భారత్-సౌతాఫ్రికా మధ్య సోమవారం రెండో టెస్టు మొదలైంది. అనూహ్యంగా ఈ మ్యాచ్‌లో టీమిండియా టెస్ట్ కెప్టెన్ విరాట్ కోహ్లీ ఆడటం లేదు. అతని స్థానంలో తాత్కాలిక కెప్టెన్‌గా టాస్ కోసం వచ్చిన కేఎల్ రాహుల్.. పైవెన్ను నొప్పి కారణంగా కోహ్లీ ఈ మ్యాచ్‌లో ఆడటంలేదని, కోహ్లీ ప్లేస్‌లో హనుమ విహారి ఆడుతున్నట్లు వెల్లడించాడు. కాగా విరాట్ కోహ్లీ టెస్టు మ్యాచ్‌లో ఆడకపోవడంపై పలు అనుమనాలు వ్యక్తం అవుతున్నాయి. విరాట్ కోహ్లీ కావాలనే ఈ మ్యాచ్‌లో ఆడటం లేదని, అతని గాయం కాలేదని సమాచారం.
వన్డే కెప్టెన్సీ మార్పుతో బీసీసీఐ పెద్దల పట్ల కోహ్లీ ఆగ్రహంగా ఉన్న విషయం తెలిసిందే. సౌతాఫ్రికా పర్యటనకు వచ్చే ముందు మీడియాతో మాట్లాడిన కోహ్లీ.. సెలెక్టర్ల నుంచి తనకు సరైన సమాచారం అందలేదన్నాడు. అంతేకాకుండా తననెవరూ టీ20 కెప్టెన్‌గా కొనసాగాలని కోరలేదని బీసీసీఐ బాస్ సౌరవ్ గంగూలీతో పాటు ఇతర పెద్దలను ఇరకాటంలో పెట్టాడు. ఇక సౌతాఫ్రికా పర్యటనలో 3 వన్డేల సిరీస్ కోసం భారత జట్టును ఎంపిక చేసిన సందర్భంగా సెలెక్షన్ కమిటీ చైర్మన్ చేతన్ శర్మ.. విరాట్ కోహ్లీ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. కోహ్లీ టీ20 కెప్టెన్‌గా తప్పుకొంటానని చెప్పినప్పుడే వద్దని చెప్పామని, జట్టు కోసం కొనసాగాలని కోరామని పేర్కొన్నాడు. ‘సెప్టెంబర్‌లో విరాట్ తన నిర్ణయాన్ని ప్రకటించినప్పుడూ మా అందరికీ ఆశ్చర్యమేసింది.
ఆ సమావేశంలో పాల్గొన్న వారంతా కోహ్లీ తన నిర్ణయాన్ని పునరాలోచించుకోవాలని కోరారు. తన నిర్ణయం టీ20 ప్రపంచకప్‌లో జట్టుపై ప్రభావం చూపుతుందని, అలాంటప్పుడు జట్టు కోసమైనా సారథిగా కొనసాగమని కోరాం. ప్రతి ఒక్కరూ అతనికి సర్దిచెప్పడానికి ప్రయత్నించారు. ఆ సమావేశంలో బోర్డు అధికారులతో సహా అందరూ ఉన్నారు. అయినా కోహ్లీ తన నిర్ణయానికి కట్టుబడి ఉండటంతో మేం దాన్ని కాదనలేకపోయాం’ అని చేతన్ వివరించాడు. అయితే టీ20 కెప్టెన్సీ వదులుకుంటే వన్డే కెప్టెన్సీ నుంచి కూడా తప్పుకోవాల్సి వస్తుందని విరాట్‌కు చెప్పారా? అని మీడియా ప్రశ్నించగా.. ఆ సమయంలో అలా చెప్పడం సరైందిగా భావించలేదని చేతన్ శర్మ బదులిచ్చాడు. అలా చెబితే జట్టుపై ప్రభావం చూపుతుందని భావించామని, ప్రపంచకప్ తర్వాత కూడా టీ20 సారథ్యంపై పునరాలోచించుకోవాలని కోరాం’చేతన్ శర్మ చెప్పుకొచ్చాడు.
అయితే తనను మీడియా దోషిగా భావించేలా వ్యాఖ్యలు చేసిన చేతన్ శర్మ పట్ల కోహ్లీ ఆగ్రహంగా ఉన్నాడని, దాంతోనే మ్యాచ్‌కు దూరంగా ఉండి తన అసంతృప్తిని తెలియజేస్తున్నాడనే వాదన వినిపిస్తోంది. మరి కోహ్లీకి నిజంగానే గాయం అయిందా? లేదా చేతన్‌శర్మ వ్యాఖ్యలపై గుర్రుగా ఉండి మ్యాచ్ ఆడకుండా తన నిరసన తెలియజేస్తున్నాడా? దీనిపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
ఇదీ చదవండి: కోహ్లీ- రోహిత్ ఫ్యాన్స్ మధ్య మాటల యుద్ధం! ట్వీట్స్ వైరల్!