70 సెంచరీలను అలవోకగా బాదేసిన విరాట్ కోహ్లీ.. సెంచరీ చేయక వెయ్యి రోజుల పైనే అయింది. ఈ ఒక్క విషయంతో కోహ్లీ ఫామ్‌లేమితో ఎంతలా సతమతమవుతున్నాడో అర్థం చేసుకోవచ్చు. ఇదే విషయంలో కోహ్లీపై విమర్శలు కూడా తీవ్రస్థాయిలో వస్తున్నాయి. వీటికి కొంత పుల్‌స్టాప్ పెట్టి మానసిక ప్రశాంతత కోసం కొంత గ్యాప్ తీసుకున్న కోహ్లీ.. తాజాగా ఆసియా కప్‌తో తిరిగి బరిలో దిగనున్నాడు. ఈ నేపథ్యంలో తనపై వచ్చిన విమర్శలకు కోహ్లీ గట్టి జవాబిచ్చాడు.
తాను ఈ స్థాయికి వచ్చానంటే ఇలాంటి గడ్డు పరిస్థితులు ఎన్ని చూసి ఉంటానని కోహ్లీ పేర్కొన్నాడు. ఇంగ్లండ్ టూర్ తర్వాత వెస్టిండీస్, జింబాబ్వే పర్యటనల నుంచి కోహ్లీ విశ్రాంతి తీసుకున్న విషయం తెలిసిందే. ఈ గ్యాప్‌లో ఫ్యామిలీతో సరదాగా గడుపుతూ రిఫ్రెష్ అయిన తర్వాత.. ఆటపైనే పూర్తి ఫోకస్ పెట్టాడు. మరో రెండు రోజుల్లో ఆసియా కప్ ప్రారంభం కానుంది. ఆదివారం పాకిస్థాన్‌తో జరిగే మ్యాచ్‌లో విరాట్ కోహ్లీ బరిలోకి దిగనున్నాడు. ఈ నేపథ్యంలో తన ఫామ్‌పై కోహ్లీ స్పందించాడు.
‘ఇంగ్లండ్ పర్యటనలో నేను అవుటైన తీరుపై దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంది. కానీ.. అదే నాకు పెద్ద సమస్యగా మీరు ఎత్తిచూపాల్సిన అవరసం లేదు. ఎందుకంటే నాకది చాలా చిన్న సమస్య. నా సత్తా ఏంటో నాకు తెలుసు. ఒక్కసారి నేను టచ్‌లోకి వచ్చానని నేను ఫీల్ అయితే చాలు.. అద్భుతంగా బ్యాటింగ్ చేయగలను. నిజానికి ఇంగ్లండ్‌లో నా ప్రదర్శన బాగాలేదు. ఆ విషయం నాకు కూడా తెలుసు. ప్రస్తుతం నేను ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నానో నాకు తెలుసు. ఇలాంటి గడ్డు పరిస్థితి దాటకుండానే నేను ఈ స్థాయికి రాలేదు. ఇలాంటి ఎన్నో చూశాను. అధిగమించాను కూడా. ఓ క్రీడాకారుడిగా నా తప్పుల నుంచి గుణపాఠం నేర్చుకోవాలనుకుంటున్నాను.
కెరీర్‌లో ఎత్తుపల్లాలు ఉండటం సహజమే. ఇప్పుడున్న పరిస్థితి అధిగమిస్తే.. నేను ఎంత అద్భుతంగా ఆడగలనో కూడా నాకు తెలుసు. అప్పుడు మళ్లీ నేనేంటో చూపిస్తా. ఇలాంటి పరిస్థితి గతంలో ఎదుర్కొన్న అనుభవంతో చెప్తున్నా.. నేనెప్పుడు నన్ను గొప్పగా అనుకోలేదు. అంటే నేను గొప్ప అనే అహంకారం నాకు లేదు. నా తప్పుల నుంచి నేను నేర్చుకోగలను’ అని కోహ్లీ పేర్కొన్నాడు. కాగా.. కోహ్లీ ఎంత గొప్ప ఆటగాడో అనే విషయం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఒక మంచి ఇన్నింగ్స్ పడితే చాలా కోహ్లీని ఆపడం ఎవరి తరం కాదని అని ఫ్యాన్స్ సోషల్ మీడియాలో పేర్కొంటున్నారు. అలాగే మాజీ క్రికెటర్లు సైతం కోహ్లీ తిరిగి ఫామ్ పుంజుకుంటాడని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. మరి కోహ్లీ వ్యాఖ్యలపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
ఇది కూడా చదవండి: వీడియో: భారీ సిక్సులతో విరుచుకుపడిన విరాట్ కోహ్లీ! ఇక పాక్‌కు దబిడిదిబిడే..
Comeback Loading…🙌🏻 #ViratKohli #AsiaCup2022 #Cricket #T20 pic.twitter.com/jLTaPG9djS
— Sportskeeda (@Sportskeeda) August 23, 2022
This shot has a separate fanbase @imVkohli pic.twitter.com/q6qpujLVXR
— 𓆩 ᴄʜɪᴋᴋᴜ 𓆪 (@chiragparmar149) August 22, 2022