ప్రస్తుతం టీమిండియా వరుస విజయాలతో మంచి జోరు మీద ఉంది. ఇంగ్లండ్‌పై వన్డే, టీ20 సిరీస్‌లు, పసికూన ఐర్లాండ్‌పై రెండు టీ20ల్లో విజయం, తాజాగా వెస్టిండీస్‌పై వన్డే సిరీస్ క్లీన్‌స్వీప్, టీ20 సిరీస్‌ను 4-1తో కైవసం చేసుకుంది. ఇదే జోష్‌లో జింబాబ్వేతో మూడు వన్డేల సిరీస్‌కు సిద్దమైంది. అందులోనూ టీమిండియా ఎదురులేపోవచ్చు. ఆ తర్వాత ఆసియా కప్, టీ20 వరల్డ్ కప్ లాంటి మెగా టోర్నీలు ఉన్నాయి. విజయాల పరంగా చూస్తే టీమిండియాకు ఎదురులేకుండా కనిపిస్తున్నా.. జట్టులోని ఆటగాళ్ల స్థిరత్వాన్ని పరిశీలిస్తే మాత్రం ఒకింగ అయోమయం, ఆందోళన కలుగుతున్నాయంటూ క్రికెట్ నిపుణులు అభిప్రాయపడతున్నారు. హెడ్ కోచ్ రాహుల్ ద్రవిడ్ టీమిండియాను ఒక ప్రయోగశాలగా మారుస్తున్నారంటూ కూడా విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. ఇలానే కొనసాగితే మొదటికే ముప్పు వస్తుందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కోచ్ ద్రవిడ్‌పై ఇలాంటి విమర్శలు ఎందుకు వస్తున్నాయో ఇప్పుడు తెలుసుకుందాం..
టీమిండియా మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ తర్వాత టీమిండియాకు ఏకంగా ఏడుగురు కెప్టెన్లుగా వ్యవహరించారు. కోహ్లీ తర్వాత పూర్తి స్థాయి కెప్టెన్‌గా రోహిత్ శర్మ బాధ్యతలు చేపట్టినప్పటికీ.. గాయాలు, ఫిట్‌నెస్ సమస్యలతో పలు సిరీస్‌లకు దూరమయ్యాడు. అతని స్థానంలో కెప్టెన్సీ బాధ్యతలు నిర్వర్తించాల్సిన వైస్ కెప్టెన్ కేఎల్ రాహుల్ కూడా గాయాల కారణంగా జట్టుకు దూరమయ్యాడు. ఇలాంటి అనివార్య పరిస్థితుల్లో రిషభ్ పంత్, శిఖర్ ధావన్, జస్ప్రీత్ బుమ్రా, హార్దిక్ పాండ్యా టీమిండియాకు కెప్టెన్లుగా వ్యవహరించారు. ఈ కెప్టెన్ల మార్పు వేరే దారి లేక చేయాల్సి వచ్చిందని సాక్ష్యాత్తు బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీనే ప్రకటించాడంటేనే అర్థం అవుతుంది ఈ విషయంపై ఏ స్థాయిలో విమర్శలు వచ్చాయో.
కెప్టెన్ల మార్పు సంగతి పక్కన పెడితే.. ఆటగాళ్ల బ్యాటింగ్ పోజిషన్స్‌లో భారీ మార్పులు చేస్తున్నారు. ఏ మ్యాచ్‌లో ఎవరు ఓపెనింగ్ చేస్తారో కూడా చెప్పలేని పరిస్థితి నెలకొంది. మిడిల్డార్‌లో ఆడుతున్న ఆటగాడిని సడెన్‌గా ఓపెనర్‌గా దింపుతున్నారు. కొన్ని సార్లు ఫామ్‌లో లేక ఇబ్బంది పడుతున్న ఆటగాళ్లను ఫామ్‌లోకి తెచ్చేందుకంటూ ఓపెనర్‌గా పంపిస్తున్నారు. ఈ క్రమంలో రిషభ్ పంత్, దీపక్ హుడా, సంజూ శాంసన్, సూర్యుకుమార్ యాదవ్ తాజాగా శ్రేయస్ అయ్యర్‌ను ఓపెనర్‌గా ప్రయోగించారు.
సూర్యకుమార్ యాదవ్, శ్రేయస్ అయ్యర్లు వన్‌డౌన్, మిడిల్డార్‌లో అద్భుతంగా ఆడే ప్లేయర్లు.. వారిని ఓపెనర్లుగా ఎందుకు ఆడించారో తెలియదు. పైగా ఓపెనర్‌గా ఆడిన తొలి రెండు మ్యాచ్‌ల్లో సూర్య దారుణంగా విఫలం అయ్యాడు. మూడో మ్యాచ్‌లో 74 పరుగులతో రాణించాడు. శ్రేయస్ అయ్యర్ వెస్టిండీస్‌తో చివరి టీ20 మ్యాచ్‌లో ఓపెనర్‌గా వచ్చి హాఫ్ సెంచరీతో ఆకట్టుకున్నాడు. ఈ ప్రయోగాలు కొన్నిసార్లు మంచి ఫలితం ఇస్తున్నా.. ఆ స్థానంలో రాణించిన ఆటగాడు అదే స్థానంలో పర్మినెంట్‌గా ఆడతాడనే గ్యారంటీ లేదు.
