టెస్టుల సంగతి పక్కన పెడితే.. టీ20లు మొదలయ్యాక అభిమానులకు హిట్టింగ్ అంటే అమితమైన ప్రేమ పెరిగిపోయింది. ఇప్పుడు అవి మరో పది ఓవర్లు తగ్గి టీ10 లీగ్లు కూడా స్టార్ట్ అయ్యాయి. ఈ మ్యాచుల్లో ఎన్నో అద్భుతాలు జరుగుతుంటాయి. మ్యాచ్ ఆసాంతం బౌండిరీలు బాదడం ఒకెత్తు అయితే.. ఆఖరి ఓవర్లో ప్రతి బంతిని సిక్సర్ కొట్టి మ్యాచ్ గెలిపించడం అంటే మామూలు విషయం కాదు. కానీ, వెస్టిండీస్ క్రికెటర్ ఆండ్రీ ఫ్లెచర్ అలాంటి అసాధ్యాన్ని సుసాధ్యం చేసి చూపించాడు.
ఇదీ చదవండి: ధోనీ కెప్టెన్సీ నుంచి తప్పుకోవడంపై విరాట్ కోహ్లీ ఎమోషనల్ ట్వీట్
విన్సీ ప్రీమియర్ లీగ్- 2022లో ఈ ఫీట్ నమోదైంది. బొటానికల్ గార్డెన్స్ రేంజర్స్, ఫోర్ట్ చార్లెట్ స్ట్రైకర్స్ మధ్య టీ10 మ్యాచ్ జరిగింది. ఈ ఉత్కంఠ పోరులో బొటానికల్ గార్డెన్స్ విజయం సాధించింది. 10 ఓవర్లలో 108 పరుగుల లక్ష్యాన్ని చేధించాల్సి ఉంది. విజయం కోసం ఆఖరి ఓవర్ లో బొటానికల్ గార్డెన్స్ జట్టు 21 పరుగులు చేయాల్సి ఉంది. అప్పటికే 27 బంతుల్లో 39 పరుగులు చేసి మంచి ఫామ్ లో ఉన్న ఫ్లెచర్ క్రీజులో ఉన్నాడు. మొదటి బాల్ డాట్, రెండో బంతి నో బాల్ తో పాటు బౌండిరీ కూడా వచ్చింది. అంటే ఐదు బంతుల్లో 16 పరుగులు కొట్టాలి. మ్యాచ్ మొత్తం తిరిగి పోయింది అనుకున్నారు. కానీ, వరుసగా రెండు డాట్లు పడ్డాయి. చివరి మూడు బంతులకు 16 పరుగులు కావాలి. అందరూ ఆ మ్యాచ్ పై ఆశలు వదిలేసుకున్నారు. అప్పుడు ఫ్లెచర్ విధ్వంసకర బ్యాటింగ్ లో సిక్సు, ఫోర్, సిక్సు కొట్టి బొటానికల్ గార్డెన్స్ రేంజర్స్ ను విజయ తీరాలకు చేర్చాడు. మరి ఫ్లెచర్ ఫినిషింగ్ మీరూ చూసేయండి.
16 needed off 3 balls and @AndreFletch delivers! 🔥
📺 Watch the captivating innings on #FanCode 👉 https://t.co/Fg9i08WZLv pic.twitter.com/jn3AmZCQPR
— FanCode (@FanCode) March 24, 2022
మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం SumanTV App డౌన్లోడ్ చేసుకోండి.