పాకిస్థాన్ స్టార్ బౌలర్ హరీస్ రౌఫ్ క్రికెట్ ఆడినంత కాలం రెండు సిక్సులు, ఒక మ్యాచ్ అతన్ని వెంటాడుతూనే ఉంటాయి. ఆ మ్యాచ్ టీ20 వరల్డ్ కప్ 2022లో టీమిండియాతో ఆడింది కాగా.. అదే మ్యాచ్‌లో 8 బంతుల్లో 28 రన్స్ అవసరమైన దశలో అతని బౌలింగ్‌లో విరాట్ కోహ్లీ కొట్టిన రెండు సిక్సులు.. హరీస్ రౌఫ్ జీవితాంతం మర్చిపోలేడు. అందులోనూ స్ట్రేయిట్‌గా కొట్టిన సిక్స్ అయితే న భూతో న భవిష్యతిః. పాకిస్థాన్ చేతుల్లోకి వెళ్లిపోయిన మ్యాచ్‌ను లాక్కొచ్చి అసాధారణ బ్యాటింగ్‌తో విరాట్ కోహ్లీ టీమిండియాను గెలిపించాడు. ఆ విధ్వంసకర బ్యాటింగ్‌కు ముఖ్యంగా బలైంది.. హరీస్ రౌఫే. టీ20 వరల్డ్ కప్‌లో తొలి మ్యాచ్.. పైగా టీమిండియా చేతిలో గెలవాల్సిన మ్యాచ్ ఓడిపోవడంతో.. పాక్ ఆటగాళ్లు తీవ్ర నిరాశ చెందారు.
అయితే.. మ్యాచ్‌కు టర్నింగ్ పాయింట్ అయిన విరాట్ కోహ్లీ కొట్టిన సిక్సుల గురించి ఒక సారి రౌఫ్‌ను ప్రశ్నించగా.. విరాట్ కోహ్లీ లాంటి ఆటగాడు కొట్టాడు కాబట్టి పెద్దగా బాధపడలేదని.. అలాంటి స్టార్ ప్లేయర్ కొట్టగలడని తమకు తెలుసని అన్నాడు. అయినా తన బౌలింగ్‌లో అలాంటి షాట్ విరాట్ కోహ్లీ తప్పితే.. ప్రపంచంలో మరే ఆటగాడు ఆటలేడని సైతం రౌఫ్ పేర్కొన్నాడు. అయితే.. తాజాగా మ్యాచ్ ఓడినందుకు మాత్రం చాలా బాధపడినట్లు పేర్కొన్నాడు. అలాగే ఆదే స్ట్రేయిట్ సిక్స్‌ను ఇప్పుడు కోహ్లీ మళ్లీ కొట్టలేడని రౌఫ్ తెలిపాడు.
అయితే.. 2018లో కోహ్లీకి తనకు మధ్య సంభాషన గురించి రౌఫ్ చెబుతూ..‘నా బౌలింగ్ చూసిన కోహ్లీ.. నువ్వు ఆరు నెలల్లోనే పాకిస్థాన్ తరఫున అంతర్జాతీయ క్రికెట్ ఆడతావని చెప్పాడు. కోహ్లీ చెప్పినట్లే.. నేను 8-9 నెలల్లోనే పాకిస్థాన్ తరఫున నా మొదటి ఇంటర్నేషనల్ మ్యాచ్ ఆడాను.’ అని పేర్కొన్నాడు. విరాట్ కోహ్లీ చెప్పింది తన జీవితంలో జరిగిందని.. తనలోని టాలెంట్‌ను ఒక స్టార్ ప్లేయర్ ముందే గుర్తించి నందుకు సంతోషం వ్యక్తం చేశాడు. మరి ఈ విషయంలో మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
Haris Rauf (in Geo News) said “In 2018, Virat Kohli told me that I will be playing for Pakistan within six months and 8-9 months later, I made my debut for Pakistan”.
— Johns. (@CricCrazyJohns) January 9, 2023