క్రికెట్ ప్రపంచాన్ని ఒంటి కన్నుతో శాసించిన వెస్టిండీస్.. ప్రస్తుతం దీనస్థితిలోకి వెళ్లిపోతోంది. ప్రత్యర్థికి కనీసం పోటీ ఇవ్వలేని జట్టుగా.. ఒక పసికూన టీమ్‌గా మారుతోంది. ముఖ్యంగా టెస్టు ఫార్మాట్‌లో వెస్టిండీస్ టీమ్ ప్రదర్శన మరీ దారుణంగా తయారైంది. రెండు టెస్టు సిరీస్ కోసం ఆస్ట్రేలియా టూర్‌కు వెళ్లిన విండీస్ జట్టు.. క్లీన్ స్వీప్ చేయించుకుంది. అడిలైడ్ వేదికగా జరిగిన రెండో టెస్టుల్లో దారుణంగా ఓడింది. ముఖ్యంగా రెండో ఇన్నింగ్స్‌లో కేవలం 77 పరుగుల స్వల్ప స్కోర్‌కే ఆలౌటై.. 419 పరుగుల భారీ తేడాతో ఓటమి చవిచూసింది. ఇప్పటికే తొలి టెస్టులో ఘన విజయం సాధించిన ఆస్ట్రేలియా రెండో టెస్టులోనూ అద్భుత విజయం సాధించి.. టెస్టు ఛాంపియన్‌షిప్‌లో తమ అగ్రస్థానాన్ని మరింత పటిష్టంగా చేసుకుంది.
రెండో టెస్టులో 497 టార్గెట్‌తో రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన విండీస్‌ను ఆస్ట్రేలియా బౌలర్లలో మిచెల్ స్టార్క్, మైఖేల్ నెసర్, స్కాట్ బొలాండ్ మూడేసి వికెట్లతో వెస్టిండీస్ బ్యాటర్లను వణికించారు. వీరికి తోడు నాథన్ లియోన్ ఒక వికెట్ పడగొట్టాడు. వెస్టిండీస్ బ్యాటర్లలో ముగ్గురు డకౌట్ అవ్వగా.. విండీస్ దిగ్గజ మాజీ క్రికెటర్ శివనారాయణ్ చంద్రపాల్ కుమారుడు తగెనారాయణ్ చంద్రపాల్(17) టాప్ స్కోరర్‌గా నిలిచాడు. గురువారం మొదలైన ఈ టెస్టులో తొలుత బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా మొదటి ఇన్సింగ్‌లో 511 పరుగులు చేసి భారీ స్కోరు చేసింది. మార్నస్ లబుషేన్ (163), ట్రావిస్ హెడ్ (175) సెంచరీలో దుమ్మురేపారు. 137 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 511 పరుగులు చేసి.. ఆసీస్ ఇన్నింగ్స్‌ను డిక్లేర్ చేసింది.
తొలి ఇన్నింగ్స్‌లో వెస్టిండిస్ 214 పరుగులకే కుప్పకూలింది. దీంతో ఆస్ట్రేలియాకు 297 పరుగుల ఫస్ట్ ఇన్నింగ్స్ లీడ్ లభించింది. ఫాలో ఆన్ ఆడించకుండా ఆస్ట్రేలియా రెండో ఇన్సింగ్ ఆడేందుకే మొగ్గుచూపింది. ఆరు వికెట్ల నష్టానికి 199 పరుగులు చేసి మళ్లీ డిక్లేర్ చేసి… వెస్టిండీస్ ముందు 496 పరుగుల భారీ టార్గెట్ ఉంచింది. అడిటైడ్ పిచ్‌పై ఆస్ట్రేలియా పేసర్లు నిప్పులు చెరగడంతో రెండో ఇన్సింగ్‌లోనూ వెస్టిండిస్ బ్యాటర్లు దారుణంగా విఫలమయ్యారు. 4 వికెట్లకు 38 పరుగుల ఓవర్ నైట్ స్కోర్‌తో నాలుగో రోజు ఆటను ప్రారంభించిన వెస్టిండీస్ మరో 18 ఓవర్లలో మిగిలిన 6 వికెట్లు కోల్పోయి.. 77 పరుగులకే కుప్పకూలింది. దీంతో 2-0తో తేడాతో ఆస్ట్రేలియా టెస్టు సిరీస్‌ను క్లీన్ స్వీప్ చేసింది. ఈ మ్యాచ్‌లో సెంచరీతో అదరగొట్టిన లబుషేన్ కూడా బౌలింగ్ వేయడం విశేషం.
Starc + Pink Ball = 🔥😂😱 #AUSvsWI
pic.twitter.com/xXnlqLmNVa— OneCricket (@OneCricketApp) December 11, 2022
Congratulations to our Australian Men’s Cricket Team, winning the second test by 419 runs, retaining the Frank Worrell trophy 2 – 0. pic.twitter.com/tyIhIk6lHo
— Cricket Australia (@CricketAus) December 11, 2022