టీమిండియా క్రికెట్ దిగ్గజం.. మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండుల్కర్ కొత్త గెటప్‌లో కనిపించాడు. గోధుమ రంగు షేర్వాణీ ధరించి.. ఎర్రటి తలపాగాతో రాజవంశీయుడిగా కనిపించాడు. అందుకు సంబంధించిన వీడియోను స్వయంగా సచినే ఇన్‌స్టాలో పోస్ట్ పోస్ట్ చేస్తూ.. వెడ్డింగ్, షాదీ సెలబ్రేషన్ అంటూ హ్యాష్ ట్యాగ్స్ జత చేశాడు. 'నా అన్న నితిన్ కూతురు పెళ్లి.. అందుకే ఈ సంప్రదాయ డ్రెస్సుతో పాటు ఫేటాను ధరించాను' అంటూ అందరిని పలకరించాడు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్‌గా మారింది. సచిన్ పోస్ట్‌పై టీమిండియా మాజీ ఆల్‌రౌండర్ యువరాజ్ సింగ్ సరదాగా స్పందించాడు. సచిన్‌ను టీజ్ చేస్తూ.. ''ఓయ్ సచిన్ కుమార్.. హే'' అంటూ కామెంట్ చేసాడు. సచిన్ అంటే తనకు ప్రత్యేకమైన అభిమానం అని యువీ చాలాసార్లు చెప్పుకొచ్చిన సంగతి తెలిసిందే. 2011 వన్డే వరల్డ్‌కప్ సమయంలో తన ఆల్‌రౌండ్ ప్రదర్శనతో భారత్‌కు టైటిల్ అందించిన యువరాజ్ తన గెలుపును సచిన్‌కు అంకితమిచ్చి.. ''ఇదంతా సచిన్ కోసమే'' అంటూ అప్పట్లో పేర్కొన్నాడు. View this post on Instagram A post shared by Sachin Tendulkar (@sachintendulkar) ఇదీ చదవండి: వాళ్లు నన్ను ఎందుకు తీసుకోవడం లేదో నాకు తెలియదు: శిఖర్ ధావన్ ఇదీ చదవండి: అమెరికాలో భారత్-వెస్టిండీస్ మ్యాచ్! అల్లు అర్జున్ క్రేజ్ మామూలుగా లేదుగా..