SumanTV
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • పాలిటిక్స్
  • సినిమా
  • క్రీడలు
  • ఐపీఎల్ 2023
  • తెలంగాణ
  • ఓటిటి
  • క్రైమ్
  • SumanTV Android App
  • SumanTV iOS App
Trending
  • #90's క్రికెట్
follow us:
  • SumanTV Google News
  • SumanTV Twitter
  • SumanTV Fb
  • SumanTV Instagram
  • SumanTV Telegram
  • SumanTV Youtube
  • SumanTV Dialy Hunt
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • సినిమా
  • రివ్యూలు
  • పాలిటిక్స్
  • క్రీడలు
  • OTT మూవీస్
  • వైరల్
  • ప్రపంచం
  • టెక్నాలజీ
  • జాతీయం
  • ఫోటోలు
  • బిజినెస్
  • ఉద్యోగాలు
  • మిస్టరీ
  • మీకు తెలుసా
  • ఆధ్యాత్మికత
  • ఆరోగ్యం
  • ట్రావెల్
  • ఫ్యాషన్
  • జీవన శైలి
  • అడ్వర్టోరియల్
  • వీడియోలు
  • Home » sports » West Indies 418 Chase Against Australia

ఆ రోజు వెస్టిండీస్ దెబ్బకి ఆస్ట్రేలియా వణికిపోయింది! స్టీవా ఏడ్చేశాడు!

  • Written By: Sayyad Nag Pasha
  • Updated On - Tue - 20 December 22
  • facebook
  • twitter
  • |
      Follow Us
    • Suman TV Google News
ఆ రోజు వెస్టిండీస్ దెబ్బకి ఆస్ట్రేలియా వణికిపోయింది! స్టీవా ఏడ్చేశాడు!

వరుసగా రెండు వరల్డ్‌ కప్పులు గెలిచి 2003 ఏప్రిల్‌లో వెస్టిండీస్‌ గడ్డపై అడుగుపెట్టింది ఆస్ట్రేలియా. గతమెంతో ఘనమైన విండీస్‌.. బ్రియన్‌ లారా, చంద్రపాల్‌ లాంటి దిగ్గజాలతో బలంగానే ఉంది. కానీ.. క్రికెట్‌ ప్రపంచాన్ని శాసిస్తున్న ఆస్ట్రేలియాతో తలపడాలంటే అంత ఆషామాషీ విషయం కాదు. ఆటతోనే కాదు మాటతో కూడా ప్రత్యర్థిని కుప్పకూల్చే నైజం ఆస్ట్రేలియాది. ఇక టెస్టు క్రికెట్‌లో అయితే.. ఆస్ట్రేలియన్ల స్లెడ్జింగ్‌కు భయపడే.. చాలా జట్లు మానసికంగా చచ్చిపోయేవి. ఆటలోనూ ఆస్ట్రేలియాన్లు ప్రపంచ ఛాంపియన్లు. వరుసగా రెండు వరల్డ్‌ కప్పులు గెలిచిన వెస్టిండీస్‌ రికార్డును సమం చేసి మరీ.. కరేబియన్ల గడ్డపై అడుగుపెట్టింది ఆసీస్‌. స్టీవా, జస్టిన్‌ లంగర్‌, మ్యాథ్యూ హేడెన్‌, ఆడమ్‌ గిల్‌క్రిస్ట్‌, రికీ పాంటింగ్‌, బ్రెట్‌ లీ, గిల్లెస్పీ, మెక్‌గ్రాత్‌ ఇలా అందరూ మ్యాచ్‌ విన్నర్లే.

