శ్రీలంకతో జరిగిన టీ20 సిరీస్ ను కైవసం చేసుకుని మంచి ఊపు మీద ఉన్న భారత్.. ఆ ఊపును వన్డేల్లో సైతం కొనసాగిస్తోంది. తాజాగా మంగళవారం గౌహతి వేదికగా జరిగిన తొలి వన్డేలో టీమిండియా 67 పరుగుల తేడాతో లంకను ఓడించింది. టీమిండియా రన్ మెషిన్ విరాట్ కోహ్లీ (113) రికార్డు సెంచరీకి తోడు కెప్టెన్ రోహిత్ శర్మ(83), గిల్(70) పరుగులతో రాణించడంతో భారత్ భారీ స్కోరు సాధించింది. అయితే ఈ మ్యాచ్ లో ఓ ఆసక్తికర సంఘటన జరిగింది. టీమిండియా నయా బౌలింగ్ సంచలనం, కశ్మిరీ ఎక్స్ ప్రెస్ తన రికార్డును తానే బద్దలు కొట్టాడు. దాంతో పాటుగా అదే బంతికి లంక బ్యాటర్ అసలంక అవుట్ కాకుండానే.. ఉమ్రాన్ బంతులకు భయపడి క్రీజ్ ను విదిలాడు ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్ గా మారింది.
శ్రీలంకతో ప్రారంభమైన మూడు వన్డే మ్యాచ్ ల సిరీస్ లో భారత్ శుభారంభం చేసింది. గౌహతి వేదికగా జరిగిన తోలి వన్డేలో 67 రన్స్ తేడాతో లంకను చిత్తు చేసింది. సమష్టిగా రాణించిన భారత ఆటగాళ్లు అన్ని రంగాల్లో ఆల్ రౌండ్ ప్రదర్శనతో ఆకట్టుకున్నారు. ఇక ఈ మ్యాచ్ లో ఉమ్రాన్ నయా రికార్డును నెలకొల్పాడు. వన్డే ఫార్మాట్ లో ఉమ్రాన్ మాలిక్ అత్యధిక వేగవంతమైన బాల్ ను విసిరి తన రికార్డును తానే తిరగరాసుకున్నాడు. ఇక తాజాగా లంకతో జరిగిన టీ20 మ్యాచ్ లో గంటకు 155 కిలోమీటర్ల వేగంతో బంతి విసిరిన సంగతి మనకు తెలిసిందే. అయితే లంకతో జరిగిన తొలి వన్డేలో ఇన్నింగ్స్ 14వ ఓవర్ లో 156 కిలోమీటర్ల వేగంతో బంతి విసిరి ఉమ్రాన్ ఈ ఘనత సాధించాడు. లంక బ్యాటర్ చరిత అసలంక ఉమ్రాన్ బంతులకు ఉక్కిరి బిక్కిరి అయ్యాడు. ఒక్కో బంతి బుల్లెట్ లా దూసుకొస్తుంటే ఎలా ఆడాలో అతడికి అర్థం కాలేదు.
ఇక ఈ ఓవర్ చివరి బంతికి అసలంక కీపర్ చేతికి క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. అయితే ఇక్కడ ఆశ్చర్య కరమైన విషయం ఏంటంటే? అసలు అసలంక బ్యాట్ కు బంతిని తాకనే లేదు. రిప్లేలో బంతి బ్యాట్ కు తాకకుండా అతడి టవల్ ను తాకుతూ వెళ్లి కీపర్ చేతుల్లో పడింది. దాంతో అవుట్ అనుకుని అతడు పెవిలియన్ కు చేరాడు. అప్పటికే ఈ ఓవర్ లో నిప్పులు చెరిగే బంతులు వేస్తూ.. లంక బ్యాటర్ కు చుక్కలు చూపించాడు ఉమ్రాన్. ఈ ఓవర్లో వరుసగా గంటకు 147, 151, 156, 146, 145 కిలోమీటర్లు వేగంతో బంతులు విసురుతూ బ్యాట్స్ మెన్ ను బెంబేలెత్తించాడు. ఇక మ్యాచ్ విషయానికి వస్తే.. తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ నిర్ణీత 50 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 373 పరుగుల భారీ స్కోరు చేసింది.
Fastest ball by an Indian in ODI: 156 Kmph by Umran Malik.
Fastest ball by an Indian in T20I: 155 kmph by Umran Malik.
Fastest ball by an Indian in IPL: 157 kmph by Umran Malik.
— Johns. (@CricCrazyJohns) January 10, 2023
జట్టులో విరాట్ కోహ్లీ 87 బంతుల్లో 12 ఫోర్లు, సిక్స్ తో 113 పరుగులు చేయగా.. రోహిత్(83), గిల్(70), రాహుల్(39) పరుగులతో రాణించారు. అనంతరం భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన లంక ఏ దశలోనే లక్ష్యంవైపు సాగలేదు. లంక నిర్ణీత 50 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 306 పరుగులు చేసి 67 పరుగులతో పరాజయం పొందింది. లంక జట్టులో కెప్టెన్ దసున్ షణక ఒక్కడే ఒంటరి పోరాటం చేశాడు. 88 బంతుల్లో 12 ఫోర్లు, 3 సిక్స్ లతో 108 పరుగులు చేసి నాటౌట్ గా నిలిచాడు. మిగతావారిలో నిస్సాంక(72), డి సిల్వా(47) పరుగులతో రాణించారు. భారత బౌలర్లలో ఉమ్రాన్ మాలిక్ 3 వికెట్లు తీయగా, సిరాజ్ 2 వికెట్లు పడగొట్టాడు.
Charith Asalanka walked off despite the ball hitting the towel#INDvSL #UmranMalik #CharithAsalanka pic.twitter.com/1dcpYGFGPg
— CricShiva (@shivauppala93) January 10, 2023
Fastest delivery in IPL, T20I Int’l, ODIs for India in the history – Umran Malik. pic.twitter.com/h0hFwsvQRg
— CricketMAN2 (@ImTanujSingh) January 10, 2023