ప్రస్తుతం కరోనా థర్డ్ వేవ్ ప్రపంచాన్ని వణికిస్తుంది. ఇప్పటికే ప్రపంచ వ్యాప్తంగా చాలా మంది క్రికెటర్లు కరోనా బారిన పడ్డారు. తాజా టీమిండియా స్టార్ ఆటగాడు వాషింగ్టన్ సుందర్‌కు కరోనా సోకినట్లు సమాచారం. కాగా సుందర్ ఈ నెల 19 నుంచి సౌత్ ఆఫ్రికాతో జరిగే మూడు వన్డేల సిరీస్‌లో పాల్గొనాల్సి ఉంది. కాగా ప్రస్తుతం అతనికి కరోనా సోకడంతో అతను వన్డే సిరీస్‌లో పాల్గొనేది అనుమానమే. ప్రస్తుతం జరుగుతున్న చివరి టెస్ట్ ముగిసిన తర్వాత.. వన్డే సిరీస్ మొదలవనుంది. సుందర్‌ను వన్డే సిరీస్ కోసం బీసీసీఐ ఎంపిక చేసిన విషయం తెలిసిందే. మరి సుందర్‌కు కరోనా సోకడంపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.