గత కొంత కాలంగా ఇటు క్రికెట్ ప్రపంచంలో.. అటు సినిమా పరిశ్రమలో వినిపిస్తున్న పేర్లు.. రిషభ్ పంత్, ఊర్వశి రౌటెలా. వీరిద్దరి మీద గత కొన్ని రోజులుగా వార్తలు షికార్లు చేస్తున్న సంగతి మనందరికి తెలిసిందే. గతంలో వీరిద్దరు డేటింగ్ చేసినట్లు వార్తలు కూడా వినిపించాయి. అయితే వారిద్దరు గత కొంత కాలంగా దూరాన్ని మెయింటెన్ చేస్తున్నారు. ఈ క్రమంలోనే పంత్ పై సోషల్ మీడియా వేదికగా చాలా సార్లు పోస్ట్ లు షేర్ చేసింది ఊర్వశి. పంత్ ఎక్కడికి మ్యాచ్ ఆడటానికి వెళ్లినా గానీ అక్కడికి వెళ్లేది రౌటెలా. అతడిపై వ్యంగ్యంగా పోస్ట్ లు షేర్ చేసేంది. ఈ క్రమంలోనే పంత్ కు యాక్సిడెంట్ జరగడంతో అతడు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. తాజాగా పంత్ చికిత్స తీసుకుంటున్న ఫొటోను తన ఇన్ స్టా గ్రామ్ లో స్టోరిగా పెట్టింది ఊర్వశి. ప్రస్తుతం ఈ పిక్ నెట్టింట వైరల్ గా మారింది.
రిషభ్ పంత్-ఊర్వశి రౌటెలా.. ప్రస్తుతం సోషల్ మీడియాలో ట్రెండింగ్ లో ఉన్న పేర్లు. కారు ప్రమాదంలో గాయపడిన పంత్.. గత కొన్ని రోజులుగా ఆస్పత్రిలో చికిత్స తీసుకుంటున్నాడు. మెున్నటి వరకు డెహ్రాడూన్ లో చికిత్స తీసుకున్న పంత్ ను ని.. బీసీసీఐ మెరుగైన చికిత్స కోసం తాజాగా ముంబైకి తరలించింది. ఇక ప్రస్తుతం రిషభ్ పంత్ ముంబై లోని కోకిలాబెన్ దీరూభాయ్ అంబానీ ఆస్పత్రిలో చికిత్స తీసుకుంటున్నాడు. ఈ క్రమంలోనే ఊర్వశి రౌటెలా మరో చౌకబారు పని చేసింది. అదేంటంటే.. పంత్ చికిత్స పొందుతున్న ఆస్పటల్ ఫోటోను తన ఇన్ స్టా స్టోరిలో షేర్ చేసింది రౌటెలా. దాంతో ఈ స్టోరీ చూసిన పంత్ ఫ్యాన్స్ తో పాటు.. క్రికెట్ అభిమానులు కూడా ఊర్వశిపై మండిపడుతున్నారు. అక్కడ ఆస్పత్రిలో చికిత్స పొందుతుంటే.. నువ్వు ఇక్కడ ఉండి ఫొటోలు షేర్ చేసుకుంటు తిరుగుతున్నావా? అంటూ సోషల్ మీడియా వేదికగా కామెంట్స్ పెడుతున్నారు.
పంత్ కు యాక్సిడెంట్ కాకముందు కూడా కొన్ని పోస్ట్ లు పెట్టి.. తర్వాత డీలిట్ చేసింది ఊర్వశి. మరోసారి ఇలా ఆస్పత్రి పిక్ పెట్టి వార్తల్లో నిలిచింది. పంత్ యాక్సిడెంట్ జరిగినప్పుడు కూడా వైట్ కలర్ ఎమోజీ పెట్టి త్వరగా కోలుకోవాలని కూడా పోస్ట్ ను షేర్ చేసింది ఊర్వశి రౌటెలా. 2018లో వీరిద్దరు రీలేషన్ షిప్ లో ఉన్నారని అప్పట్లో వార్తలు వచ్చాయి. ఆ వార్తలకు తగ్గట్లుగానే వారి రెస్టారెంట్లలో, పార్టీల్లో కలిసి కనిపించారు కూడా. అయితే 2019లో నేను ఇషా నేగి అనే అమ్మాయితో రిలేషన్ లో ఉన్నానని పంత్ ప్రకటించాడు. దాంతో అప్పటి నుంచి ఊర్వశి పంత్ కు దూరంగా ఉంటుంది. కానీ అవకాశం చిక్కినప్పుడల్లా పంత్ పై విరుచుకుపడుతూనే ఉంది.