హైదరాబాద్ జట్టుకి బిగ్ షాక్. అసలే కష్టాల్లో ఉన్న సన్ రైజర్స్ కి ఇప్పుడు మరొక కొత్త సమస్య వచ్చి చేరింది. ఆ జట్టు బౌలింగ్ అల్ రౌండర్ టోర్నీ మొత్తానికి దూరం అయ్యాడు.
ఐపీఎల్ లో ప్రస్తుతం సన్ రైజర్స్ పరిస్థితి చాలా దారుణంగా ఉంది. జట్టు చూడడానికి బాగానే ఉన్నా ఏ ఒకరు కూడా ఆశించిన ప్రదర్శన చేయలేకపోతున్నారు. ఇప్పటివరకు 7 మ్యాచులు ఆడిన హైదరాబాద్ టీమ్ కేవలం 2 మ్యాచులోనే విజయం సాధించింది. వరుసగా రెండు ఓటములతో టోర్నీ ఆరంభించినా.. ఆ తర్వాత రెండు విజయాలతో మంచి కం బ్యాక్ ఇచ్చింది. ఇక గాడిలో పడింది అనుకున్న దశలో వరుసగా 3 మ్యాచులు ఓడిపోయి ప్లే ఆఫ్ ఆశలు సంక్లిష్టం చేసుకుంది. అసలే కష్టాల్లో ఉన్న సన్ రైజర్స్ కి ఇప్పుడు మరొక కొత్త సమస్య వచ్చి చేరింది. ఆ జట్టు బౌలింగ్ అల్ రౌండర్ టోర్నీ మొత్తానికి దూరం అయ్యాడు.
హైదరాబాద్ జట్టుకి బిగ్ షాక్. ఆల్ రౌండర్ వాషింగ్ టన్ సుందర్ ఇక ఐపీఎల్ కి అందుబాటులో ఉండడం లేదు. గాయం కారణంగా టోర్నీ నుంచి వైదొలిగాడు. మోకాలి కింద భాగంలో ఈ అల్ రౌండర్ కి గాయం అయినట్లు తెలుస్తుంది. దీని ప్రకరాం సుందర్ కి చాలా కాలం పాటు విశ్రాంతి కావాలని డాక్టర్లు భావించడంతో టోర్నీ మొత్తానికి దూరం కావాల్సి వచ్చింది. దీంతో ఇప్పుడు మార్కరం సేన సుందర్ లేని లోటు ఎలా తీరుస్తుందో చూడాలి. గత మ్యాచులో ఢిల్లీపై సుందర్ 3 వికెట్లు తీసి సత్తా చాటాడు. బ్యాటింగ్ లో కూడా చివర్లో రాణించి ఆకట్టుకున్నాడు. ప్లే ఆఫ్ కి వెళ్లాలంటే మిగిలిన మ్యాచులు చాలా కీలకం కానున్నాయి. ఈ నేపథ్యంలో సుందర్ గాయం సన్ రైజర్స్ కి పెద్ద లోటనే చెప్పాలి. ఈ అల్ రౌండర్ త్వరగా కోలుకోవాలని ఆశిద్దాం. ఈ విషయంలో మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలపండి.