టోక్యో ఒలంపిక్స్‌లో భాగంగా అన్ని దేశాల జట్లు ఆటల్లో మునిగిపోయాయి. ఎప్పుడో జరగాల్సిన ఈ ఒలంపిక్స్ గేమ్స్ కరోనా కారణంగా వాయిదా పడుతూ వచ్చింది. ఇక ఎట్టకేలకు తెర తీస్తు జపాన్ ప్రభుత్వం ఆ ఆటలను నిర్వహిస్తోంది. ఇక ఇప్పటి కూడా అక్కడక్కడ కేసులు నమోదవుతూనే ఉన్నాయి. దీంట్లో కట్టుదిట్టమైన జాగ్రత్తలతో పోటీలను నిర్వహిస్తోంది అక్కడి ప్రభుత్వం.
ఇక ఈ సారి ఒలంపిక్స్‌లో భారత్‌కు అవార్డు పంట పండింది. వెయిట్ లిఫ్టర్ మీరాబాయి చాను కాంస్య పతకంలో బోణి కొట్టి భారత ఖ్యాతిని ఎల్లలు దాటించింది. ఇక తాజాగా భారత్ స్టార్ షట్లర్ పీవీ సింధు గోల్డ్ మెడల్ గెలిచినంత పని చేసి చివరికి కాంస్య పతాకాన్ని అందించి మరో సారి రికార్డును నెలకోల్సింది. దీంతో ఇండియా కీర్తి పతాకాన్ని ఎగరవేశారు భారత అథలెట్లు. ఇక తాజాగా ఇండియా పురుషుల హాకీ జట్టు సెమీస్‌లోకి అడుగు పెట్టింది.
ఇక ఈ మ్యాచ్‌కు హిందీ కామెంటరీగా వ్యవహరించారు సిద్దార్థ్ పాండే. ఇండియా పురుషుల హాకీ జట్టు సెమీస్‌లోకి అడుగుపెట్టడంతో సిద్దార్థ్ పాండే భావోద్వేగానికి గురయ్యాడు. కామెంటరీ చేయటం ఆపేసి మరి కన్నీళ్లు పెట్టుకున్నారు. ఇక పక్కనున్న కామెంటరీలు ఓదార్చేందుకు ప్రయత్నం చేశారు. దీంతో ఇప్పుడు ఈ వీడియో ఇప్పుడు నెట్టింట్లో వైరల్‌గా మారింది.