క్రికెట్‌లో అప్పుడప్పుడు వినిపించి దడపుట్టించే పదం మ్యాచ్ ఫిక్సింగ్. ఈ మహమ్మరి కొన్ని సార్లు క్రికెట్ విలువును దిగజార్చింది కూడా. ఆటగాళ్లు పరువు మర్యాదలను మంటగలిపి, ఆటను అసహించుకునేలా చేసిన సందర్భాలు అనేకం. టీమిండియా జట్టులోనూ ఈ భూతం తన ప్రతాపం చూపింది. ఇండియన్ క్రికెట్‌లో అత్యుత్తమ కెప్టెన్‌గా పేరొందిన అజహరుద్దీన్, స్టైలిష్ ఆల్‌రౌండర్‌గా ఉన్న అజయ్ జడేజా, స్పీడ్‌స్టర్ శ్రీశాంత్ ఈ ఫిక్సింగ్ భూతానికి బలైన వారే. అలాగే.. పాకిస్థాన్ మాజీ కెప్టెన్ వసీం అక్రమ్‌పై కూడా ఈ మ్యాచ్ ఫిక్సింగ్ ఆరోపణలు ఉన్నాయి. 1996 వరల్డ్ కప్ సందర్భంగా క్వార్టర్ ఫైనల్లో టీమిండియాతో ఆడిన మ్యాచ్‌లో వసీం మ్యాచ్ ఫిక్సింగ్ పాల్పడినట్లు ఇప్పటికీ విశ్వసించే వారు కోకొల్లలు. కానీ.. దాదాపు 26 ఏళ్ల తర్వాత ఆ విషయంపై వసీం అక్రమ్ స్పందించి సంచలన సృష్టించాడు.
1996 వన్డే వరల్డ్ కప్ సమయంలో పాక్ కెప్టెన్‌గా ఉన్న వసీం అక్రమ్ మంచి ఫామ్‌లో ఉన్నాడు. సూపర్ బౌలింగ్‌తో అదరగొడుతున్నాడు. పాక్ టీమ్ కూడా మంచి ప్రదర్శన కనబరుస్తోంది. క్వార్టర్ ఫైనల్‌లో చిరకాల ప్రత్యర్థి టీమిండియాతో పాకిస్థాన్ మ్యాచ్ ఆడాల్సి ఉంది. మ్యాచ్ ఆరంభమైన తర్వాత పాక్ కెప్టెన్ వసీం అక్రమ్ మ్యాచ్ ఆటడం లేదనే విషయం తెలిసింది. దీంతో అందరూ షాక్‌కు గురయ్యారు. మంచి ఫామ్‌లో ఉన్న ప్లేయర్.. అందులోనూ కెప్టెన్ వరల్డ్ కప్ క్వార్టర్ ఫైనల్ లాంటి కీలక మ్యాచ్‌లో ఆడకపోవటం ఏంటనే ప్రశ్నలు ఉత్పన్నమయ్యాయి. పైగా మ్యాచ్ ఇండియాతో.. దీంతో పాక్ కెప్టెన్ మ్యాచ్ ఫిక్సింగ్ పాల్పడ్డరనే విమర్శలు, ఆరోపణలు వచ్చాయి.
వసీం మ్యాచ్‌లో బరిలో దిగడం లేదని మ్యాచ్‌కు ముందు పాకిస్థాన్ క్రికెట్ బోర్డు కానీ, టీమ్ మేనేజ్‌మెంట్ కానీ చెప్పలేదు. పైడా ఆ మ్యాచ్‌లో పాకిస్థాన్ ఓడిపోయి ఇంటిదారి పట్టింది. టీమిండియా సెమీస్‌కు దూసుకెళ్లింది. దీంతో వసీం అక్రమ్ ఆడిఉంటే పాకిస్థాన్ గెలిచి ఉండేదని, అతను కచ్చితంగా మ్యాచ్ ఫిక్సింగ్‌కు పాల్పడ్డాడనే విశ్వాసం మరింత బలపడింది. ఈ సంఘటన జరిగిన దాదాపు 26 ఏళ్లు గడుస్తున్నా.. వసీం అక్రమ్‌ను ఇంకా ఆ మ్యాచ్ తాలుకూ ప్రకంపణలు తాకుతూనే ఉన్నాయి. వాటికి ఇన్నేళ్ల తర్వాత నోరు విప్పి జవాబు చెప్పారు వసీం అక్రమ్.
