IPL 2023 ప్రారంభానికి ఒక్కరోజు ముందు దినేశ్ కార్తీక్ కు బంపర్ ఆఫర్ వచ్చింది. దాంతో ఇండియా నుంచి ఈ గౌరవం దక్కించుకున్న ఒకే ఒక్కడిగా ఈ ఫినిషర్ నిలిచాడు. మరి ఆ ఆఫర్ ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.
IPL 2023 కోసం క్రికెట్ అభిమానులు ఎంతగానో ఎదురు చూస్తున్నారు. వారి ఎదురు చూపులకు తెర పడుతూ.. మరికొన్ని గంటల్లో క్రికెట్ మహా సంగ్రామం ప్రారంభం కానుంది. ఈ నేపథ్యంలో టీమిండియా స్టార్ ఫినిషర్, ఆర్సీబీ కీ ప్లేయర్ అయిన దినేశ్ కార్తీక్ ఓ భారీ అనౌన్స్ మెంట్ ఇచ్చాడు. ఆ అనౌన్స్ మెంట్ తో ఈ అవకాశం దక్కించుకున్న ఏకైక భారత ప్లేయర్ గా డీకే నిలిచాడు. ఇక ఈ అవకాశం రావడం గొప్ప గౌరవంగా భావిస్తున్నాను అంటూ సంతోషం వ్యక్తం చేశాడు డీకే. మరి ఆ గౌరవం ఏంటి? డీకే చేసిన ఆ ప్రకటన ఏంటి? అన్న విషయాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
దినేశ్ కార్తీక్.. పడిలేచిన ఓ కెరటం. టీమిండియాలో చోటు కోల్పోయి సుదీర్ఘకాలం తర్వాత మళ్లీ జట్టులో స్థానం దక్కించుకున్నాడు. ఈ క్రమంలోనే స్టార్ ఫినిషర్ గా టీమిండియాలో డీకే ఎదిగిన తీరు అమోఘం. ఇక ప్రస్తుతం ఐపీఎల్ కోసం క్రికెటర్లంతా తమ తమ జట్లతో కలిసి ఇప్పటికే ప్రాక్టీస్ మెుదలు పెట్టారు. కాగా రాయల్ ఛాలెంజర్స్ తరుపున ఫినిషర్ గా బరిలోకి దిగబోతున్నాడు దినేశ్ కార్తీక్. ఈసారి ఎలాగైనా ఆర్సీబీకి కప్ అందించాలని ఆరాటపడుతున్నాడు. ఇక ఐపీఎల్ ప్రారంభానికి ముందే ఓ ఆసక్తికర ప్రకటన చేశాడు డీకే. అసలు విషయం ఏంటంటే?
ఈ ఐపీఎల్ అవ్వగానే కామెంట్రీ బాక్స్ లోకి అడుగుపెట్టబోతున్నాడు డీకే. గతంలో టీ20 వరల్డ్ కప్ తర్వాత కామెంటేటర్ గా అవతారం ఎత్తాడు దినేశ్ కార్తీక్. తాజాగా జరిగిన బోర్డర్-గవాస్కర్ ట్రోఫీలో కూడా కామెంటేటర్ గా వ్యవహరించాడు డీకే. ఐపీఎల్, వరల్డ్ కప్, టెస్ట్ ఛాంపియన్ షిప్ ఫైనల్ తర్వాత వెంటనే ఇంగ్లాండ్-ఆస్ట్రేలియా మధ్య యాషెస్ సిరీస్ ప్రారంభం కానుంది. యాషెస్ సిరీస్ కు ఎంతటి క్రేజ్ ఉందో ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. ఈ సిరీస్ కోసం స్కై క్రికెట్ ఛానల్ తరపున డీకే కామెంట్రీ బాక్స్ లోకి అడుగుపెట్టబోతున్నాడు. ఈ విషయాన్ని అతడే స్వయంగా వెళ్లడించాడు. ఇక భారత్ నుంచి దినేశ్ కార్తీక్ ఒక్కడే ఇందులో చోటు దక్కించుకోవడం విశేషం. దాంతో ఇది తనకు దక్కిన గౌరవంగా భావిస్తున్నాను అంటూ చెప్పుకొచ్చాడు.
ఇక డీకేతో పాటుగా మోర్గాన్, పీటర్సన్, పాంటింగ్, మార్క్ టేలర్, సంగక్కరచ మెల్ జోన్స్, ఇయాన్ వార్డ్, అథెర్టన్, బౌచర్, నాసీర్ హుస్సేన్, అండ్రూ స్ట్రాస్ రానున్న యాషెస్ కోసం కామెంటేటర్లు గా వ్యవహరించనున్నారు. లెజెండ్స్ మధ్య ఒకడిగా ఉండటం గర్వకారణంగా ఉంది. ఇంత గొప్ప అవకాశం ఇచ్చిన స్కై క్రికెట్ కు ధన్యవాదాలు అంటూ ట్వీటర్ ద్వారా వెల్లడించాడు డీకే. కాగ గత ఐపీఎల్ సీజన్ లో 16 మ్యాచ్ ల్లో183 స్ట్రైక్ రేట్, 55 సగటుతో 330 పరుగులు చేశాడు దినేశ్ కార్తీక్. మరి ఈ సీజన్ లో ఏ విధంగా రాణిస్తాడో వేచి చూడాలి. అయితే ఐపీఎల్ ప్రారంభానికి ముందు ఏ భారత ఆటగాడికి దక్కని గౌరవం డీకేకి దక్కడంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
One MASSIVE announcement before the IPL as a player starts…
So proud to be amongst these legends. Surreal feeling.
Just felt like sharing!
Bas. That’s all 😊☺️
Thanks @SkyCricket for giving me this opportunity and honour. #Ashes2023 pic.twitter.com/bnYyLDOV0E
— DK (@DineshKarthik) March 30, 2023