పేరుకు తగ్గట్లే ఆస్ట్రేలియా తొలి మూడు టెస్టుల్లోనూ వెస్టిండీస్‌ను ఓడించి.. 4 టెస్టుల సిరీస్‌ను 3-0తో మరో టెస్టు మిగిలి ఉండగానే కైవసం చేసుకుంది. దీంతో అప్పటికే ప్రపంచ ఛాంపియన్లమనే గర్వంతో ఉన్న కంగారులకు ఆ గర్వం మరింత ఎక్కువైంది. చివరి టెస్టులోనూ వెస్టిండీస్‌ను చిత్తు చేయాలని భావించారు. కానీ.. మూడు టెస్టులు ఓడిన బాధను దూరం చేసుకుంటూ.. సిరీస్‌ గెలిచిన ఆస్ట్రేలియా అహంకారాన్ని దించుతూ.. వెస్టిండీస్‌ చరిత్ర సృష్టించింది. 2003 వరల్డ్‌ కప్‌ గెలిచిన నెల రోజులకే ఆస్ట్రేలియా పరువు పోయింది. కరేబియన్ల చేతిలో కంగారులకు తగిన శాస్త్రి జరిగిందంటూ ప్రపంచం మొత్తం మాట్లాడుకుంది. మరీ ఆస్ట్రేలియా లాంటి వరల్డ్‌ ఛాంపియన్‌ టీమ్‌కు ఇద్దరు కరేబియన్‌ వీరులు ఎలా గుణపాఠం చెప్పారో ఇప్పుడు తెలుసుకుందాం..

2003 మే 9.. వెస్టిండీస్‌-ఆస్ట్రేలియా మధ్య సెయింట్‌ జాన్స్‌ క్రికెట్‌ స్టేడియంలో నాలుగో టెస్టు ప్రారంభమైంది. తొలుత బ్యాటింగ్‌ చేసిన ఆస్ట్రేలియాను వెస్టిండీస్‌ బౌలర్‌ జెర్మైన్ లాసన్ అనూహ్యంగా 7 వికెట్లతో చెలరేగి 240 పరుగులకే ఆలౌట్‌ చేశాడు. మెక్‌గ్రాత్‌, గిల్లెస్పీ, బ్రెట్‌ లీతో కూడిన భీకరమైన పేస్‌ ఎటాక్‌ ఉన్న ఆస్ట్రేలియా సైతం విండీస్‌ను తొలి ఇన్నింగ్స్‌లో 240 పరుగులకే ఆలౌట్‌ చేసింది. అయితే.. తొలి ఇన్నింగ్స్‌లో విఫలమైన ఆస్ట్రేలియా.. రెండో ఇన్నింగ్స్‌లో మాత్రం సత్తా చాటింది. ఆసీస్‌ ఓపెనర్లు జస్టిన్‌ లంగర్‌(111), మ్యాథ్యూ హేడెన్‌(177) సెంచరీలతో చెలరేగడంతో ఆస్ట్రేలియా 417 పరుగుల భారీ స్కోర్‌ చేసింది. దీంతో.. వెస్టిండీస్‌ ముందు 418 పరుగుల భారీ టార్గెట్‌ వచ్చిపడింది.

ఆస్ట్రేలియా బౌలింగ్‌ ఎటాక్‌ను చూసినా, ఈ సిరీస్‌లో విండీస్‌ బ్యాటింగ్‌ లైనప్‌ ప్రదర్శన చూసినా.. ఈ మ్యాచ్‌లో ఆస్ట్రేలియా విజయాన్ని అడ్డుకోవడం అసాధ్యం. పైగా 418 పరుగులను ఛేజ్‌ చేసి గెలిచిన దాఖలాలు క్రికెట్‌ చరిత్రలోనే లేదు. వెస్టిండీస్‌ ఛేజ్‌ చేస్తుందన్న నమ్మకం కూడా ఎవరీ లేదు. అనుకున్నట్లే 74 పరుగులకే వెస్టిండీస్‌ 3 వికెట్లు కోల్పోయి.. ఓటమికి ప్రిపేర్‌ అవుతున్నట్లు కనిపించింది. కానీ.. ఆ ఇద్దరు మాత్రం.. అందుకు సిద్ధంగా లేరు. ఆ ఇద్దరే రామ్‌నరేష్‌ శర్వాణ్‌, శివనారాయణ్‌ చంద్రపాల్‌.. ఆసీస్‌ను ఓడించేందుకు కంకణం కట్టుకుని మరీ బ్యాటింగ్‌కు దిగినట్టు ఆడారు. బలమైన, దుర్భేద్యమైన ఆస్ట్రేలియా బౌలింగ్‌ ఎటాన్‌ను చీల్చి చెండాడుతూ.. ఫోర్ల వర్షం కురిపిస్తూ.. టెస్టును వన్డే స్టైల్లో ఆడుతూ.. రెచ్చిపోయారు.

