టీమిండియా మాజీ కెప్టెన్, రన్ మెషీన్ విరాట్ కోహ్లీ ఎంత గొప్ప బ్యాటరో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. దాదాపు అని దేశాల్లోనూ కోహ్లీకి సెంచరీలు ఉన్నాయి. ప్రపంచంలోని ప్రతి బౌలర్ కూడా కోహ్లీ వికెట్ తీసుకుంటే.. కప్పు గెలిచినంత సంబురపడిపోతాడు. అలాంటి ఆటగాడు విరాట్ కోహ్లీ. క్లాస్ క్రికెట్‌తో మాస్ ఇన్నింగ్స్‌లు ఆడగలడు. ప్రపంచ క్రికెట్‌లో అత్యధిక సెంచరీలు చేసిన రెండో ప్లేయర్‌గా నిలిచాడు కోహ్లీ. దిగ్గజ మాజీ క్రికెటర్ సచిన్ టెండూల్కర్ 100 సెంచరీల తర్వాత 74 సెంచరీలతో కోహ్లీ సెకండ్ ప్లేస్‌లో ఉన్నాడు. ప్రస్తుతం ఆడుతున్న క్రికెటర్లు ఎవరూ కోహ్లీ దరిదాపుల్లో కూడా లేరు. కొంత కాలంగా ఫామ్‌లో లేనట్లు కనిపించి.. 71వ సెంచరీ చేసేందుకు మూడేళ్లకు పైగా సమయం తీసుకున్న కోహ్లీ.. ఒక్కసారి ఫామ్ అందుకున్న వెంటనే.. సెంచరీల మీద సెంచరీలు బాదేస్తున్నాడు. షార్ట్ గ్యాప్‌లో 4 సెంచరీలు బాదేశాడు.
అలాగే ప్రపంచ క్రికెట్‌లో కోహ్లీపై ఆధిపత్యం ప్రదర్శించిన బౌలర్ ఒక్కడంటే ఒక్కడు కూడా లేడు. కొన్నిసార్లు అండర్సన్, జంపా, నాథన్ లయన్ లాంటి బౌలర్లు కోహ్లీని ఇబ్బంది పెట్టిన మాట వాస్తవమే కానీ.. అతనిపై పూర్తి ఆధిపత్యం చెలాయించిన దాఖలాలు లేవు. కానీ.. ఒక బౌలర్‌ను ఎదుర్కొనేందుకు మాత్రం కోహ్లీ చాలా ఇబ్బంది పడ్డాడు. ఆ విషయాన్ని స్వయంగా విరాట్ కోహ్లీనే ఒప్పుకున్నాడు. సౌతాఫ్రికాతో సిరీస్ సందర్భంగా ఓ సారి టీమిండియా వారం ముందే అక్కడి వెళ్లింది. నెట్స్ కోహ్లీ బ్యాటింగ్ ప్రాక్టీస్ చేస్తుండగా.. కొత్త కుర్రాడు జస్ప్రీత్ బుమ్రా బౌలింగ్ వేశాడు. అతని బౌలింగ్‌ను కొంతసేపు ఎదుర్కొన్న కోహ్లీ.. నేరుగా కోచ్ రవిశాస్త్రి వద్దకు వెళ్లి.. ‘వీడి బౌలింగ్ ఆడటం చాలా కష్టంగా ఉంది. బాల్ ఎప్పుడు రిలీజ్ చేస్తున్నాడో అర్థం కావడంలేదు. బాల్ రిలీజ్ టైమ్‌ను అంచన వేయడంలో కాస్త లేట్ అవుతున్న’ అని చెప్పాడు.
దీంతో.. బుమ్రా బౌలింగ్‌కు కోహ్లీ ఇంప్రెస్ అయిన విషయం కోచ్ రవిశాస్త్రికి అర్థమైంది.. బుమ్రాకు తుది జట్టులో ఆడే ఛాన్స్ వచ్చింది. ఈ విషయాన్ని టీమిండియా అప్పటి బౌలింగ్ కోచ్ భరత్ అరుణ్ వెల్లడించాడు. ఇలా బుమ్రా బౌలింగ్‌లో ఇబ్బంది పడిన కోహ్లీ.. ఏ మాత్రం గొప్పలకు పోకుండా బుమ్రా టఫ్ బౌలర్ అని ఒప్పుకోవడం నిజంగా గొప్ప విషయమే అంటూ నెటిజన్లు పేర్కొంటున్నారు. ఆ రోజు బుమ్రా బౌలింగ్‌కు కోహ్లీ ఇంప్రెస్ అవ్వడంతోనే టీమిండియాకు ఒక బెస్ట్ బౌలర్ దొరికాడు. ఇక ఆ అక్కడి నుంచి బుమ్రా వెనుదిరిగి చూసుకోలేదు. టీమిండియా తరఫున, ఐపీఎల్‌లోనూ అదరగొడుతున్నాడు. ప్రస్తుతం బుమ్రా గాయం కారణంగా టీమిండియాలో లేడు. కోహ్లీ ఆస్ట్రేలియాతో బోర్డర్-గవాస్కర్ ట్రోఫీకి సిద్ధమవుతున్నాడు. మరి ఈ విషయంలో మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
‘#ViratKohli told me he was finding it tough to face #JaspritBumrah in the nets,’ reveals Bharat Arun 🤩
In the 1st episode of ‘#RiseOfNewIndia‘ we track #Bumrah‘s amazing journey
Click on the link now 👉 https://t.co/01K3CArWCu@DineshKarthik @ImIshant @BhogleHarsha
— Cricbuzz (@cricbuzz) February 5, 2023