శ్రీలంకతో జరిగిన రెండో టీ20లో భారత్ 16 పరుగుల తేడాతో పరాజయం పాలైన సంగతి తెలిసిందే. సూర్యకుమార్, అక్షర్ పటేల్ లు ఇద్దరు సునామీ ఇన్నింగ్స్ ఆడినప్పటికీ భారత్ ను గెలిపించలేకపోయారు. ఇక ఈ మ్యాచ్ లో టీమిండియా బౌలింగ్ దళం తేలిపోయిందనే చెప్పాలి. తొలి మ్యాచ్ లో అద్భుతంగా బౌలింగ్ చేసి మ్యాచ్ ను గెలిపించిన బౌలర్లు.. రెండో మ్యాచ్ లో భారీగా పరుగులు సమర్పించుకుని ఓటమికి కారణం అయ్యారు. అయితే మ్యాచ్ ఓడిపోయినప్పటికీ ఉమ్రాన్ వేసిన ఓ బంతి మాత్రం క్రీడా ప్రపంచాన్నే ఆశ్చర్యంలో ముంచెత్తుతోంది. ప్రపంచంలో ఏ బ్యాటర్ కూడా ఆ బంతిని ఆడలేడు అని కితాబిస్తున్నారు క్రీడానిపుణులు.
ఇండియా-శ్రీలంక మ్యాచ్.. రెండో టీ20లో బ్యాటింగ్ ఆరంభించిన శ్రీలంక ఓపెనర్లు టీమిండియా బౌలర్లపై ఓ యుద్దాన్నే ప్రకటించారు. ఎడాపెడా బౌండరీలు బాదుతూ.. స్కోరు బోర్డును పరుగులు పెట్టించారు. ఓవైపు నిశాంక ఆచితూచి ఆడుతుంటే.. మరోవైపు లంక వికెట్ కీపర్ మెండీస్ చెలరేగిపోయాడు. 31 బంతుల్లో 4 సిక్స్ లు, 3 ఫోర్లతో 52 పరుగులు చేశాడు. ఈ జోడీ తొలి వికెట్ కు 8 ఓవర్లలోనే 80 పరుగులు జోడించి లంక ఇన్నింగ్స్ కు గట్టి పునాది వేసింది. ప్రమాదకరంగా మారుతున్న ఈ జోడీని అక్షర్ పటేల్ విడగొట్టాడు. అక్షర్ పటేల్ బౌలింగ్ లో.. అద్భుతమైన క్యాచ్ పట్టి నిశాంకను అవుట్ చేశాడు త్రిపాఠి.
అనంతరం క్రీజ్ లోకి వచ్చాడు బానుక రాజపక్స. రాజపక్సకు ఓ అద్భుతమైన బాల్ తో చుక్కలు చూపించాడు టీమిండియా స్పీడ్ స్టర్ ఉమ్రాన్ మాలిక్. కచ్చితమైన లైన్ అండ్ లెంగ్త్ తో పాట్ ఇన్ స్వింగ్ వేసి రాజపక్సను(2) ఔట్ చేశాడు. ఈ బాల్ మ్యాచ్ కే హైలెట్ అని చెప్పాలి. మీరు జీవితంలో ఇలాంటి బాల్ ను క్రికెట్ లో చూసి ఉండరు అంటూ కితాబిస్తున్నారు మాజీ దిగ్గజాలు. ఇక ఇది బాల్ ఆఫ్ ది సెంచరీగా అభివర్ణిస్తున్నారు మరికొందరు. కచ్చితమైన స్పీడ్ తో లైన్ అండ్ లెంగ్త్ బాల్స్ వేయడంలో ఉమ్రాన్ మాలిక్ దిట్ట అనే చెప్పాలి. అసలు రాజపక్స బ్యాట్ ఊపే టైమ్ లకే బాల్ వికెట్లను గీరాటేసింది. దాంతో కంగుతిన్నాడు రాజపక్స. ప్రస్తుతం రాజపక్స అవుట్ అయిన వీడియో నెట్టింట వైరల్ గా మారింది.
I. C. Y. M. I! @umran_malik_01‘s timber strike to dismiss Bhanuka Rajapaksa 👌 👌
Follow the match ▶️ https://t.co/Fs33WcZ9ag #TeamIndia | #INDvSL pic.twitter.com/ws8mPgS7oq
— BCCI (@BCCI) January 5, 2023