సన్ రైజర్స్ ఆల్ రౌండర్ వాషింగ్టన్ సుందర్.. తెలుగు యాంకర్ తో చెట్టాపట్టాలేసుకుని తిరిగాడట. ఇప్పుడు ఈ విషయమే టాలీవుడ్ తో పాటు క్రికెట్ వర్గాల్లో చాలా చర్చనీయాంశమైంది. ఇంతకీ సుందర్ లైఫ్ లో ఏం జరుగుతోంది?
సన్ రైజర్స్ హైదరాబాద్.. ఈ పేరు చెబితే అభిమానులు కాలర్ ఎగరేసుకునేవారు. వార్నర్ మావ, విలియమ్సన్ బాబాయ్ అంటూ విదేశీ క్రికెటర్లని కూడా సొంత ప్లేయర్ల కంటే ఎక్కువగా అభిమానించారు. కానీ పరిస్థితులు మారిపోయాయి. ఇప్పుడు టీమ్ లో చెప్పుకోదగ్గ ప్లేయర్స్ లిస్ట్ తీస్తే అందులో వాషింగ్టన్ సుందర్ కచ్చితంగా ఉంటాడు. మనోడు ఈసారి ఐపీఎల్ సీజన్ మధ్యలోనే గాయం కారణంగా తప్పుకున్నాడు. అయితే అసలు మేటర్ అది కాదని వేరే ఉందని ఇప్పుడు సరికొత్త న్యూస్ బయటపడింది. అది తెలిసి అందరూ షాకవుతున్నారు. ఇంతకీ ఏంటి సంగతి? ఏం జరిగింది?
ఇక వివరాల్లోకి వెళ్తే… టీమిండియా అండర్-19 టీమ్ కి ఆడి వెలుగులోకి వచ్చిన క్రికెటర్ వాషింగ్టన్ సుందర్. తమిళనాడుకు చెందిన ఈ కుర్రాడు 2017లో ఐపీఎల్ లో అరంగేట్రం చేశాడు. తొలుత ఆర్సీబీ తరఫున ఆల్ రౌండర్ గా కాస్తోకూస్తే పేరు తెచ్చుకున్నాడు. ఆ తర్వాత టీమిండియా జాతీయ జట్టులోకి ఎంట్రీ ఇచ్చాడు. కానీ పెద్దగా క్లిక్ కాలేదు. ప్రస్తుతం సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టుకి ఆడుతున్నాడు. ఈ సీజన్ లో అతడు జట్టుకు ప్లస్ అవుతాడని మేనేజ్ మెంట్ తోపాటు ఫ్యాన్స్ అనుకున్నారు. కానీ మనోడు మాత్రం ఆటని పక్కనబెట్టి ఓ తెలుగు యాంకర్ తో తిరుగళ్లకు అలవాటు పడిపోయాడట.
ఆమె ఓ నటి. కెరీర్ స్టార్టింగ్ లో పలు సినిమాల్లో హీరోయిన్ గా చేసింది. ఆ తర్వాత యాంకర్ గా ఫేమ్ తెచ్చుకుంది. ప్రస్తుతం పెద్దగా షోలు ఏం చేయట్లేదు కానీ అడపాదడపా సినిమాల్లో సహాయపాత్రలు చేస్తూ బిజీగా ఉంది. ఈ సీజన్ లో సన్ రైజర్స్ ఓవైపు మ్యాచ్ లు ఆడుతుంటే.. మరోవైపు ఈమె జట్టుకు ఛీర్స్ చెబుతూ స్టేడియంలో కనిపించింది. అయితే సన్ రైజర్స్ ప్లేయర్ అయిన సుందర్.. జట్టు రూల్స్ బ్రేక్ చేసి మరీ ఓ రోజు ఈమెతో కలిసి ఔటింగ్ కి వెళ్లాడట. ఇది జరిగిన కొన్నిరోజులకు సుందర్ కి గాయపడినట్లు ప్రకటించారు. దీంతో మిగిలిన మ్యాచ్ లకు దూరమయ్యాడు. నిజానికి సుందర్ కి అసలు గాయం కాలేదని, సదరు యాంకర్ తో తిరుగుతున్నాడనే సీరియస్ అయిన మేనేజ్ మెంట్.. ఈ సీజన్ నుంచి తప్పించాలనే కఠిన నిర్ణయం తీసుకుందని అంటున్నారు. ఇందులో నిజనిజాలు ఏంటనేది స్వయంగా వాళ్లు చెబితే గానీ క్లారిటీ రాదు. మరి ఈ విషయమై మీరేం అనుకుంటున్నారు? కింద కామెంట్ చేయండి.