యూఏఈ వేదికగా ఈ నెల 27 నుంచి ఆసియా కప్ ప్రారంభం కానున్న విషయం తెలిసిందే. ఈ టోర్నీ కోసం బీసీసీఐ సెలెక్టర్లు ఇప్పటికే జట్టును ప్రకటించారు. ఈ జట్టులో టీమిండియా సీనియర్ ప్లేయర్ శిఖర్ ధావన్‌కు చోటు దక్కలేదు. 2021లో శ్రీలంక పర్యటనకు వెళ్లే భారత టీ20 జట్టుకు ధావన్ కెప్టెన్‌గా, ప్లేయర్‌గా చివరి సారి ఆడాడు. ఆ తర్వాత అతను భారత టీ20 జట్టుకు ఎంపిక కాలేదు. తాజాగా ఆసియా కప్ జట్టులో చోటు దక్కకపోవడంపై స్పందించిన ధావన్.. టీ20 ఫార్మాట్‌లో భారత జట్టుకు తాను ఎందుకు ఎంపిక కావట్లేదో తనకు తెలియదని ఒకింత నిరాశతో చెప్పాడు. ఇక ఆ విషయం గురించి తాను పెద్దగా ఆలోచించనని, వచ్చిన అవకాశాల్లో తన అత్యుత్తమ ప్రదర్శన ఎలా ఇవ్వాలనే దానిపైనే దృష్టి సారిస్తానని ధావన్ చెప్పాడు. ‘నిజాయితీగా చెప్తున్నా.. టీ20 టీమ్‌లోకి నన్ను ఎందుకు తీసుకోరో నాకు తెలియదు. వాళ్ల దగ్గర ఏదైనా కారణం ఉండొచ్చు. అయినా దాని గురించి ఎక్కువగా ఆలోచించి బుర్ర పాడు చేసుకోవాలని అనుకోవడం లేదు. నేను చాలా కాలంగా భారత జట్టు టీ20 ఫార్మాట్లో ఆడలేదు.. నన్ను ఏ ఫార్మాట్లో ఎంపిక చేస్తారో కూడా నాకు తెలియదు. నాకు లభించిన ప్రతి అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవడమే నా పని. అది ఐపీఎలైనా.. దేశవాళీ క్రికెటైనా లేదా భారత వన్డే జట్టు అయినా. చోటు దక్కినప్పుడు నేను బాగా రాణించాలనుకుంటా. నా చేతుల్లో ఉంది అదొక్కటే. మిగతదంతా నా హ్యాండోవర్లో ఉండదు కదా' అని ధావన్ వెల్లడించాడు. కాగా ధావన్ జింబాబ్వేతో మూడు వన్డేల సిరీస్ కోసం టీమిండియా కెప్టెన్‌గా వ్యవహరించనున్నాడు. మరి ధావన్ వ్యాఖ్యలపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి. “I honestly don’t know about it, maybe it could be the reason [same accumulative batting style as Kohli, Rahul, Sharma in top order]” : @SDhawan25 on why he doesn’t get to play T20s for India. ✍️ @AshishSatyam7https://t.co/UXqM6C7zbL — Express Sports (@IExpressSports) August 9, 2022 ఇది కూడా చదవండి: ఫామ్.. గీమ్ పక్కన పెడితే.. పాక్‌తో మ్యాచ్ కోహ్లీకి ఎంతో స్పెషల్!