బౌలింగ్‌ వేసేది బ్రెట్‌లీ అయినా.. మెక్‌గ్రాత్‌ అయినా.. ఒకటే ట్రీట్‌మెంట్‌.. కొట్టుడే. అసలేం జరుగుతుందో ఆస్ట్రేలియన్లకు అర్థం కావడంలేదు. అప్పటి వరకు ఏదో చావింటికి వచ్చినట్లు మౌనంగా కూర్చున్న వెస్టిండీస్‌ అభిమానులు పూనకంతో ఊగిపోయారు. కరేబియన్‌ కెప్టెన్‌ బ్రియన్‌ లారా 5 ఫోర్లు, 3 సిక్సులతో 60 రన్స్‌ బాది.. కొద్ది సేపు విండీస్‌ ఫ్యాన్స్‌కు వినోదం పంచినా.. వారికి అసలైన జాతరను అందించింది మాత్రం.. శర్వాణ్‌-చంద్రపాల్‌ జోడీనే. ప్రపంచంలోనే అత్యంత భీకరమైన బౌలింగ్‌ ఎటాక్‌ కలిగిన ఆస్ట్రేలియాను పిచ్చి కొట్టుడు కొడుతూ.. ఇద్దరూ సెంచరీలతో విరుచుకుపడ్డారు. వీరిద్దరినీ అవుట్‌ చేయలేక.. చివరికి తమకు వెన్నెతో పెట్టిన విద్య.. స్లెడ్జింగ్‌కు కూడా పాల్పడింది ఆస్ట్రేలియా. వెస్టిండీస్‌ విజయానికి 181 పరుగులు అవసరమైన దశలో మెక్‌గ్రాత్‌ స్లెడ్జింగ్‌కు దిగాడు.

World record run chase by sravan and chandrapaul highlights

రామ్‌నరేష్‌ శర్వాణ్‌పై బూతులతో విరుచుకుపడ్డాడు. ‘బ్రియన్‌ లారా మర్మాంగం రుచిగా ఉంటుందా?’ అని శర్వాణ్‌ను అడిగాడు మెక్‌గ్రాత్‌.. దానికి ‘అది నాకు తెలియదు.. వెళ్లి నీ భార్యను అడుగు’ అంటూ శర్వాణ్‌ సైతం పచ్చిగానే బదులిచ్చాడు. కానీ.. ఆ టైమ్‌లో మెక్‌గ్రాత్‌ భార్య క్యాన్సర్‌తో బాధపడుతుండటంతో మెక్‌గ్రాత్‌ చాలా సీరియస్‌గా తీసుకుని.. శర్వాణ్‌కు గట్టిగా వార్నింగ్‌ ఇచ్చాడు. అంపైర్‌ కలగజేసుకుని.. మెక్‌గ్రాత్‌ను అక్కడి నుంచి పంపించాడు. అయితే.. మెక్‌గ్రాత్‌ భార్య క్యాన్సర్‌తో బాధపడుతున్న విషయం శర్వాణ్‌కు తెలియదు. కాగా.. ఆ వెంటనే డ్రింక్స్‌ బ్రేక్‌లో ఇద్దరూ ఒకరికొకరు క్షమాపణలు సైతం చెప్పుకున్నారు. కానీ.. మొదట స్లెడ్జింగ్‌కు దిగిన మెక్‌గ్రాత్‌ ఈ విషయంలో ఎక్కువగా విమర్శలు ఎదుర్కొన్నాడు. ఈ గొడవ అంతటితో ముగియగా.. ఆసీస్‌ పరువు పోయేందుకు సమయం ఆసన్నమైంది.