రోహిత్ శర్మ ఒక ఎండ్‌లో టీమిండియా ఓపెనర్‌గా అన్ని ఫార్మాట్లకు ఫిక్స్ అయి ఉన్నాడు. అతను గాయపడితే తప్పా ఓపెనింగ్ స్థానం అతనిదే. కేఎల్ రాహుల్ జట్టులోకి తిరిగి వస్తే.. మరో ఓపెనర్‌గా ఉంటాడు. మరి అలాంటప్పుడు ఎందుకు ఇంతమందిని ఓపెనర్లుగా ప్రయోగిస్తున్నారో సగటు క్రికెట్ అభిమానికి అర్థం కావడంలేదు. రోహిత్, రాహుల్‌లలో ఒకరు అందుబాటులో లేకున్నా.. ఇషాన్ కిషన్ లాంటి ఓపెనర్ జట్టులో ఉన్నాడు. అయినా కూడా సంజూ శాంసన్, సూర్యకుమార్ యాదవ్, దీపక్ హుడా, శ్రేయస్ అయ్యర్, రిషభ్ పంత్‌ను ఓపెనర్లుగా ప్రయోగించారు.
ప్రస్తుతం జట్టు చూసేందుకు బలంగా ఉన్నా.. జట్టులోని ఆటగాళ్లకు వారివారి స్థానాలపై గ్యారంటీ లేదు. ఇది ఆటగాళ్ల ఆత్మవిశ్వాసాన్ని దెబ్బతీసే ప్రమాదం ఉంది. గతంలో ఇలాంటి ప్రయోగమే ఇర్ఫాన్ పఠాన్ విషయంలోనూ జరిగింది. ఆల్‌రౌండర్‌గా ఉండి జట్టు 6, 7వ స్థానంలో బ్యాటింగ్‌కు వచ్చే పఠాన్‌ను పలు మ్యాచ్‌లలో ఓపెనర్‌గా ఆడించారు. కొన్ని సార్లు అది మంచి ఫలితం ఇచ్చినా దీర్ఘకాలంలో జట్టులో పఠాన్ సుస్థిరతను దెబ్బతీసింది. ఇప్పుడు టీమిండియా మళ్లీ అలాంటి పరిస్థితే కనిపిస్తుంది. నేను ఈ స్థానంలో బ్యాటింగ్‌కు వస్తాను.. ఈ పరిస్థితుల్లో బ్యాటింగ్ చేయాల్సి ఉంటుందనే కనీస గ్యారంటీ ఏ ఆటగాడి వద్ద కూడా లేదు. అంతో ఇంతో ఉంటే కెప్టెన్ రోహిత్ వర్మ ఓపెనర్‌గా, దినేష్ కార్తీక్ ఫినిషర్‌గా ఉన్నారు. ఈ ఇద్దరి స్థానాలే కొంత పర్మినెంట్‌గా కనిపిస్తున్నాయి.
ప్రస్తుతం చేస్తున్న ప్రయోగాలన్ని టీ20 వరల్డ్ కోసమే అని కోచ్ ద్రవిడ్, కెప్టెన్ రోహిత్ శర్మ చెబుతున్నా.. కేఎల్ రాహుల్, విరాట్ కోహ్లీ జట్టులోకి వస్తే వారివారి స్థానాలు ఫిక్స్ అయి ఉంటాయి. మరి యువ క్రికెటర్లతో చేస్తున్న ఈ ప్రయోగాలను ఎందుకు పనికి రాకుండా పోతాయి. పైగా యువ క్రికెటర్లను అడ్డగోలుగా ఇష్టమొచ్చిన స్థానాల్లో ఆడిస్తే.. వారిలో కన్ఫ్యుజన్ పెరిగే ప్రమాదం ఉంది. ఇది జట్టు ప్రదర్శనపై తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉంది. అందుకే.. ఇక్కడితో ఈ ప్రయోగాలకు స్వస్థి చెప్పి.. ఆటగాళ్లను ఒక స్థిరమైన బ్యాటింగ్‌లైనప్‌లో ఆడించాలని క్రికెట్ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. మరి ఈ విషయంలో మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
Shreyas Iyer departs after a well-made half-century.#WIvIND pic.twitter.com/DR96v8fpD4
— CricTracker (@Cricketracker) August 7, 2022