హీరో, హోస్ట్ గా ఇప్పటికే చాలా పేరు తెచ్చుకున్న బాలయ్య.. తాజాగా క్రికెట్ కామెంటేటర్ అయిపోయారు. ఐపీఎల్ తొలి మ్యాచ్ కు తనదైన శైలిలో కామెంటరీ చెప్పి అందరినీ ఎంటర్ టైన్ చేశారు.
నందమూరి బాలకృష్ణ.. ఈ పేరు చెప్పగానే దాదాపు ప్రతిఒక్కరికీ మాస్ సినిమాలే గుర్తొస్తాయి. ఇప్పటికీ అదే తరహా సినిమాలు చేస్తూ ఫుల్ గా ఎంటర్ టైన్ చేస్తున్నారు. గత రెండేళ్లలో మాత్రం పూర్తిగా రూట్ మార్చేశారు. ‘అన్ స్టాపబుల్’ షోతో హోస్ట్ గా మారి వావ్ అనిపించారు. చెప్పాలంటే బాలయ్యలో ఈ యాంగిల్ కూడా ఉందా అని అందరూ అవాక్కయ్యేలా చేశారు. తాజాగా ముగిసిన రెండో సీజన్ లోనూ సరికొత్తగా కనిపించి ఆకట్టుకున్నారు. ఇక్కడితే ఆగిపోలేదు. ఇప్పుడు ఏకంగా క్రికెట్ కామెంటేటర్ గా మారిపోయారు. ఆల్రెడీ ఉన్నవాళ్లకు ఏ మాత్రం తీసిపోని విధంగా తనదైన శైలి కామెంటరీతో ఫుల్ గా అలరించారు.
ఇక వివరాల్లోకి వెళ్తే.. ఐపీఎల్-2023 కోసం హీరో బాలకృష్ణ కామెంటేటర్ గా మారారని తెలియగానే ఫ్యాన్స్ ఫస్ట్ షాకయ్యారు. ఆ తర్వాత ఎగ్జైట్ అయ్యారు. అదే టైంలో బాలయ్య రేంజ్ పెరగడం చూసి తెగ ముచ్చటపడిపోయారు. అందుకు తగ్గట్లే చెన్నై-గుజరాత్ మ్యాచ్ సందర్భంగా తెలుగు కామెంటరీ బాక్స్ లో కూర్చున్న బాలయ్య.. అక్కడి ఉన్నవాళ్లతో చాలా ఫాస్ట్ గా కలిసిపోయారు. మ్యాచ్ కు ముందు జరిగిన చర్చ కార్యక్రమంలో అలరించిన బాలయ్య.. కామెంటరీ దగ్గరకు వచ్చేసరికి తొలుత కాస్త తడబడ్డారు. కానీ కాసేపటికే తనలోని జోష్ ని పుల్ గా బయటకు తీశారు. తెలుగు, ఇంగ్లీష్ లో మాస్ పదాలతో కామెంటరీ చెబుతూ వ్యూయర్స్ కి తెగ ఆకట్టుకున్నారు.
కామెంటరీ సందర్భంగా మ్యాచ్, ఆటగాళ్ల గురించే కాదు మిగతా స్పోర్ట్స్, ఫిట్ నెస్ లాంటి అంశాల గురించి తన అభిప్రాయాల్ని పంచుకున్నారు. క్రీడలు.. శారీరకంగానే కాదు మానసిక ఒత్తిడి తగ్గించడానికి ఉపయోగపడతాయని అన్నారు. షేన్ వార్న్, పాల్ ఆడమ్స్, అనిల్ కుంబ్లే తనకు ఇష్టమైన బౌలర్లని బాలయ్య చెప్పారు. చెన్నై బ్యాటింగ్ చేస్తున్నప్పుడు.. 170 స్కోరు చేస్తుందని అంచనా వేశారు. దాదాపు అలానే జరిగింది. చెన్నై 178 పరుగులు చేయగా, గుజరాత్ ఆ టార్గెట్ ని పూర్తి చేసి.. ఈ మ్యాచులో విజయం సాధించింది. కాలేజీ రోజుల్లోనూ క్రికెట్ ఆడేవాడినని గుర్తు చేసుకున్న బాలయ్య.. చాలామంది క్రికటర్లతో తనకు పరిచయముందని చెప్పారు. బాలయ్య కామెంటరీ చెబుతున్నప్పుడు.. ఫ్యాన్స్ అందరూ జై బాలయ్య జై బాలయ్య అంటూ నినాదాలు చేయడం విశేషం. మరి బాలయ్య కామెంటరీ మీకెలా అనిపించింది. మీ అభిప్రాయాన్ని కింద కామెంట్ చేయండి.
Balayya in commentary #GTvsCSK #CricketTwitter #Telugutwitter pic.twitter.com/Qx0JTtT31u
— Bezawada Surayya (@rajadiraja007) March 31, 2023