షేన్ వార్న్.. క్రీడా ప్రపంచంలో ఈ పేరంటే తెలియని వారు ఉండరు. తన స్పిన్ తో దిగ్గజ బ్యాట్స్ మెన్ లకే చెమటలు పట్టించగల యోధుడు. ఇక అతడి బాల్ ఎటు తిరిగి.. ఎటు వస్తుందో తెలుసుకునే సరికే వికెట్ కూలుద్ది. ఇప్పటి వరకు షేన్ వార్న్ లా లెగ్ స్పిన్ వేయగల మరో బౌలర్ లేడనే చెప్పాలి. ఇంతటి ఘన చరిత్ర గల వార్న్.. ఈ ఏడాది ఫిబ్రవరిలో గుండెపోటుతో థాయ్ లాండ్ లోని తన సొంత విల్లాలో కన్నుమూశాడు. దింతో క్రీడాలోకం మెుత్తం ఒక్కసారిగా దిగ్బ్రాంతికి గురైంది. అతడు మన నుంచి దూరం అయినా గానీ అతడి జ్ఞాపకాలు మాత్రం దూరం కాలేదు. ఈ రోజు సెప్టెంబర్ 13 షేన్ వార్న్ పుట్టిన రోజు. ఈ సందర్భంగా క్రికెట్ గాడ్ సచిన్ టెండుల్కర్ వార్న్ తో ఉన్నఅనుబంధాన్ని గుర్తు చేసుకున్నాడు. ప్రస్తుతం సచిన్ చేసిన ట్వీటర్ పోస్ట్ నెట్టింట వైరల్ గా మారింది. ఈ వార్తకు సంబంధించి మరిన్ని వివరాల్లోకి వెళితే..
షేన్ వార్న్.. బౌలింగ్ కు దిగుతున్నాడు అంటే ప్రత్యర్థికి హడలే. అలా అని అతడు మెరుపు వేగంతో ఏమీ బంతులు వెయ్యడు.. రెండు అడుగులు అలా పరిగెత్తుకు వచ్చి బాల్ విసురుతాడు అంతే.. ఆ బంతి గిర గిరా.. తిరుగుతూ.. వికెట్లను గిరాటేసేదాక తెలిదు మనకు. అంతటి కనికట్టు ఉంది ఆ మణికట్టులో. అయితే ఈ మణికట్టుకు లొంగని ఒకే ఒక్క బ్యాట్స్ మెన్ సచిన్ అని వార్న్ చాలా సందర్భాల్లో చెప్పాడు. అలాగే సచిన్ సైతం వార్న్ బౌలింగ్ లో ఆడటానికి ఇష్ట పడతానని పలు సందర్భాల్లో వెల్లడించాడు. టోర్నీల సందర్బంగా వీరిద్దరు చాలా సరదాగా ఉండేవారు. అయితే వార్న్ మరణం నన్ను కలచివేసిందని సచిన్ గతంలో చెప్పాడు. ఇక వార్న్ పుట్టిన రోజు సందర్భంగా సచిన్ ఓ ఎమోషనల్ పోస్ట్ ను ట్వీటర్ లో పోస్ట్ చేశాడు. దాంట్లో ఈవిధంగా రాసుకొచ్చాడు..”మిత్రమా నీ పుట్టిన రోజు సందర్బంగా నేను నీ గురించే ఆలోచిస్తున్నాను. మనం కలిసి ఆడిన ఆ క్షణాలు ఎంతో మధురం.. కాలం చాలా త్వరగా గడిచిపోయింది. నువ్వెప్పటికీ నాకు ప్రియ సహచరుడివే” అంటూ తన వార్న్ పై తనకున్న భావాన్ని వ్యక్తపరిచాడు.
ప్రస్తుతం ఈ పోస్ట్ నెట్టింట వైరల్ గా మారింది. ఈనేపథ్యంలోనే మరో ఆసక్తికర విషయం ఏంటంటే? వార్న్ ట్వీటర్ ఖాతా నుంచి ఓ మెసేజ్ తాజాగా పోస్ట్ అయ్యింది. ఇప్పుడు ఆ మెసేజ్ వైరల్ గా మారింది. దాంట్లో ఈవిధంగా రాసుంది..”షేన్ వార్న్ వారసత్వం ఎప్పటికీ బతికే ఉంటుంది. వారసత్వం గొప్ప దృక్పథాన్ని అందిస్తుంది. మీరు సాధించిన విజయాల గురించి.. అక్కడి ప్రజలు, అక్కడి ప్రాంతాలే మాట్లాడుతాయి. మీరెప్పుడూ మా హృదాయాల్లోనే నిలిచి ఉంటారు.. హ్యాపీ బర్త్ డే షేన్ వార్న్” అంటూ రాసుకొచ్చారు. అయితే వార్న్ ఖాతాను వారి ఇంటి సభ్యులు ఎవరైనా వాడుతున్నారేమో అని కొందరు కామెంట్స్ చేస్తున్నారు. మరి సచిన్ చేసిన ట్వీట్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
Thinking of you on your birthday Warnie!
Gone too soon. Had so many memorable moments with you.
Will cherish them forever mate. pic.twitter.com/0a2xqtccNg— Sachin Tendulkar (@sachin_rt) September 13, 2022
A legacy gives you a perspective on what’s important.
It is about the richness of an individual’s life, including what they accomplished and the impact they had on people and places.
Shane’s Legacy will live on.
Happy birthday – always in our hearts 🤍🤍🤍 pic.twitter.com/qL5NPIZnUk
— Shane Warne (@ShaneWarne) September 12, 2022