శుక్రవారం రాత్రి చెన్నైతో జరిగిన మ్యాచ్ లో 7 వికెట్ల తేడాతో ఓడిపోయింది హైదరాబాద్ జట్టు. ఇక ఈ మ్యాచ్ లో ధోని నుంచి తప్పించుకోవడం కష్టం అని మరోసారి రుజువైంది. ఇందుకు సంబంధించిన వీడియోలు ఇప్పుడు వైరల్ గా మారాయి.
ఐపీఎల్ 2023 సీజన్ క్రికెట్ లవర్స్ ను ఉర్రూతలూగిస్తూ.. ముందుకు దూసుకెళ్తోంది. అయితే కొన్ని జట్ల తలరాతలు మాత్రం మారడం లేదు. అందులో సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు ఒకటి. ఈ సీజన్ లో ఘోరంగా విఫలం అవుతున్న టీమ్స్ లో హైదరాబాద్ టీమ్ ముందువరుసలో ఉన్నది. జట్టులో అద్భుతమైన ఆటగాళ్లు ఉన్నప్పటికీ విజయాలు మాత్రం రావడం లేదు. తాజాగా శుక్రవారం రాత్రి చెన్నైతో జరిగిన మ్యాచ్ లో 7 వికెట్ల తేడాతో ఓడిపోయింది హైదరాబాద్ జట్టు. ఎప్పటిలాగే చెన్నై టీమ్ ఆల్ రౌండ్ ప్రదర్శనతో అదగొట్టింది. ఇక ఈ మ్యాచ్ లో ధోని నుంచి తప్పించుకోవడం కష్టం అని మరోసారి రుజువైంది. ఇందుకు సంబంధించిన వీడియోలు ఇప్పుడు వైరల్ గా మారాయి.
ఐపీఎల్ 2023 సీజన్ లో భాగంగా శుక్రవారం రాత్రి చెన్నై-హైదరాబాద్ జట్ల మధ్య మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్ లో చెన్నై టీమ్ 7 వికెట్ల తేడాతో విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన SRH నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్లు నష్టపోయి 134 పరుగులు మాత్రమే చేసింది. చెన్నై బౌలర్లు అద్భుతంగా రాణించారు. ముఖ్యంగా స్టార్ ఆల్ రౌండర్ జడేజా 3 వికెట్లతో మెరిశాడు. SRH టీమ్ లో అభిషేక్ శర్మ ఒక్కడే 34 పరుగులతో టాప్ స్కోరర్ గా నిలిచాడు. అనంతరం స్వల్ప లక్ష్యంతో బరిలోకి దిగిన చెన్నై జట్టు 18.4 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది. జట్టులో కాన్వే 77 పరుగులతో అజేయంగా నిలిచి టీమ్ కు విజయాన్ని అందించాడు.
ఇక ఈ మ్యాచ్ లో రెండు ఆసక్తికర విషయాలు జరిగాయి. ఈ రెండు విషయాల్లో హీరో ధోని అనే చెప్పాలి. ఈ మ్యాచ్ లో ధోని తనలో సత్తా ఇంకా తగ్గలేదని నిరూపించుకున్నాడు. అద్భుతమైన స్టంపింగ్ తో పాటుగా అంతే అద్భుతమైన కీపింగ్ స్కిల్స్ ను మరోసారి ప్రపంచానికి చూపించాడు. జడేజా బౌలింగ్ లో మయాంక్ అగర్వాల్ ను స్టన్నింగ్ స్టంపౌట్ చేశాడు. జడేజా బౌలింగ్ లో ఫ్రెంట్ కు రావడమే పెద్ద తప్పు.. పైగా వికెట్ల వెనక ఉన్నది ధోని.. ఇంకేముంటుంది అగర్వాల్ ముందుకు పోవడమే ఆలస్యం క్షణం కూడా ఆగకుండా ధోని వికెట్లను ఎగరగొట్టేశాడు. ఇక ఇదే మ్యాచ్ లో వాషింగ్టన్ సుందర్ ను అద్భుతమైన త్రోతో పెవిలియన్ కు పంపాడు ధోని.
హైదరాబాద్ ఇన్నింగ్స్ ఆఖరి ఓవర్ చివరి బంతిని మార్కో జాన్సెన్ మిస్ చేశాడు. దాంతో నాన్ స్ట్రైకర్ ఎండ్ లో ఉన్న సుందర్ లేని పరుగు కోసం ప్రయత్నించాడు. ఇక అప్పటికే గ్లౌవ్ తీసి రడీగా ఉన్నాడు ధోని. సుందర్ వచ్చే లోపే బాల్ ను డైరెక్ట్ గా వికెట్లకు త్రో చేశాడు. ఇక ఈ రెండు అవుట్ లను చూసిన ప్రేక్షకులు ధోని నుంచి తప్పించుకోవడం కష్టం. మీ ఇద్దరికి ఆ విషయం తెలీదా అంటూ చురకులు అంటిస్తున్నారు. ధోని వికెట్ల వెనక ఉంటే అడుగు క్రీజ్ బయటపెట్టడం కాదు.. కాస్త కాలు కదిపినా అంతే సంగతులు అన్న విషయం ఈ ప్రపంచానికి మెుత్తం తెలిసిందే. మరి ధోని వెనక ఉంటే తప్పించుకోవడం కష్టం అన్న మాటపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
Speeds in #Chennai today:
Duronto Express ⚡
Jaddu’s sword⚡⚡
Dhoni’s gloves ⚡⚡⚡#CSKvSRH #IPLonJioCinema #TATAIPL #IPL2023 | @msdhoni pic.twitter.com/p7qtuEe9AI— JioCinema (@JioCinema) April 21, 2023
\ | / Dhoni 𝚠̶𝚊̶𝚜̶ is here! 💥#CSKvSRH #TATAIPL #IPLonJioCInema #IPL2023 pic.twitter.com/9r21Ay7PIS
— JioCinema (@JioCinema) April 21, 2023