ఐపీఎల్‌లో అత్యంత విజయవంతమైన ఆటగాళ్లలో సురేష్ రైనా ఒకరు. ఈ ధనాధన్ లీగ్ లో ఎన్నో మ్యాచులను ఒంటి చేత్తో గెలిపించిన రైనా.. ‘మిస్టర్ ఐపీఎల్’గా పేరు తెచ్చుకున్నాడు. చెన్నైసూపర్ కింగ్స్ జట్టు నిషేధం ఎదుర్కొన్న రెండు సంవత్సరాలు మినహా.. ఆడినన్నీ రోజులు సీఎస్కే జట్టుకే ఆడాడు. ఎన్నో మరుపురాని విజయాలు అందించాడు.
అయితే.. సీఎస్కే యాజమాన్యం మాత్రం రైనాను రిటైన్ చేసుకోకపోవడమే కాకుండా.. మెగా వేలంలో సైతం అతనిని కొనుగోలు చేయడానికి ఆసక్తి కనబర్చలేదు. ఇతర జట్ల ప్రాంఛైజీలు కూడా రైనాపై ఆసక్తి కనబర్చకపోవడంతో మెగా వేలంలో అన్ సోల్డ్ ఆటగాడిగా మిగిలిపోయాడు. ఈ విషయమై అప్పట్లో పెద్ద దుమారమే రేగింది. ఓ గొప్ప ఆటగాడిని ఈ విధంగా అవమానించడం సరైనది కాదంటూ అభిమానులు సోషల్ మీడియా వేదికగా తమ అసహనాన్ని వ్యక్తం చేశారు.‘మిస్టర్ ఐపీఎల్’ గా పేరొందిన సురేష్ రైనా ఇక ఐపీఎల్‌లో కనిపించడని బాధపడుతున్న అభిమానులకు ఐపీఎల్ మేనేజ్‌మెంట్ గుడ్ న్యూస్ చెప్పింది. మార్చి 26 నుంచి ప్రారంభం కానున్న ఈ మెగా లీగ్ లో సురేష్ రైనా కూడా కనిపించనున్నాడు. కాకపోతో ఆటగాడిగా కాదు.. కామెంటేటర్‌గా సందడి చేయనున్నాడు. రైనా మాత్రమే కాదు.. టీమిండియా మాజీ హెడ్ కోచ్ రవిశాస్త్రి కూడా ఈ ఏడాది ఐపీఎల్‌లో కామెంటేటర్‌గా కనపించనున్నాడు. ఐపీఎల్ లో రైనాకు ఉన్న క్రేజ్ ని దృష్టిలో ఉంచుకొని కామెంటేటర్ గా నియమిస్తున్నట్లు ఐపీఎల్ మేనేజ్‌మెంట్ అధికారిక ప్రకటన చేసింది.
గతంలో ఇంగ్లీష్ కామెంట్రీ చేసిన రవిశాస్త్రి ఈ సారి హిందీ కామెంట్రీ చేయబోతుండడం ఆసక్తికరంగా మారింది. గతంలో ఓ క్రీడా ఛానెల్ ఇంగ్లీష్ కామెంట్రీలో కీలక పాత్ర పోషించిన రవిశాస్త్రి టీమిండియాకు హెడ్ కోచ్ పదవి చేపట్టిన తర్వాత ఆ బాధ్యతలకు దూరంగా ఉన్నాడు. అయితే గత ఏడాది జరిగిన టీ20 వరల్డ్‌కప్‌తో రవిశాస్త్రి పదవి కాలం ముగియండంతో మళ్లీ కామెంటేటర్‌గా రీఎంట్రీ ఇస్తున్నాడు. రైనా కూడా కామెంటేటర్‌గా రీఎంట్రీ ఇస్తుండటంతో అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
Good News 😀
“Ravi Shastri and Suresh Raina will do Commentary in Hindi in IPL 2022.”
– Head of Disney & Star (To Dainik Jagran)#RaviShastri #SureshRaina #IPL2022 #cricket #allaboutcricket pic.twitter.com/WX77H7cu2y— All About Cricket (@AllAboutCricke8) March 15, 2022
Will Chennai Super Kings miss Suresh Raina in this IPL 2022? 👀
🟡 Checkout his IPL career stats: #CricksLab #CricketTwitter #ChennaiSuperKings #SureshRaina𓃵 #IPL2022 #india #WhistlePodu #விசில்போடு #Yellove pic.twitter.com/rtgMAzRX6m
— CricksLab (@CricksLab) March 10, 2022