టీ20 ప్రపంచ కప్ 2022 మెుదలై దాదాపు పది రోజులు కావొస్తుంది. కానీ అసలైన సంగ్రామం స్టార్ట్ అయ్యింది మాత్రం ఆదివారం అనే చెప్పాలి. ప్రపంచ వ్యాప్తంగా ఇండియా-పాక్ మ్యాచ్ కోసం ఎదురుచూసిన క్రీఢాభిమానులను అంతే రేంజ్ లో అలరించింది ఈ మ్యాచ్. విరాట్ కోహ్లీ హీరో ఇన్నింగ్స్ తో భారతీయులకు ఒక రోజు ముందుగానే దీపావళి పండుగ వచ్చింది. అయితే మ్యాచ్ లో ఆటగాళ్లు, స్టేడియంలో ప్రేక్షకులు ఓ రేంజ్ లో ఉత్కంఠకు గురయ్యారు. కానీ అంతకు మించి కామెంట్రీ బాక్స్ లో కామెంటేటర్ లు పూనకాలు వచ్చినట్లు కామెంట్రీ చేశారు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్ గా మారింది. మరిన్ని వివరాల్లోకి వెళితే..
కామెంట్రీ.. క్రికెట్ మ్యాచ్ కు కామెంట్రీనే ఊపిరి అని చెప్పాలి. ఎందుకంటే టీవీలు లేని కాలంలో వారి కామెంట్రీని రేడియోల్లో వినే.. బ్యాటర్ బాంతిని ఏవిధంగా కొట్టాడో మనం ఊహించుకుంటాం. అచ్చం మన కళ్ల ముందు ఆట జరుగుతున్నట్లే ఉంటుంది ఆ కామెంట్రీ వింటుంటే. అందుకే అంటారు “కామెంట్రీలేని మ్యాచ్.. ఊపిరి లేని శరీరం లాంటిది” ఊపిరే లేనప్పుడు ఇక శరీరం ఉన్నా ఒకటే.. లేకున్నా ఒకటే.. ఇక ఇండియా-పాక్ మ్యాచ్ విషయానికి వస్తే.. ప్రపంచం మెుత్తం ఈ మ్యాచ్ గురించే మాట్లాడుకుంటోంది. అందరు కోహ్లీ ఇన్నింగ్స్ గురించి మాట్లాడుకుంటుంటే.. నెట్టింట్లో ఓ వీడియో మాత్రం పూనకాలు తెప్పిస్తోంది. ఆ వీడియో ఏంటంటే? కామెంట్రీ బాక్స్ లో కామెంటేటర్ లు వీర లెవల్లో కామెంట్రీ ఇవ్వడం ప్రస్తుతం వైరల్ గా మారింది.
కోహ్లీ బ్యాటింగ్ కు ఫిదా అయిన కామెంటేటర్స్.. కూర్చిలోంచి లేచి మరి గట్టిగా అరుస్తూ.. కామెంట్రీ ఇచ్చారు. హారీస్ రౌఫ్ బౌలింగ్ లో వరుసగా రెండు సిక్స్ లు బాదాడు కోహ్లీ.. దాంతో ఒక్కసారిగా కామెంటేటర్ కుర్చీ లోంచి లేచి గట్టిగా అరుస్తూ..”కోహ్లీ కింగ్ ఏ కాదు అతడు జీనియస్” అంటూ పొగడ్తలతో ముంచెత్తాడు. ఇంతలా ఆడుతుంటే ప్రపంచం ఊపిరెలా పీల్చుకుంటుంది అంటూ మ్యాచ్ గురించి మాట్లాడారు. ఇక ఈ వీడియో చూసిన నెటిజన్లు పలు రకాలుగా స్పందిస్తున్నారు. “వాట్ ఏ కామెంట్రీ సర్ కళ్ల ముందే మ్యాచ్ జరుగుతున్నట్లు వివరిస్తున్నారు” అని కొందరంటే.. మరికొందరేమో కామెంట్రీ బాక్స్ లో పూనకాలు తెప్పించారు సర్” అంటూ ప్రశంసించారు. వీరావేశంతో కామెంట్రీ చెప్తు.. మైదానంలో అతడే ఆడుతున్నంతగా ఎగ్జైట్ కు గురయ్యాడు కామెంటేటర్. అతడి ఆవేశాన్ని చూసి బాక్స్ లో ఉన్న మిగతా సభ్యులు ఆశ్చర్యానికి లోనైయ్యారు. ఇది కదా ఇండియా-పాక్ మ్యాచ్ రేంజ్ అంటూ పలువురు నెటిజన్లు కామెంట్స్ చేశారు.
Mental stuff !!! #INDvPAK
— …. (@ynakg2) October 23, 2022
A packed MCG chanting for Virat Kohli 🏟
Raw vision: Behind the scenes of India’s sensational win 📹
Goosebumps. #T20WorldCup | #INDvPAK pic.twitter.com/MNjmOLKO7r
— ICC (@ICC) October 23, 2022