అది 2021 టీ20 వరల్డ్ కప్.. స్టార్ ఆల్ రౌండర్ హార్దిక్ పాండ్యా దారుణంగా విఫలం అయ్యాడు. బ్యాటింగ్ లోనే కాక బౌలింగ్ లో సైతం ఆకట్టుకోలేక పోయాడు. గాయాలు, సర్జరీ కారణంగా పాండ్యా పూర్తిగా ఫిట్ నెస్ సాధించలేకపోయాడు. దాంతో టీమిండియా సెలక్టర్లు మరో మెరుపు ఆల్ రౌండర్ కోసం వెతక సాగింది. ఆ క్రమంలోనే సెలక్టర్ల దృష్టిలో పడ్డాడు యువ సంచలనం వెంకటేష్ అయ్యర్. అటు బ్యాట్ తోనూ, ఇటు బాల్ తోనూ అప్పటికే అద్భతంగా రాణిస్తున్నాడు. దాంతో జెట్ స్పీడ్ లో టీమిండియా జాతీయ జట్టు నుంచి పిలుపు అందుకున్నాడు. కానీ ఎంత వేగంగా వచ్చాడో.. అంతే వేగంగా కనుమరుగైయ్యాడు. ఈ నేపథ్యంలోనే టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ తనను సరిగ్గా వాడుకోలేక పోయాడని, బ్యాటింగ్, బౌలింగ్ కూడా ఇవ్వలేదని షాకింగ్ కామెంట్స్ చేశాడు.
IPL 2021.. కోల్ కత్తా నైట్ రైడర్స్ జట్టు పేలవ ప్రదర్శనతో అట్టడుగు స్థానంలో ఉంది. అప్పుడే వచ్చాడు కేకేఆర్ జట్టులోకి వెంకటేష్ అయ్యర్. తన అద్భుతమైన బ్యాటింగ్ తో అదరగొట్టాడు. 10 మ్యాచ్ ల్లో 4 అర్ద శతకాలతో 370 పరుగులు చేశాడు. అటు బౌలింగ్ లోనూ అమోఘమైన పేస్ తో ఆకట్టుకున్నాడు. ఈ ప్రదర్శన కారణంగానే 2021 ఐపీఎల్ టోర్నీ ముగిసిన తర్వాత న్యూజిలాండ్ తో జరిగిన టీ20 సిరీస్ కు ఎంపిక చేశారు. అయితే ఈ సిరీస్ లో మూడు మ్యాచ్ ల్లో కేవలం ఒక్కసారి మాత్రమే అయ్యర్ కు బ్యాటింగ్ వచ్చింది. ఇక బౌలింగ్ లో అయితే దారుణం ఒక్కటంటే.. ఒక్కటే ఓవర్ వేశాడు వెంకటేష్ అయ్యార్. ఈ సిరీస్ తర్వాత జట్టులో చోటు కోల్పోయాడు వెంకటేష్ అయ్యర్.
.@venkateshiyer opens up on his T20 World Cup exclusion.#VenkateshIyer #T20WorldCup #IndianCricketTeam #Cricket #CricTracker pic.twitter.com/fNUaK44gz2
— CricTracker (@Cricketracker) November 23, 2022
ఈ క్రమంలోనే తనకు అవకాశాలు రాకపోడానికి గల కారణాలను వెల్లడించాడు ఈ ఆల్ రౌండర్.”నేను టీమిండియాలోకి అడుగు పెట్టే నాటికే రోహిత్, రాహుల్, ఇషాన్ కిషన్ లు జట్టులో ఓపెనర్లు గా కొనసాగుతున్నారు. అప్పుడే అనుకున్నా నాకు ఓపెనింగ్ దక్కదని. ఇక ఇదే విషయాన్ని కోచ్ ద్రవిడ్ కు చెప్పాను. అయితే భయపడాల్సిన అవసరం లేదని, కావాల్సినన్ని మ్యాచ్ లు ఆడిస్తామని రోహిత్, రాహుల్ లు భరోసా ఇచ్చారని” అయ్యర్ పేర్కొన్నాడు. అయితే జరిగింది వేరే అని వెంకటేష్ అయ్యర్ అవేదన వ్యక్తం చేశాడు. రోహిత్ శర్మ నన్ను సరిగ్గా ఉపయోగించుకోలేక పోయాడు.
బౌలింగ్, బ్యాటింగ్ కూడా ఇవ్వలేదని అయ్యర్ ఆరోపించాడు. ఓపెనర్ గా దిగే నేను 6, 7వ స్థానాల్లో ఎలా బ్యాటింగ్ చేస్తాను..అలాగే జట్టులో ఐదుగురు స్పెషలిస్టు బౌలర్లు ఉన్నప్పుడు నా అవసరం ఏముంటుందని, రోహిత్ శర్మ కూడా ఇదే అనుకుని ఉంటాడని వెంకటేష్ అయ్యర్ చెప్పుకొచ్చాడు. ఏదిఏమైనప్పటికీ టీమిండియా, రోహిత్ శర్మ నన్ను సరిగ్గా వాడుకోలేదని ఆవేదన వ్యక్తం చేశాడు వెంకటేష్ అయ్యర్. వెంకటేష్ అయ్యర్ లాంటి ఆల్ రౌండర్ ఇప్పుడు జట్టుకు చాలా అవసరం అని క్రీడానిపుణులు సూచిస్తున్నారు. ఇప్పటికైనా అతడికి చోటు దక్కుతుందో లేదో చూడాలి మరి.