ్ మాజీ క్రికెటర్, దిగ్గజ ఆటగాడు రాస్ టేలర్ కూడా అతీతం కాదు. అతను కూడా పలు మ్యాచ్‌ల్లో డకౌట్ అయ్యాడు. కానీ.. 2007 వరల్డ్ కప్‌లో ఇంగ్లండ్‌తో మ్యాచ్ సందర్భంగా డకౌట్ అవ్వడం తనను ఎంతో […]
క్రికెట్ లో జాత్యంకార వ్యాఖ్యలు కొత్తేమి కాదు. దిగ్గజ క్రికెటర్లు సైతం ఇలాంటి వాటి బారిన పడ్డారు. అయితే.. అది విదేశాలకు వెళ్ళినప్పుడు మాత్రమే జరిగేవి. అదే సొంత దేశంలో.. సొంత జట్టు ఆటగాళ్లు చేస్తే. అదీ ‘స్వచ్ఛమైన జట్టు’ అని పేరుండే న్యూజిలాండ్ క్రికెట్ జట్టులో. అవును నిజం.. ఈ విషయాలన్నీ న్యూజిలాండ్ మాజీ క్రికెటర్ రాస్ టేలర్ పూసగుచ్చినట్టు చెప్పుకొచ్చాడు. అంతర్జాతీయ క్రికెట్ కు రిటైర్మెంట్ ప్రకటించిన టేలర్ తన ఆత్మకథ ను విడుదల […]
న్యూజిలాండ్ దిగ్గజ క్రికెటర్ రాస్ టేలర్ నెదర్లాండ్స్‌తో వన్డే మ్యాచ్ సందర్భంగా జాతీయ గీతం ఆలపిస్తున్న సమయంలో కన్నీళ్లు పెట్టుకున్నాడు. టేలర్ అంతర్జాతీయ కెరీర్లో ఇదే చివరి మ్యాచ్. దీంతో కొంత భావోద్వేగానికి గురైన టేలర్ గ్రౌండ్‌లోనే ఏడ్చేశాడు. జాతీయ గీతం పాడడం అయిన వెంటనే తన పిల్లలు ముద్దాడుతూ కన్నీటి పర్యంతమయ్యాడు. జట్టు సభ్యులు ఆ సమయంలో టేలర్ భుజం తట్టారు. కాగా ఈ మ్యాచ్‌లో టేలర్ కేవలం 14 పరుగుల మాత్రమే చేశాడు. జట్టు […]
న్యూజిలాండ్ దిగ్గజ క్రికెటర్ రాస్ టేలర్ చాలా సుదీర్ఘమైన కెరీర్‌కు ఇటివల వీడ్కోలు పలికాడు. అంతర్జాతీయ క్రికెట్ నుంచి రిటైర్ అయిన టేలర్ తాజాగా టీమిండియా యువ క్రికెటర్లపై ప్రశంసల వర్షం కురిపించాడు. టీమిండియా వికెట్ కీపర్ రిషభ్ పంత్, బ్యాట్స్‌మెన్ శ్రేయస్ అయ్యర్ భవిష్యత్తులో ఇండియన్ క్రికెట్లోనే కాదు.. ప్రపంచ క్రికెట్లోనే సూపర్స్టార్లుగా నిలుస్తారని టేలర్ అభిప్రాయపడ్డారు. చాలా తక్కువ సమయాల్లో మాత్రమే స్పందించే టేలర్ ఇలా భారత యువ క్రికెటర్లపై ప్రశంసలు కురిపించడం విశేషం. […]
న్యూజిలాండ్ దిగ్గజ ఆటగాడు రాస్ టేలర్ ఇటివల క్రికెట్‌కు గుడ్‌బై చెప్పిన విషయం తెలిసిందే. బంగ్లాదేశ్‌తో జరిగిన టెస్ట్ మ్యాచ్ టేలర్ కెరీర్లో చివరి మ్యాచ్. ఈ మ్యాచ్‌లో టేలర్ అద్భుతం చేశాడు. క్రికెట్ చరిత్రలో ఏ క్రికెటర్‌కు లభించని ముగింపు టేలర్‌కు దక్కింది. ఎవరైన తమ క్రికెట్ కెరీర్లో చివరి మ్యాచ్‌లో మంచి ప్రదర్శన కనబర్చాలని భావిస్తున్నారు. కానీ టేలర్ ఏకంగా మ్యాచ్‌ను తన బౌలింగ్‌తోనే ముగించి గెలుపుతోనే గుడ్‌బై చెప్పాడు. స్వదేశంలో బంగ్లాదేశ్‌తో జరిగిన […]
న్యూజిలాండ్ సీనియర్ క్రికెటర్ రాస్ టేలర్ అంతర్జాతీయ క్రికెట్ నుంచి రిటైర్ కానున్నట్లు ఇటివల ప్రకటించారు. ప్రస్తుతం బంగ్లాదేశ్‌తో జరుగుతున్న టెస్టు మ్యాచ్‌లో టేలర్ ఆడుతున్నారు. ఆదివారం ప్రారంభమైన టెస్టులో బంగ్లాదేశ్ మొదటి ఇన్నింగ్స్‌లో 126 పరుగులకే కుప్పకూలింది. న్యూజిలాండ్ రెండో ఇన్నింగ్స్‌లో 6 వికెట్లకు 521 పరుగులు చేసి ఇన్నింగ్స్‌ను డిక్లేర్ చేసింది. కాగా మ్యాచ్ ప్రారంభానికి ముందు రెండు జట్లు జాతీయ గీతం ఆలపించాయి. ఆ సమయంలో న్యూజిలాండ్ దిగ్గజ ఆటగాడు రాస్ టేలర్ […]