ఉప్పల్ వేదికగా న్యూజిలాండ్ తో జరిగిన మ్యాచ్ కోసం భారత ఆటగాళ్లు నగరానికి వచ్చిన సంగతి తెలిసిందే. ఈ మ్యాచులో భారత్ 12 పరుగుల తేడాతో విజయం కూడా సాధించింది. ఈ ఆనందంలో ఉన్న అభిమానులకు మాజీ సారధి విరాట్ కోహ్లీ మరో ఆనందాన్ని పంచాడు. మ్యాచ్ ముగిసిన అనంతరం కోహ్లీ హైదరాబాద్ లోని మణికొండలో సందడి చేశాడు. ఈ విషయం తెలుసుకున్న అభిమానులు అక్కడికి పెద్ద ఎత్తున చెరుకున్నారు. దీంతో ఆ ప్రాంతమంతా అభిమానులతో కిక్కిరిసిపోయింది.
కోహ్లీ.. మణికొండలోని పైపులైను రోడ్డులో ఉన్న హాల్‌మార్క్ హబ్‌లోని హైకీ ఫిట్‌నెస్ స్టూడియోకి విచ్చేశారు. సుమారు పది వేల చదరపు అడుగుల విస్తీర్ణంలో.. అత్యాధునికంగా డిజైన్ చేసిన ఈ జిమ్‌లో కోహ్లీ దాదాపు రెండు గంటల పాటు ఉన్నారు. ఓ సంస్థకు సంబంధించిన వ్యాపార ప్రకటనను ఇక్కడే షూట్ చేశారు. అందుకే కోహ్లీ అక్కడకి వచ్చారట. ఈ విషయం తెలుసుకున్న అభిమానులు.. ఆ ప్రాంతానికి భారీగా చేరుకున్నారు. దీంతో ఆ ప్రాంతమంతా జనాలతో కిక్కిరిసిపోయింది. అందుకు సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. కాగా, న్యూజిలాండ్ తో మ్యాచ్‌కు ముందు భారత క్రికెటర్లు శుభ్‌మన్ గిల్, చాహల్, సూర్య, ఇషాన్ కిషన్ తదితరులు సినీనటుడు జూ. ఎన్టీఆర్‌ను కలిసిన సంగతి తెలిసిందే.
Virat Kohli During Brand Shoot at Manikonda, Hyderabad Today.🖤#ViratKohli #ManiKonda @imVkohli pic.twitter.com/S6sPyaVkXl
— virat_kohli_18_club (@KohliSensation) January 19, 2023
Indian cricketers with Jr NTR 🤩🕺🏼#CricketTwitter #india pic.twitter.com/Rxi7QTS22V
— Sportskeeda (@Sportskeeda) January 17, 2023
ఇక కివీస్‌తో జరిగిన తొలి వన్డే విషయానికొస్తే.. తొలుత బ్యాటింగ్ చేసిన భారత్, కివీస్ ముంగిట 350 పరుగుల భారీ లక్ష్యాన్ని నిర్ధేశించగా, అనంతరం భారీ లక్ష్య చేధనకు దిగిన న్యూజిలాండ్ 337 పరుగులకు ఆలౌట్ అయ్యింది. ఈ మ్యాచులో భారత యువ క్రికెటర్ శుభ్‌మన్ గిల్ ద్విశతకంతో మెరిశాడు. 143 బంతుల్లో 19 ఫోర్లు, 9 సిక్స్‌లతో 208 పరుగులు సాధించాడు. ఇక ఈ మ్యాచ్‌లో కోహ్లి 8 పరుగులు మాత్రమే చేశాడు. ఇక ఇరు జట్ల మధ్య రెండో వన్డే రాయ్‌పూర్ వేదికగా జనవరి 21న జరగనుంది.
2️⃣0️⃣8️⃣ runs
1️⃣4️⃣9️⃣ balls
9️⃣ sixes 🔥A monumental double-century from @ShubmanGill makes him the Player of the Match as #TeamIndia register a 12-run victory in the first #INDvNZ ODI 👏
Scorecard ▶️ https://t.co/DXx5mqRguU @mastercardindia pic.twitter.com/HSCROoJfPi
— BCCI (@BCCI) January 18, 2023