దాయాది దేశం పాకిస్తాన్ ఆట తీరు గురుంచి యావత్ క్రికెట్ ప్రపంచానికి బాగా తెలుసు. గెలవాల్సిన మ్యాచులో ఓడిపోవడం.. ఓడిపోతున్నాం అనుకునే సమయంలో గెలిచి చూపించడం.. వీరికి సదా మామూలే. పోనీ, అలాంటి సంఘటనలు బలమైన జట్లతోనా! అంటే కాదు.. పసికూన జట్లపైనే ఇలాంటి ప్రదర్శన ఉంటుంది. అదే ప్రత్యర్థి జట్టు బలమైనది అయితే.. ఏకంగా తల కిందకు దించడమే.. మళ్లీ ఎత్తేదంటూ ఉండదు. ఒక మ్యాచులో అలాంటి ఆటతీరుతో పరువు పోగొట్టుకున్న పాకిస్తాన్ కు.. నేటితో 20 ఏళ్లు నిండాయి. ఇంతకీ ఆ మ్యాచ్ ఎప్పుడు జరిగింది? ఫలితమేంటి? అన్నది ఇప్పుడు చూద్దాం..
2002, అక్టోబర్ నెలలో షార్జా వేదికగా ఆస్ట్రేలియా- పాకిస్తాన్ జట్ల మధ్య మూడు మ్యాచుల టెస్ట్ సిరీస్ జరిగింది. ఈ సిరీస్ ను ‘స్టీవ్ వా’ సారథ్యంలోని ఆసీస్ జట్టు 3-0తో సొంతం చేసుకుంది. అయితే.. ఈ సిరీసులోని రెండో టెస్టులో పాకిస్తాన్ ఆటగాళ్లు కనబరిచిన పోరాటపటిమ.. ఆ ఏడాదికే హైలైట్ గా నిలిచింది. వాళ్ల పోరాటపటిమను తట్టుకోలేక 5 రోజుల టెస్ట్ మ్యాచ్ కాస్తా.. 2 రోజులకే ముగిసింది. తొలుత టాస్ గెలిచిన పాక్ బ్యాటింగ్ ఎంచుకోగా, బ్యాటింగ్ కు దిగిన పాక్ బ్యాటర్లు.. 32.5 ఓవర్లలో 59 పరుగులకే పెవిలియన్ కు చేరారు. మ్యాచ్ ఆరంభమైన రెండు గంటల్లోనే పాక్ తొలి ఇన్నింగ్స్ ముగియడం గమనార్హం. ఆపై.. ఆస్ట్రేలియా జట్టు తొలి ఇన్నింగ్స్ లో 310 పరుగులు చేయగా.. పాక్ బ్యాటర్లు మరోసారి తమ వీరత్వాన్ని చూపారు. సెకండ్ ఇన్నింగ్స్ లో 24.5 ఓవర్లలో 53 పరుగులకు ఆలౌట్ అయ్యారు.
కాగా, ఈ మ్యాచులో ఆస్ట్రేలియా తొలి ఇన్నింగ్స్ లో మాథ్యూ హెడెన్(119) సెంచరీ చేయగా.. పాక్ బ్యాటర్లు 11 మంది రెండు ఇన్నింగ్స్ ల్లో చేసిన పరుగులు అంతకంటే తక్కువుగా(53 + 59 = 112) ఉండడం గమనార్హం. నేటితో ఈ టెస్ట్ మ్యాచుకు 20 ఏళ్లు గడిచాయి. ఈ క్రమంలో ఆ పోరాటాన్ని గుర్తుచేసుకుంటూ సోషల్ మీడియాలో పోస్టులు వెలువడుతున్నాయి. ‘పాక్.. అద్భుత పోరాటానికి నేటితో 20 ఏళ్లు..’ అంటూ నెటిజన్స్ ఆ మ్యాచుకు సంబంధించిన స్కోర్ కార్డును షేర్ చేస్తున్నారు.
Last 2 day test @ Sharjah.
Pakistan After all out for 59 runs on the 1st day
they bundled out for 53 on the 2nd Day of test vs Australia @ Sharjah 2002 & Lost by an innings & 198 runs
Game ended in 2 days@ShaneWarne have 4 /11 & 4/13 in the test Match pic.twitter.com/BACscHUw8c https://t.co/z5GaF8SIqq— Zohaib (Cricket King) 🏏 (@Zohaib1981) February 25, 2021