విరాట్ కోహ్లీ అలియాస్ పరుగుల యంత్రం.. కింగ్ కోహ్లీగా కూడా ఎంతో ప్రాచుర్యం పొందాడు. కానీ, రెండేళ్లుగా విరాట్ కోహ్లీ కెరీర్‌లోనే చాలా గడ్డు రోజులను ఎదుర్కొంటున్నాడు. టీమిండియా మాజీలే కోహ్లీకి రెస్ట్ ఇవ్వండి అంటూ సూచిస్తున్నారు. తానే స్వయంగా వెస్టిండీస్ టూర్ నుంచి విశ్రాంతి తీసుకున్నాడు. ఇదంతా నాణేనికి ఒకవైపు మాత్రమే.. తాజాగా విడుదలైన ఓర్ మ్యాక్స్ రిపోర్టుతో కోహ్లీ రేంజ్ మరోసారి రుజువైంది.
కోహ్లీని కొందరు విమర్శిస్తుంటే.. చాలా మంది మద్దతుగా నిలుస్తున్నారు. విదేశీ కెప్టెన్లు సైతం కోహ్లీకి అండగా నిలుస్తున్నారు. అయితే జూన్ 2022కి గాను ఓర్ మ్యాక్స్ విడుదల చేసిన మోస్ట్ పాపులర్ స్పోర్ట్స్ పర్సన్ ఇన్ ఇండియా లిస్ట్ లో విరాట్ కోహ్లీ తొలి స్థానాన్ని దక్కించుకున్నాడు. ఈ లిస్ట్ లో కోహ్లీ స్థానం చూస్తేనే బయట అతని రేంజ్ ఏంటో అందరికీ అర్థమవుతుంది అంటూ కామెంట్ చేస్తున్నారు. మే నెలలోనూ విరాట్ కోహ్లీనే ఆ లిస్ట్ లో టాప్ ప్లేస్ లో ఉన్నాడు.
ఇన్ని విమర్శలు, ఫామ్ లేమితోనూ విరాట్ కోహ్లీ టాప్ ప్లేస్ దక్కించుకోవడం అంత సాధారణమైన విషయం కాదంటూ అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. ఈ విమర్శలు అభిమానుల్లో కోహ్లీ స్థానాన్ని ఏమాత్రం తగ్గించలేవంటూ కామెంట్ చేస్తున్నారు. పరుగులు చేసినా.. చేయకపోయినా కోహ్లీ ఎప్పుడూ కింగే అంటూ అభిమానులు సంబరపడిపోతున్నారు.
Most popular sportspersons in India (May 2022). For the first time since the start of Ormax Sports Stars in Jan 2018, a non-cricketer (@Cristiano) breaks into the top 3. pic.twitter.com/jwZa7mPwKF
— Ormax Media (@OrmaxMedia) June 21, 2022
ఇంక ఈ ఓర్ మ్యాక్స్ లిస్ట్ లో టాప్ 10లో ఎవరు నిలిచారంటే వరుసగా.. విరాట్ కోహ్లీ, ఎంఎస్ ధోనీ, క్రిస్టియానో రొనాల్డో, సచిన్ టెండుల్కర్, రోహిత్ శర్మ, మెస్సీ, పీవీ సింధు, హార్దిక్ పాండ్యా, సానియా మీర్జా, కేఎల్ రాహుల్ నిలిచారు. రిటైర్మెంట్ తర్వాత కూడా ధోనీ, సచిన్ పాపులర్ లిస్ట్ లో కొనసాగుతున్నారు. క్రిస్టియానో రొనాల్డో, మెస్సీలకు కూడా స్థానం దక్కింది. మోస్ట్ పాపులర్ స్పోర్ట్స్ పర్సన్‌గా కోహ్లీ నిలవడంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
Ormax Sports Stars: Most popular sportspersons in India (Apr 2022) pic.twitter.com/jxviD02kzX
— Ormax Media (@OrmaxMedia) May 21, 2022