ఐపీఎల్ 2023కు ఇంకా చాలా సమయం ఉన్నా.. పంజాబ్ కింగ్స్ కీలక నిర్ణయం తీసుకుంది. టీమిండియా మాజీ కెప్టెన్ అనిల్ కుంబ్లేను కోచ్‌గా తప్పించి అతని స్థానంలో ఇంగ్లండ్ మాజీ కోచ్ ట్రెవర్ బేలిస్‌ను కొత్త కోచ్‌గా నియమించింది. ఈ విషయాన్ని పంజాబ్ కింగ్స్ తమ అధికారిక ట్విట్టర్ ద్వారా వెల్లడించింది. ట్రెవర్ బేలిస్ గతంలో శ్రీలంక, ఆస్ట్రేలియా, ఇంగ్లండ్, కోల్‌కత్తా నైట్ రైడర్స్, సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్లకు కోచ్‌గా పనిచేశారు. కాగా.. ఐపీఎల్ ప్రారంభం నుంచి ఉన్నా పంజాబ్ కింగ్స్ ఒక్కటంటే ఒక్కసారి కూడా కప్ గెలవలేదు. 2022లోనూ ఆ జట్టు అత్యంత దారుణమైన ప్రదర్శనను కనబర్చింది. 14 మ్యాచ్‌ల్లో కేవలం 7 విజయాలు సాధించి పాయింట్ల పట్టికలో 6వ స్థానంలో నిలిచి లీగ్ దశలోనే ఇంటిదారి పట్టింది.
దీంతో పంజాబ్ ఐపీఎల్ 2023ను చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకున్నట్లు సమాచారం. ఆ ప్రణాళికల్లో భాగంగానే బేలిస్‌ను కోచ్‌గా నియమించినట్లు తెలుస్తుంది. కాగా.. బేలిస్‌కు ముందు అనిల్ కుంబ్లే పంజాబ్ కింగ్స్‌కు హెడ్ కోచ్‌గా ఉన్న విషయం తెలిసిందే. 2020 సీజన్ నుంచి పంజాబ్ కింగ్స్ కోచ్‌గా వ్యవహరిస్తున్న కుంబ్లే.. ఆ టీమ్ తలరాతను మార్చలేకపోయాడు. 2020, 21, 22 మూడు సీజన్లలోనూ పంజాబ్ కింగ్స్ ఆరో స్థానంతోనే సరిపెట్టుకుంది. కుంబ్లేపై పంజాబ్ మేనేజ్‌మెంట్ పెట్టుకున్న నమ్మకం ఫలితం ఇవ్వలేకపోవడంతో.. కుంబ్లేను కోచ్‌గా తప్పించింది. మరి ఈ విషయంలో మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
🚨 New Coach Alert 🚨
IPL winner ✅
ODI World Cup winner ✅
CLT20 winner ✅Here’s wishing a very warm welcome to our new Head Coach, Trevor Bayliss. 😍
Here’s looking forward to a successful partnership! 🤝#PunjabKings #SaddaPunjab #TrevorBayliss #HeadCoach pic.twitter.com/UKdKi2Lefi
— Punjab Kings (@PunjabKingsIPL) September 16, 2022