418 పరుగుల వరల్డ్‌ రికార్డును ఛేదించేందుకు.. శర్వాణ్‌, చంద్రపాల్‌ ప్రాణం పెట్టి ఆడారు. పేరుకు టెస్ట్‌ మ్యాచ్‌ అయినా.. వారిద్దరూ ఆసీస్‌ బౌలర్లపై విరుచుకుపడ్డారు. ఇప్పుడు చెప్పుకుంటున్న అగ్రెసివ్‌ గేమ్‌ను వారిద్దరూ ఆ మ్యాచ్‌లోనే ఆడి చూపించారు. జిడ్డు బ్యాటింగ్‌కు మారుపేరుగా నిలిచిన చంద్రపాల్‌ సైతం ఆస్ట్రేలియాపై ఎటాకింగ్‌ బ్యాటింగ్‌తో చెలరేగాడు. టెస్టుల్లో చంద్రపాల్‌ సిక్స్‌ కొట్టడం చాలా అరుదు.. కానీ ఆస్ట్రేలియా బౌలింగ్‌లో చంద్రపాల్‌ భారీ సిక్స్ ఇప్పటికీ క్రికెట్‌ అభిమానులకు స్పెషలే. ఇక శర్వాణ్‌ 139 బంతుల్లో 17 ఫోర్లతో 105 పరుగులు, చంద్రపాల్‌ 154 బంతుల్లో 17 ఫోర్లు, ఒక సిక్స్‌తో 104 పరుగులు చేసి.. వెస్టిండీస్‌ను కొత్త చరిత్ర వైపు నడిపించారు.

వీరిద్దరు చెలరేగి ఆడుతుంటే.. బౌలర్లను మార్చిమార్చి.. ఆస్ట్రేలియా కెప్టెన్‌ స్టీవా ముఖంపై చుక్కనీరు లేదు.. ఏడుపొక్కటే తక్కువ. అయితే.. వెస్టిండీస్‌ విజయానికి ముంగిట బ్రెట్‌ లీ.. శర్వాణ్‌, చంద్రపాల్‌లను అవుట్‌ చేసి.. ఆసీస్‌లో ఆశలు రేపినా.. మిగితా లాంఛనాన్ని ఒమారీ బ్యాంక్స్(47), వాస్బర్ట్ డ్రేక్స్(27) పూర్తి చేసి.. వరల్డ్‌ రికార్డును బద్దలు కొట్టారు. ప్రపంచ ఛాంపియన్లమనే ఆస్ట్రేలియా తలబిరుసును దించుతూ.. టెస్టు క్రికెట్‌ చరిత్రలో 418 పరుగుల టార్గెట్‌ ఛేదించి గెలిచిన తొలి జట్టుగా వెస్టిండీస్‌ చరిత్ర సృష్టించింది. కరేబియన్లు సాధించిన ఘనతల కిరీటంలో ఈ విజయం ఒక కలికితురాయిగా నిలిచిపోయింది. ఆస్ట్రేలియా ప్రపంచ క్రికెట్‌ను శాసిస్తున్న టైమ్‌లో వారి గర్వాన్ని అణిచిన రామ్‌నరేష్‌ శర్వాణ్‌, శివనారాయణ్‌ చంద్రపాల్‌ ఇన్నింగ్స్‌లపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.

Tags :

  • AUS VS WI
  • Cricket News
  • Ramnaresh Sarwan
  • Shivnarine Chanderpaul
  • SumanTV Cricket Special
Read Today's Latest sportsNewsTelugu News LIVE Updates on SumanTV

Follow Us

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube
  • SumanTV Dialy Hunt
ఈరోజు ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ న్యూస్.. జాతీయ, అంతర్జాతీయ వార్తలు.. ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, స్పోర్ట్స్, టెక్ అప్డేట్స్.. ఆధ్యాత్మిక, ఆరోగ్య సమాచారంతో పాటు, వైరల్ కథనాల కోసం సుమన్ టీవీ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.

Related News

Babar Azam: వన్డేల్లో బాబర్ అజామ్ సరికొత్త చరిత్ర! కోహ్లీని వెనక్కి నెట్టి టాప్ లోకి

Babar Azam: వన్డేల్లో బాబర్ అజామ్ సరికొత్త చరిత్ర! కోహ్లీని వెనక్కి నెట్టి టాప్ లోకి

  • ICC World Cup 2023: ఆ కార్డు ఉన్నవారికి గుడ్ న్యూస్.. వరల్డ్ కప్ టికెట్లు త్వరగా బుక్ చేసుకునే అవకాశం

    ICC World Cup 2023: ఆ కార్డు ఉన్నవారికి గుడ్ న్యూస్.. వరల్డ్ కప్ టికెట్లు త్వరగా బుక్ చేసుకునే అవకాశం

