తొలి టీ20లో ఓడినా రెండో మ్యాచులో గెలిచి సిరీస్ సమం చేస్తారనుకున్న భారత అభిమానులకు టీమిండియా ఆటగాళ్లు నిరాశే మిగిల్చారు. బ్యాటింగ్ లో చేతులెత్తేసిన భారత ఆటగాళ్లు.. బౌలింగ్ లో కూడా విఫలమయ్యారు. పంత్ సేన నిర్దేశించిన 149 పరుగుల లక్ష్యాన్ని దక్షిణాఫ్రికా.. మరో 10 బంతులు మిగిలుండగానే ఛేదించింది. ప్రొటీస్ బ్యాటర్ హైన్రిచ్ క్లాసెన్.. భారత బౌలర్లను ఓ ఆట ఆడుకున్నాడు. దొరికిన బంతిని దొరికినట్టుగా స్టాండ్స్ లోకి పంపాడు. ఇక.. ఈ మ్యాచులో టీమిండియా అల్ రౌండర్ హార్దిక్ పాండ్యాను సఫారీ బౌలర్ అవమానపరిచాడు. క్లీన్ బౌల్డ్ అయ్యావ్ గా అన్నట్లుగా.. వికృత చర్యకు పాల్పడ్డాడు.
బౌలింగ్, బ్యాటింగ్, ఫీల్డింగ్.. ఇలా అన్నీ విభాగాల్లోనూ భారత జట్టు దారుణంగా విఫలమైంది. గత మ్యాచ్‌లో భారీ స్కోరును కాపాడుకోలేకపోయిన భారత్.. ఈసారి దక్షిణాఫ్రికా బౌలర్ల ధాటికి తక్కువ స్కోరుకే పరిమితమైంది. టాస్ ఓడి బ్యాటింగ్ దిగిన టీమిండియా ఆరంభంలోనే రుతురాజ్ వికెట్ కోల్పోయింది. ఆ తర్వాత ఇషాన్ కిషన్ కొన్ని మెరుపులు మెరిపించినప్పటికి పెద్ద స్కోరు చేయడంలో విఫలమయ్యాడు. శ్రేయాస్ 40 పరుగులతో రాణించినప్పటికి అతనికి అండగా నిలబడేవాళ్లు కరువయ్యారు. కెప్టెన్ పంత్ ఎక్కువసేపు నిలువలేకపోగా.. పార్నెల్ వేసిన చక్కటి బంతికి హార్దిక్ పాండ్యా క్లీన్ బౌల్ట్ అయ్యాడు. ఈ నేపథ్యంలో పార్నెల్ వింత సెలబ్రేషన్‌తో మెరిశాడు. రెండు చేతుల జోడించి హార్ట్ సింబల్ చూపించాడు.. ”పాండ్యా నువ్వంటే నాకు ఇంత ఇష్టం” అన్నట్లుగా సంజ్ఞలు చేశాడు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
@WayneParnell sends @hardikpandya7 Pandya’s leg-stump for a walk in the park🔥#BCCI #hardikpandya #WayneParnell #CleanBowled #castled #INDvsSA #indvssa2022 #INDvsRSA #IndVsSAT20 #Cuttack #ESPNcricinfo #cricbuzz pic.twitter.com/t33z2WHjCj
— Karthikeyan Balamani (@BalamaniKarthik) June 12, 2022
ఇది కూడా చదవండి: Hardik Pandya: ఎన్ని త్యాగాలు చేశానో ఎవరికీ తెలీదు.. పెద్ద యుద్ధమే చేశా: హార్దిక్ పాండ్యా
ఈ విజయంతో దక్షిణాఫ్రికా సిరీస్ లో 2-0 ఆధిక్యంలో నిలిచింది. మూడో టీ20 జూన్ 14న విశాఖపట్నంలో జరుగనుంది. ఈ విషయంపై మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
స్కోర్ కార్డు:
భారత్: 20 ఓవర్లలో 148/6
దక్షిణాఫ్రికా: 18.2 ఓవర్లలో 149/6
🚨 RESULT | #Proteas WIN BY 4 WICKETS
A career-best 81 off 46 balls by Heinrich Klaasen propelled the team to victory in the second T20I as they chased down the 149-run target with 10 balls to spare #INDvSA #BePartOfIt pic.twitter.com/rB7XfTPrGi
— Cricket South Africa (@OfficialCSA) June 12, 2022