ఆస్ట్రేలియాపై తొలి టెస్టులో టీమిండియా ఆధిపత్యం కొనసాగుతోంది. ఓవరాల్ గా టీమిండియా ప్రదర్శన ఆకట్టుకుంటోంది. కానీ, కేఎల్ రాహుల్ మరోసారి విఫలమవడంతో.. జట్టులో అతని స్థానంపై మరోసారి చర్చ మొదలైంది.
బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ-2023లో భాగంగా జరుగుతున్న తొలి టెస్టులో టీమిండియా ఆధిపత్యం కొనసాగుతోంది. తొలి ఇన్నింగ్స్ లో 400 పరుగులకు ఆలౌట్ అయ్యింది. తొలి ఇన్నింగ్స్ లో భారత్ కు 223 పరుగుల ఆధిక్యం లభించింది. టీమిండియా బ్యాటింగ్ విషయానికి వస్తే.. రోహిత్(120), అక్షర్ పటేల్(84), జడేజా(70), షమీ(37) ఆకట్టుకున్నారు. కేఎల్ రాహుల్ ఆశించిన స్థాయిలో ఆకట్టుకోలేకపోయాడు. ఇప్పుడు కేఎల్ రాహుల్ ప్రదర్శనపై మరోసారి టీమిండియా అభిమానులు, నెటిజనులు విమర్శలు చేయడం మొదలు పెట్టారు. అయితే రాహుల్ కు టీమిండియా బ్యాటింగ్ కోచ్ అండగా నిలిచాడు. కేఎల్ రాహుల్ విషయంలో విక్రమ్ రాథౌర్ కీలక వ్యాఖ్యలు చేశాడు.
ఆస్ట్రేలియాపై జరుగుతున్న తొలి టెస్టు తొలి ఇన్నింగ్స్ లో కేఎల్ రాహుల్ మరోసారి నిరాశ పరిచాడు. సంవత్సరకాలంగా కేఎల్ రాహుల్ బ్యాటింగ్ విషయంలో ఇబ్బంది పడుతున్న విషయం తెలిసిందే. జట్టులో అతని స్థానంపై కూడా పెద్దఎత్తున చర్చ జరుగుతోంది. కేఎల్ రాహుల్ కు పదే పదే అవకాశం కల్పించడంపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. డబుల్ సెంచరీ చేసి మంచి ఫామ్ లో ఉన్న శుభ్ మన్ గిల్ ని పక్కనపెట్టి రాహుల్ కి స్థానం కల్పించడాన్ని అంతా ఓపెన్ గానే ప్రశ్నిస్తున్నారు. రెండోరోజు ఆట ముగిసిన తర్వాత టీమిండియా బ్యాటింగ్ కోచ్ విక్రమ్ రాథౌర్ కి కూడా మీడియా నుంచి ఇదే ప్రశ్న ఎదురైంది.
Vikram rathour said that it is too early to think about dropping kl rahul because he has 2 overseas centuries and a couple of 50s in his last 10 matches.|
and rightly so, he has been one of our best test batters in the last couple of yrs.
hope u come back strong champ #KLRahul𓃵 pic.twitter.com/0Nd0GqTyO4— Indian Cricket Fan♥🇮🇳 (@krs1646) February 10, 2023
‘అసలు జట్టులో కేఎల్ రాహుల్ అవసరమా?’.. అనే ప్రశ్న మీడియా నుంచి విక్రమ్ కు ఎదురైంది. ఆ సమయంలో కేఎల్ రాహుల్ గురించి విక్రమ్ కొన్ని కీలక వ్యాఖ్యలు చేశాడు. “కేఎల్ రాహుల్ ఆడిన గత 10 టెస్ట్ ఇన్నింగ్స్ చూసుకుంటే అందులో శతకాలు, అర్ధ శతకాలు ఉన్నాయి. సౌతాఫ్రికా, ఇంగ్లాండ్ తో సిరీస్ లలో రాహుల్ శతకాలు నమోదు చేశాడు. అతడిని జట్టు నుంచి తప్పించాలి అనే ఆలోచనలో మేము లేము” అంటూ వ్యాఖ్యానించాడు. రాహుల్ కూడా కోహ్లీ, రోహిత్ లాంటి ప్లేయర్ అన్న విధంగా అతడిని సమర్థించుకుంటూ వచ్చాడు. విక్రమ్ వ్యాఖ్యలపై సోషల్ మీడియాలో భిన్నాభిప్రాయాలు వినిపిస్తున్నాయి.
last 10 matches, all are away from home pic.twitter.com/sOmmLAKrnO
— Indian Cricket Fan♥🇮🇳 (@krs1646) February 10, 2023