మహిళా ఆసియా కప్ 2022 టోర్నీలో మిత్ర దేశం శ్రీలంక సంచలన విజయాన్ని నమోదు చేసింది. పాకిస్తాన్ తో జరిగిన సెమీఫైనల్ పోరులో ఒక్క పరుగు తేడాతో విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన శ్రీలంక 20 ఓవర్లలో ఆరు వికెట్ల నష్టానికి 122 పరుగులు చేయగా.. పాకిస్థాన్ చివరి ఓవర్ చివరి బంతి వరకు పోరాడి ఒక్క పరుగు తేడాతో పరాజయం పాలైంది. అయితే.. ఈ మ్యాచులో విజయం చివరిదాకా పాకిస్తాన్ వైపే ఉండటం గమనార్హం. చివరిబంతిలో ఫలితం తారుమారయ్యింది. ఈ విజయంతో శ్రీలంక మహిళల జట్టు 14 ఏండ్ల తర్వాత ఆసియా కప్ ఫైనల్ ఆడనుంది.
పాకిస్తాన్ పురుష క్రికెట్ జట్టు ఆట గురుంచి యావత్ క్రికెట్ ప్రపంచానికి బాగా తెలుసు. గెలవాల్సిన మ్యాచులో ఓడిపోవడం.. ఓడిపోతున్నాం అనుకునే సమయంలో గెలిచి చూపించడం.. వీరికి సదా మామూలే. అలాంటి ప్రదర్శనను పాక్ మహిళా జట్టు కూడా పునరావృతం చేసింది. గెలిచి ఫైనల్ చేరాం.. అనుకునేలోపే ఓడిపోయి ఇంటిదారి పట్టింది. మహిళా ఆసియా కప్ 2022 టోర్నీలో భాగంగా గురువారం పాకిస్థాన్-శ్రీలంక మధ్య రెండోసెమీఫైనల్ మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన శ్రీలంక నిర్ణీత 20 ఓవర్లలో ఆరు వికెట్ల నష్టానికి 122 పరుగులు చేసింది. అనంతరం 123 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన పాకిస్థాన్ చివరి ఓవర్ చివరి బంతి వరకు పోరాడి ఒక్క పరుగు తేడాతో పరాజయం పాలైంది. 26 పరుగులు చేసిన నిదా దార్ ఇన్నింగ్స్ చివరి బంతికి రనౌట్ అయింది. ఫలితంగా 121 పరుగుల వద్ద పాక్ ఇన్నింగ్స్ ముగిసింది.
Pak team lost the match because Nida Dar missed many singles in last overs #PAKvsSL pic.twitter.com/a0ZgTsI7Z6
— Muhammad Waseem Khan (@VoiceofMWK) October 13, 2022
చివరి ఓవర్‌లో పాకిస్థాన్ విజయానికి 9 పరుగులు అవసరం కాగా తొలి రెండు బంతులకు రెండు పరుగులు వచ్చాయి. మూడో బంతికి రెండు పరుగులు, నాలుగు.. ఐదో బంతులకు ఒక్కో పరుగు వచ్చింది. దీంతో పాక్ గెలవాలంటే చివరికి మూడు పరుగులు అవసరమయ్యాయి. చివరి బంతిని నిదా దార్ బౌండరీని తరలించాలనుకున్నప్పటికీ కుదరలేదు. కనీసం ‘డ్రా’ చేద్దామని ప్రయత్నించినప్పటికీ రెండో పరుగు కోసం పరుగెడుతూ రనౌట్ అయింది. అంతే.. శ్రీలంక ఒక్క పరుగు తేడాతో విజయం సాధించింది. కాగా, శ్రీలంక ఈ నెల 15న భారత్‌తో జరిగే ఫైనల్లో అమీతుమీ తేల్చుకోనుంది.
Sri Lanka Women Dancing After Humiliating Pakistan On Same Ground. #PAKvsSLpic.twitter.com/U0iQXkFPF2
— Prof. Boies Pilled Bell 🪄 (@Lil_Boies45) October 13, 2022
Sri Lanka is new Nightmare for us💔#PAKvSL #Cricket #PAKvsSL #WomensAsiaCup2022 pic.twitter.com/ay47ecvTri
— Men In Green (@MenInGreen786) October 13, 2022