రాహుల్ ద్రవిడ్.. నైపుణ్యం గల యువ ఆటగాళ్లను వెలికి తీయడంలో దిట్ట. అదీ కాక వాళ్లకు శిక్షణ ఇచ్చి వారిని ఓ వరల్డ్ క్లాస్ క్రీడాకారులుగా ఎలా తయారు చేయాలో అతనికి తెలిసినంతగా మరెవరికీ తెలిదనడంలో అతిశయోక్తి లేదు. ఇక ద్రవిడ్ భారత కోచ్ పగ్గాలు చేపట్టాక టీంమిండియా విజయ పరంపరలు కొనసాగిస్తూనే ఉంది. ఈ క్రమంలోనే ద్రవిడ్ కోవిడ్ బారిన పడిన సంగతి తెలిసిందే. దీంతో త్వరలో ప్రారంభం కానున్న ఆసియా కప్ కు బీసీసీఐ తాత్కాలిక కోచ్ ను నియమించింది. మరిన్ని వివరాల్లోకి వెళితే..
రాహుల్ ద్రవిడ్ కు కరోనా సోకడంతో జింబాబ్వే సిరీస్ కు దూరం అయిన సంగతి మనకు తెలిసిందే. ఇక జింబాబ్వే సిరీస్ కు తాత్కాలిక కోచ్ గా భారత మాజీ దిగ్గజం వీవీఎస్ లక్ష్మణ్ ను కోచ్ గా నియమించారు. లక్ష్మణ్ ప్రస్తుతం జాతీయ క్రికెట్ అకాడమీ (NCA)కి డైరెక్టర్ గా ఉన్నాడు. జింబాబ్వే సిరీస్ దిగ్విజయంగా ముగించిన లక్ష్మణ్ ను ఆసియా కప్ కు హెడ్ కోచ్ గా బీసీసీఐ నియమించింది. దీంతో అతడిని హరారే నుంచి డైరెక్ట్ గా యూఏఈ కి పంపనున్నట్లు బీసీసీఐ వర్గాలు వెల్లడించాయి.
ఇక దానికి సంబంధించి వ్యవహారాలు అన్ని పూర్తి అయినట్లు తెలుస్తోంది. ఇక ద్రవిడ్ కరోనా నుంచి కోలుకోగానే ఆసియా కప్ కు అందుబాటులోకి వస్తాడని బీసీసీఐ భావిస్తోంది. అయితే వీడియో కాన్పరెన్స్ ద్వారా ద్రవిడ్ జట్టుకు అందుబాటులో ఉంటాడని యాజమాన్యం తెలిపింది. మరి వీవీఎస్ లక్ష్మణ్ భారత జట్టును ఎలా నడిపిస్తాడో మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి.
NEWS – VVS Laxman named interim Head Coach for Asia Cup 2022.
More details here 👇👇https://t.co/K4TMnLnbch #AsiaCup #TeamIndia
— BCCI (@BCCI) August 24, 2022