  • Chandrayaan-3: చంద్రయాన్-3 సక్సెస్ తో భారత ఆటగాళ్ల సంబరాలు! వీడియో వైరల్

    Chandrayaan-3: చంద్రయాన్-3 సక్సెస్ తో భారత ఆటగాళ్ల సంబరాలు! వీడియో వైరల్

  • India–Pakistan: టీమిండియా కంటే పాకిస్థాన్ జట్టే బలంగా ఉందా..? ఎంతవరకు నిజం

    India–Pakistan: టీమిండియా కంటే పాకిస్థాన్ జట్టే బలంగా ఉందా..? ఎంతవరకు నిజం

  • AFG vs PAK: నిప్పులు చెరిగిన పాకిస్థాన్ పేసర్లు! టీమిండియా బ్యాటర్లు తట్టుకోగలరా..?

    AFG vs PAK: నిప్పులు చెరిగిన పాకిస్థాన్ పేసర్లు! టీమిండియా బ్యాటర్లు తట్టుకోగలరా..?

Web Stories

మరిన్ని...

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా
vs-icon

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా
vs-icon

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా

విలువైన సంపద మొత్తం తనలోనే  దాచుకున్న రీతూ వర్మ
vs-icon

విలువైన సంపద మొత్తం తనలోనే దాచుకున్న రీతూ వర్మ

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్
vs-icon

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి
vs-icon

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్
vs-icon

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్
vs-icon

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి
vs-icon

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి

తాజా వార్తలు

  • మహిళా కస్టమర్‌ను కొట్టిన రాపిడో డ్రైవర్…వీడియో వైరల్‌

  • చం*పి పారేస్తా.. పెట్రోల్ పంప్ ఉద్యోగి ఛాతీపై రివాల్వర్ గురిపెట్టిన యువతి

  • సరస్వతి కటాక్షించినా.. లక్ష్మీ దేవి వరించలేదీ విద్యార్థిని

  • ఇండస్ట్రీలో విషాదం.. క్యాన్సర్‌తో ప్రముఖ నటుడు కన్నుమూత!

  • ఆ పాన్ ఇండియా మూవీ మిస్ చేసుకున్న రామ్ చరణ్.. కారణం ఏంటంటే?

  • వ్యసనాలకు బానిసైన వైద్యుడు.. అదనపు కట్నం కోసం భార్యకు వేధింపులు.. ఆ తర్వాత?

  • Babar Azam: వన్డేల్లో బాబర్ అజామ్ సరికొత్త చరిత్ర! కోహ్లీని వెనక్కి నెట్టి టాప్ లోకి

Most viewed

  • ఇల్లు అమ్మేస్తున్న జబర్ధస్త్ శాంతిస్వరూప్.. కారణం తెలిస్తే కన్నీరు పెడతారు!

  • వాహనాలపై ఈ స్టిక్కర్ ఉంటే.. చలానా కట్టాల్సిందే..

  • పెళ్లి చేయలేదని అక్కసుతో తల్లినే ఘోరంగా హతమార్చిన తనయుడు

  • తిలక్ వర్మను వరల్డ్ కప్ లో ఆడించకండి! భారత మాజీ క్రికెటర్ కామెంట్

  • జాతీయ ఉత్తమ నటుడు అల్లు అర్జున్.. వెండితెరపై అసాధారణ ప్రయాణం..!

  • కరెంట్ షాక్‌తో పాఠశాల విద్యార్థి మృతి

  • యంగ్ హీరో శర్వానంద్ కి సర్జరీ.. ఆందోళనలో అభిమానులు!

Suman TV Telugu

Download Our Apps

Follow Us On :

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube

    Trending

    IPL 2023Telugu Movie ReviewsAP News in TeluguPolitical News in TeluguTelugu NewsMovie News in TeluguTelugu Cricket NewsCrime News in TeluguOTT Movie ReleasesTelugu Tech News

    News

  • International
  • National
  • Andhra Pradesh
  • Telangana
  • Crime
  • Viral
  • Politics

    Entertainment

  • Movies
  • OTT Movies
  • Reviews
  • Web Stories
  • Videos

    Life Style

  • Health
  • Travel
  • Fashion

    More

  • Technology
  • Business
  • Jobs
  • Mystery

    SumanTV

  • About Us
  • Privacy Policy
  • Contact Us
  • Disclaimer
© Copyright SumanTV 2021 All rights reserved.
powered by veegam