ప్రస్తుతం ఆస్ట్రేలియా వేదికగా జరుగుతున్న టీ20 వరల్డ్ కప్ 2022 సందర్భంగా విశ్లేషణలో పాల్గొన్న పాకిస్థాన్ మాజీ కెప్టెన్ వసీం అక్రమ్‌కు పాక్ క్రికెట్ అభిమాని నుంచి ఊహించని ప్రశ్న ఎదురైంది. ‘1996 వన్డే వరల్డ్ కప్‌లో భారత్‌తో జరిగిన క్వార్టర్‌ఫైనల్ మ్యాచ్ గురించి చెప్పాలి’ అని పాక్ అభిమాని వసీంను కోరాడు. దీంతో వసీం కొంత అసహనానికి గురై.. ‘అప్పటి విషయం గురించి ఇప్పుడు చెప్పాల్సిన సమయం వచ్చిందని, లేకుంటే.. ఈ తరం యువత పుకార్లు నమ్మే స్థితిలో ఉన్నారు. అసలు ఆ రోజు ఏం జరిగిదంటే.. భారత్‌తో క్వార్టర్‌ఫైనల్ మ్యాచ్‌కు ముందు న్యూజిలాండ్‌తో ఆడిన మ్యాచ్‌లో నేను గాయపడ్డాను. నా తొడకండరాలు పట్టేశాయి. అప్పటికీ రెండు పేయిన్ కిల్లర్ ఇంజెక్షన్లు ఇచ్చారు. అయినా ఫలితం లేకపోయింది.
నేను మ్యాచ్ ఆడే పరిస్థితిలో లేను. అందుకే ఆ రోజు భారత్‌తో మ్యాచ్ ఆడలేదు. ఒక వేళ నేను ఆ నొప్పితో మ్యాచ్ ఆడినా.. నన్ను ఇంకా ఎగతాళి చేసేవారు. జట్టులో మరో ప్లేయర్ లేడా.. చెతకానప్పుడు ఎందుకు ఆడాలని అనేవారు. అలాగే నాకు గాయమైన విషయం కావాలనే టీమ్ మేనేజ్‌మెంట్ ఎవరీ చెప్పలేదు. ఎందుకంటే ప్రత్యర్థి జట్టులో కీలక ఆటగాడు గాయపడిన విషయం, మ్యాచ్ ఆడటం లేదనే విషయం టీమిండియాకు తెలిస్తే.. వారు మరింత స్వేచ్ఛగా ఆడే అవకాశం ఉంది. నన్ను ఎదుర్కొనేందుకు వాళ్ల వ్యూహ్యాల్లో వారు మునిగిపోయి ఉంటారు. వారిని అదే భయంలో ఉంచాలనే.. తన గాయం విషయం బయటపెట్టలేదు. ఇప్పుడు ఈ ప్రశ్న ఆడిన వ్యక్తి ఇంకా టైమ్‌లో పుట్టి ఉండడు. కనుక ఇలాంటి విషయాల్లో రూమర్లు నమ్మకండి. ’ అంటూ వసీం అక్రమ్ వివరణ ఇచ్చాడు.
Wasim Akram explains the reason why he couldn’t play the 1996 World Cup quarterfinal against India. pic.twitter.com/TF9dUqhRve
— Farid Khan (@_FaridKhan) October 18, 2022