విరాట్ కోహ్లీ.. టీమిండియాలో గంగూలీ తర్వాత అంతటి అగ్రెసివ్ కెప్టెన్‌గా పేరుతెచ్చుకున్న సారథి. మైదానంలో పాదరసంలా కదులుతూ జట్టు సభ్యులకు స్ఫూర్తి, ఉత్సాహం, ఆత్మవిశ్వాసం అందించడంలో కోహ్లీది ప్రత్యేక శైలి. తోటి ఆటగాళ్ల సక్సెస్‌ను కోహ్లీ ఆస్వాదించినంతగా మరే కెప్టెన్ ఆస్వాదించరనడంలో అతిశయోక్తి లేదు. విరాట్ కోహ్లీ బ్యాటింగ్‌కు ఎంతమంది ఫ్యాన్స్ ఉన్నారో తెలియదు గానీ కెప్టెన్‌గా అతని దూకుడుకి మాత్రం కోట్లలో ఫ్యాన్స్ ఉన్నారు. అంతలా ఇండియన్ క్రికెట్‌లో తనదైన ముద్ర వేశాడు కోహ్లీ. సచిన్ సృష్టించిన రికార్డులను బ్రేక్ చేయగల ఆటగాడు ఎవరైనా ఉన్నారా అంటే వినిపించే ఏకైక పేరు కింగ్ కోహ్లీదే. వాస్తవానికి కెప్టెన్సీ బాధ్యతలు లేకుండా ఉండి ఉంటే సచిన్ అన్ని రికార్డులకు చేరువలోకి కోహ్లీ వచ్చేసే వాడనే టాక్ ఒకటి ఉంది.
ఇదీ చదవండి: కెప్టెన్‌గా విరాట్ కోహ్లీ జట్టుకు ఎంత చేయాలో అంతకంటే ఎక్కువే చేశాడు.. ఈ లెక్కలే సాక్ష్యం!
ఇలా తన ఆటతో, దూడుకు శైలితో కెప్టెన్‌గా టీమిండియాను శాసించిన కోహ్లీ టీ20 కెప్టెన్‌గా తప్పుకున్నాడు. జట్టులో కెప్టెన్‌గా ఉన్న స్వేచ్ఛ ఆటగాడికి ఉండదు. ఇలాంటి సమయంలో ఇన్ని రోజులు కెప్టెన్‌గా ఉన్న అగ్రెసివ్‌నెస్ ఆటగాడిగా ఉండే కోహ్లీలో ఉంటుందనే అనే ప్రశ్నకు విరాట్ సమాధానం ఇచ్చాడు. ‘కచ్చితంగా తన దూకుడు శైలి మారదని.. నేను అలా లేకుంటే క్రికెట్ ఆడలేను’ అని స్పష్టం చేశాడు. కెప్టెన్‌గా అయినా.. ప్లేయర్‌గా అయినా.. నాలో ఏ మార్పు ఉండదని కోహ్లీ చెప్పేశాడు. చూడాలి మరి 17న న్యూజిలాండ్‌తో ప్రారంభ కానున్న టీ20 సిరీస్‌లో ఒక ప్లేయర్‌గా కోహ్లీ ఆడితే ఎలా ఉంటుందో? మరి కోహ్లీ వ్యాఖ్యలపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.