చాలా రోజులుగా అవకాశం కోసం కాచుకుని కూర్చున్న కుల్దీప్ యాదవ్, రవి బిష్ణోయ్.. వెస్టిండీస్‌తో మ్యాచ్‌లో ఆకలితో ఉన్న పులుల్లా పంజా విసిరారు. వారికి ఆల్‌రౌండర్ అక్షర్ పటేల్ కూడా తోడవడంతో పేసర్లకు ఒక్కటంటే ఒక్క వికెట్ కూడా ఇవ్వలేదు. 10కి 10 వికెట్లు ఈ ముగ్గురు స్పిన్నర్లే తీసుకున్నారు. దీంతో ఒక ప్రపంచ రికార్డును నమోదు చేశాడు.
భారత్-వెస్టిండీస్ మధ్య ఐదు టీ20ల సిరీస్‌లో భాగంగా ఆదివారం ప్లోరిడాలో ఆఖరి మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన టీమిండియా నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్లు నష్టపోయి 188 పరుగులు చేసింది. ఈ మ్యాచ్‌లో వన్‌డౌన్ బ్యాటర్ శ్రేయస్ అయ్యర్‌ను ఓపెనర్‌గా పంపి భారత్ మరో ప్రయోగం చేసింది. ఈ ప్రయోగం మంచి ఫలితాన్ని ఇచ్చింది. అయ్యర్ 40 బంతుల్లో 8 ఫోర్లు, 2 సిక్సులతో 64 పరుగులు చేసి అదరగొట్టాడు. అతనితో పాటు వచ్చిన మరో ఓపెనర్ ఇషాన్ కిషన్(11) మాత్రం నిరాశ పరిచాడు.
ఇక వన్‌డౌన్‌లో వచ్చిన దీపక్ హుడా 25 బంతుల్లో 3 ఫోర్లు, 2 సిక్సులతో 38 పరుగులు చేసి రాణించాడు. ఈ మ్యాచ్‌లో కెప్టెన్‌గా వ్యవహరించిన హార్దిక్ పాండ్యా 16 బంతుల్లో 2 ఫోర్లు, 2 సిక్సులతో 28 పరుగులు చేసి ధాటిగా ఆడాడు. దీంతో భారత్ విండీస్ ముందు 189 పరుగుల టార్గెట్ ఉంచింది. లక్ష్యఛేదనకు దిగిన విండీస్‌ను అక్షర్ పటేల్ తొలి ఓవర్‌లోనే దారుణంగా దెబ్బతీశాడు. ఈ మ్యాచ్‌లో అనూహ్యంగా ఓపెనర్ స్థానంలో వచ్చిన జాసన్ హోల్డర్‌ను బౌల్డ్ చేశాడు. ఆ వెంటనే 5 వ ఓవర్‌లో బ్రూక్స్, థామస్‌ను పెవిలియన్ చేర్చాడు.
ఇక్కడి నుంచి రవి బిష్ణోయ్, కుల్దీప్ యాదవ్ ద్వయం విండీస్‌ను ఊపిరి సలపనివ్వలేదు. వచ్చిన వారిని వచ్చినట్లే పెవిలియన్‌కు పంపుతూ.. విండీస్‌ను కేవలం 100 పరుగులకే ఆలౌట్ చేశాడు. వెస్టిండీస్ ఇన్నింగ్స్‌లో హెట్‌మేయర్ ఒక్కడే 56 పరుగులతో రాణించాడు. అతనొక్కడే 56 పరుగులు చేయగా.. 8 పరుగులు ఎక్స్‌ట్రా రూపంలో వచ్చాయి. మిగిలిన 36 పరుగులు మిగతా జట్టు మొత్తం కలిసి చేసింది. ముగ్గురు టీమిండియా స్పిన్నర్లు విండీస్‌కు ఇంతటి దారుణ ఓటమిని చూపించారు.
ఈ మ్యాచ్‌లో అక్షర్ పటేల్ 3 ఓవర్లు వేసి కేవలం 15 పరుగులు మాత్రమే ఇచ్చి 3 వికెట్లు తీసుకున్నాడు. కుల్దీప్ యాదవ్ 4 ఓవర్లు వేసి 12 పరుగులు మాత్రమే ఇచ్చి 3 వికెట్లు పడగొట్టాడు. రవిబిష్ణోయ్ 2.4 ఓవర్లు వేసి 16 పరుగులు ఇచ్చి 4 వికెట్లు తీశాడు. కాగా ఈ మ్యాచ్‌లో అర్షదీప్ సింగ్, ఆవేశ్ ఖాన్, కెప్టెన్ పాండ్యాకు ఒక్క వికెట్ కూడా దక్కలేదు. మొత్తం పదికి పది వికెట్లు ముగ్గురు స్పిన్నర్లు మాత్రమే పడగొట్టారు. టీ20 క్రికెట్‌లో మొత్తం పది వికెట్లను స్పిన్నర్లే పడగొట్టడం చరిత్రలోనే ఇదే మొదటిసారి. దీంతో భారత స్పిన్నర్లు ఈ మ్యాచ్‌తో చరిత్ర సృష్టించారు. మరి ఈ రికార్డుపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
Kuldeep Yadav picked up 3/15 on his return in T20I.
#KuldeepYadav #INDvsWI pic.twitter.com/gAwT6NkhiC— CRICKET VIDEOS🏏 (@Abdullah__Neaz) August 7, 2022
A memorable outing from India spinners 🔥👏#RaviBishnoi #India #WIvsIND #Cricket #KuldeepYadav #AxarPatel pic.twitter.com/9DBceL1orE
— Wisden India (@WisdenIndia) August 7, 2022